EPAPER

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Motorola Edge 50 Neo Offers: మోటో నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది. ఫోన్ ప్రియులు ఎంతో ఆశగా, ఆసక్తిగా ఎదురుచూసిన Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ తాజాగా భారతదేశంలో లాంచ్ అయింది. ఇది సెగ్మెంట్‌లో అత్యంత వెర్సటల్ కెమెరాలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌గా వచ్చింది. ఈ ఫోన్ Edge 50 Fusion, Edge 50, Edge 50 Pro, Edge 50 Ultra ఫోన్‌లను ఫాలో అవుతుంది. కాగా మోటరోలా ఎడ్జ్ 50 నియో అత్యాధునిక స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ఇందులో ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్, అల్ట్రావైడ్, టెలిఫోటో సెన్సార్ వంటివి ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ pOLED డిస్‌ప్లేతో అందులోబాటులోకి వచ్చింది.


Motorola Edge 50 Neo Specifications

Motorola Edge 50 Neo స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 8GB LPDDR4x RAM + 256GB UFS 2.2 స్టోరేజ్‌తో వచ్చింది. అలాగే MediaTek డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీని ద్వారా ఇది అద్భుతమైన పనితీరును కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫోన్ సూపర్ HD 1.5K (2712 x 1220 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో 6.4-అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. వీటితో పాటు డిస్ప్లే LTPO టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అలాగే HDR10+కి మద్దతు ఇస్తుంది. స్క్రీన్ గరిష్టంగా 2,800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వచ్చింది.  అదే సమయంలో 460 PPI పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది.


Also Read: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

ఇక ఫోన్ సామార్థ్యానికి వస్తే.. ఇది 68W వైర్డ్, 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4310 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. అలాగే ఈ ఎడ్జ్ 50 నియోలో డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. ఇక Motorola Edge 50 Neo కెమెరా విషయానికొస్తే.. ఇందులో OIS సపోర్ట్‌తో 50MP Sony LYTIA-700C ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్‌ అందించారు. అలాగే 120° FOV, మాక్రో విజన్ సపోర్ట్‌తో 13MP అల్ట్రావైడ్ లెన్స్, చివరగా 10MP టెలిఫోటో యూనిట్‌తో zoom3x ఆప్టికల్ యూనిట్‌ను అందించారు. ఫోన్ ముందువైపు ఎడ్జ్ 50 నియో ఆటోఫోకస్‌తో కూడిన 32MP సెల్ఫీ కెమెరా అమర్చబడింది. Motorola Edge 50 Neo ఫోన్ Android 14-ఆధారిత Hello UIపై రన్ అవుతుంది. అలాగే Edge 50 Neoకి ఐదేళ్ల ఆండ్రాయిడ్ OS, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయని Motorola తెలిపింది. ఇక వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం Motorola Edge 50 Neo IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.

Motorola Edge 50 Neo Price And Offers

భారతదేశంలో Motorola Edge 50 Neo ఫోన్ 8GB/256GB మోడల్‌ ధర కేవలం రూ. 23,999 నుండి ప్రారంభమవుతుంది. ఇది PANTONE Poinciana, PANTONE Lattè, PANTONE Grisaille, PANTONE నాటికల్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ దీనిపై భారీ ఆఫర్‌లు కూడా ప్రకటించింది. Motorola Edge 50 Neo భారతదేశంలో సెప్టెంబర్ 24 నుండి Flipkart, Motorola.in సహా ఇతర ప్రముఖ రిటైల్ స్టోర్‌ల ద్వారా సేల్‌కు అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ కొనుగోలు దారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 1,500 వరకు తగ్గింపును పొందవచ్చు. అప్పుడు మరింత తక్కువకే ఈ ఫోన లభిస్తుంది.

Related News

NASA Records Black hole Sound: అంతరిక్షంలో అలజడి.. భయానక శబ్దాలను రికార్డ్ చేసిన నాసా.. ఇదిగో ఇక్కడ వినండి

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ ఆఫర్ల జాతర.. వన్‌ప్లస్, శాంసంగ్ ఫోన్లపై ఊహకందని డిస్కౌంట్లు!

Motorola razr 50: బ్లాక్ బస్టర్ డీల్.. మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్‌పై రూ.15,000 డిస్కౌంట్, డోంట్ మిస్‌ బ్రో!

Poco F6 5G Price Drop: ఇదేం ఆఫర్ సామీ.. ఏకంగా రూ.8000 డిస్కౌంట్, ఇప్పుడు తక్కువకే కొనేయొచ్చు!

Airtel Cheap Recharge Plan: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వెరీ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్, 1.5GB డేటా పొందొచ్చు!

Xiaomi 15 Series: షియోమి నుంచి కొత్త ఫోన్లు.. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో లాంచ్‌కు రెడీ, స్పెసిఫికేషన్లు అదిరిపోయాయ్!

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Big Stories

×