E-Paper
Advertisement

Insect Brain : ఇన్‌సెక్ట్ బ్రెయిన్‌తో రోబో తయారీ..

Insect Brain : ఇన్‌సెక్ట్ బ్రెయిన్‌తో రోబో తయారీ..
Advertisement
Insect Brain

Insect Brain : బయోలజీ, టెక్నాలజీ.. ఈ రెండు కలిస్తే ఊహించని అద్భుతాలు జరుగుతాయని శాస్త్రవేత్తలు ఎప్పుడో అంచనా వేశారు. అందుకే గత కొన్నేళ్లుగా ఈ కోణంలో పరిశోధనలు జరిపించడం మొదలుపెట్టారు. ఇప్పటికే పలు రోబోలకు మనుషుల, జంతువుల సామర్థ్యంతో పనిచేసే టెక్నాలజీని అమర్చారు. తాజాగా అలాంటి మరో రోబో తయారీ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. ఈసారి రోబోకు ఒక కీటకం మెదడును అమర్చి సక్సెస్ అయ్యారు శాస్త్రవేత్తలు.

బయోరోబోటిక్స్ సెక్టార్ అన్నది రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది. హ్యామనాయిడ్ రోబోలను తయారు చేయడానికి, దానిని మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే తాజాగా ఒక ఇన్‌సెక్ట్ మెదడుతో రోబోను తయారు చేసే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు సక్సెస్ సాధించారు. ఈ టెక్నాలజీ డిఫెన్స్, పోలీస్, నేషనల్ సెక్యూరిటీ రంగాల్లో అద్భుతం సృష్టించనుందని వారు చెప్తున్నారు. సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ముందుగా ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

Advertisement

రోబోలకు బ్రెయిన్‌ను అమర్చడం వల్ల అది చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇవి చుట్టు పక్కన ఉన్న ప్రాంతాలను ఫోటో తీయడంతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడ పర్యావరణానికి అలవాటు పడడానికి ప్రయత్నిస్తుంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రోబోలు వాటి అనుకూల పరిస్థితుల్లో మాత్రమే సమర్ధవంతంగా పనిచేస్తాయి. కానీ కొత్తగా వచ్చిన టెక్నాలజీతో తయారైన రోబోలు ఏ వాతావరణంలో అయినా అడ్జస్ట్ అయిపోతాయని తెలుస్తోంది.

ప్రతీ ఒక్క వాతావరణానికి అడ్జస్ట్ అయ్యే రోబోలను తయారు చేయడం వల్ల రోబోటిక్స్‌లో కొత్త మార్పులు రానున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనికి ఇన్‌సెక్ట్స్‌ను సాయంగా తీసుకుంటున్నారు. ఈ ఇన్‌సెక్ట మెదడుతో తయారు చేసిన రోబోలు.. డ్రోన్లను, స్పై బెలూన్లను కొన్ని కిలోమీటర్ల దూరం నుండే కనిపెట్టి ఫోటో తీయగలవు. అందుకే ఇవి డిఫెన్స్‌లో ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. త్వరలోనే వీటిపై పూర్తిస్థాయి ప్రయోగాలు పూర్తయ్యి మార్కెట్లోకి రానున్నాయి.

Tags

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×