EPAPER

Moto X50 Ultra Mobile Sale: 125W ఫాస్ట్ ఛార్జింగ్‌, డాల్బీ సౌండ్ సిస్టమ్‌తో Moto X50 Ultra.. మే 24 న సేల్ !

Moto X50 Ultra Mobile Sale: 125W ఫాస్ట్ ఛార్జింగ్‌, డాల్బీ సౌండ్ సిస్టమ్‌తో Moto X50 Ultra.. మే 24 న సేల్ !

Moto X50 Ultra Sale Starts on May 24th: స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ మోటో తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో ఎక్స్50 అల్ట్రాను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్‌లో తీసుకొచ్చింది. ఫోన్‌లో OLED డిస్‌ప్లే  ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ ఇస్తుంది. 2500 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్‌‌తో వస్తుంది. ఫోన్ 4500mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. అలానే 125W ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఉంటుంది. ఇది కాకుండా భద్రత కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.


Motorola ఈ స్మార్ట్‌ఫోన్‌ను 12 GB RAM+ 512 GB స్టోరేజ్ మోడల్‌లో తీసుకొస్తుంది. టాప్ వేరియంట్ 16 GB RAM, 1TB స్టోరేజ్‌ రూ. 54,000 వస్తుంది. ఇది నార్డిక్ వుడ్, ఫారెస్ట్ గ్రే వేగన్ లెదర్, పీచ్ ఫజ్ వంటి షేడ్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌ను Lenovo వెబ్‌సైట్‌ నుండి దక్కించుకోవచ్చు. దీని కోసం ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మే 24 నుండి ఫోన్ సేల్‌కి వస్తుంది.

Also Read: వచ్చే వారం లాంచ్ అయ్యే కిల్లర్ మొబైల్స్ ఇవే.. ఏ బ్రాండ్ ఫోన్ తీసుకోవాలంటే?


Moto X50 అల్ట్రా 2712 x 1220 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ 2500 నిట్‌ల పిక్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. మోటరోలా ఫోన్‌‌లో స్క్రీన్ ప్రొటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ను ఇన్‌స్టాల్ చేసింది.

స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 SoC ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ 14లో పనిచేస్తుంది.  ఇది 50 మెగాపిక్సెల్ బ్యాక్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ఇదే లెన్స్‌ను మాక్రో షాట్‌ల కోసం కూడా ఉపయోగించవచ్చు. మూడవ సెన్సార్ 64-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, ఇది 3X జూమ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఫోన్ 100x వరకు జూమ్ చేయడానికి సపోర్ట్ ఇస్తుంది. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

Also Read: మోడ్రన్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో సామ్‌సంగ్ నుంచి చీపెస్ట్ ఫోన్..!

Moto X50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో 4500mAh బ్యాటరీ ఉంది. ఇది 125W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ కలిగి ఉంది. అంతేకాకుండా 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. కనెక్టివిటీ కోసం 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7 802.11ax, బ్లూటూత్ 5.4, GPS, NFC, USB టైప్-సిలను కలిగి ఉంటుంది. ఫోన్‌లో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్‌తో పాటు డాల్బీ హెడ్ ట్రాకింగ్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు.

Tags

Related News

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Big Stories

×