EPAPER

Moto G85 5G Launched: ఏంటి భయ్యా ఈ అరాచకం.. కర్వ్డ్ పోలెడ్ డిస్‌ప్లేతో మోటో కొత్త ఫోన్.. ధర చాలా తక్కువ..!

Moto G85 5G Launched: ఏంటి భయ్యా ఈ అరాచకం.. కర్వ్డ్ పోలెడ్ డిస్‌ప్లేతో మోటో కొత్త ఫోన్.. ధర చాలా తక్కువ..!

Moto G85 5G Launched with Snapdragon 6s Gen 3 chipset: ప్రముఖ టెక్ బ్రాండ్ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ తన ఆదిపత్యాన్ని కనబరుస్తుంది. రకరకాల మోడళ్లు తీసుకొస్తూ స్మార్ట్‌ఫోన్ యూజర్లను అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటికే పలు మోడళ్లతో మంచి క్రేజ్ అందుకున్న మోటోరోలా.. తాజాగా మరొక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటో కంపెనీ తన Moto G85 5G స్మార్ట్‌ఫోన్‌ని బుధవారం భారతదేశంలో లాంచ్ చేసింది.


ఈ కొత్త Moto G సిరీస్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 చిప్‌సెట్‌తో గరిష్టంగా 12GB RAMతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. Moto G85 5G ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఇక భారతదేశంలో Moto G85 5G ధర విషయానికొస్తే.. భారతదేశంలో Moto G85 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.17,999 ధరతో లాంచ్ అయింది. అదే సమయంలో 12GB RAM + 256GB స్టోరేజ్ కలిగిన టాప్-ఎండ్ వేరియంట్ రూ.19,999 ధరతో రిలీజ్ అయింది. ఇది ఆలివ్ గ్రీన్, కోబాల్ట్ బ్లూ, అర్బన్ గ్రే వంటి కలర్ ఆప్షన్లలో వచ్చింది. ఈ ఫోన్‌ను Flipkart, Motorola.in ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే దేశంలోని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో జూలై 16 నుండి సేల్‌కు అందుబాటులో ఉండనున్నాయి. Moto G85 5Gని కొనుగోలు చేసేటప్పుడు పాత ఫోన్ విలువపై తక్షణ బ్యాంక్ తగ్గింపు రూ.1,000 పొందొచ్చు. లేదా ఎక్స్ఛేంజ్ బోనస్‌ రూ.1,000 లభిస్తుంది. అప్పుడు దీనిని మరింత తక్కువకే సొంతం చేసుకోవచ్చు. అలాగే వినియోగదారులు తొమ్మిది నెలల నో-కాస్ట్ EMI ఆఫర్‌లను కూడా పొందవచ్చు.


Also Read: 4 ఏళ్ల వారంటీతో మోటోరోలా నుంచి మ్యాజిక్ ఫోన్.. ఈ సారి మామూలుగా ఉండదు మరీ

Moto G85 5G Specifications

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారిత హలో UIపై నడుస్తుంది. ఇది 6.67-అంగుళాల పూర్తి HD+ 3D కర్వ్డ్ పోలెడ్ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అలాగే 240Hz టచ్ శాంపిల్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది Qualcomm Snapdragon 6s Gen 3 చిప్‌సెట్‌తో పాటు Adreno 619 GPU, 12GB RAM + 256GB UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో నడుస్తుంది. ఆప్టిక్స్ కోసం.. Moto G85 5G ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ Sony Lytia 600 ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు సింగిల్ LED ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇది సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

Moto G85 5Gలోని కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్, Wi-Fi, GPS, A-GPS, GLONASS, గెలీలియో, LTEPP, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇది IP52-రేటెడ్ వాటర్-రిపెల్లెంట్ బిల్డ్‌లో వస్తుంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. Moto G85 5G.. 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ 34 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది. ఇది రెండు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లను, నాలుగు సంవత్సరాల సేఫ్టీ అప్‌గ్రేడ్‌లను పొందుతుంది.

Tags

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×