BigTV English
Advertisement

Computer Technology: మనిషి మెదడు, గుండె సామర్ధ్యంతో కంప్యూటర్ తయారీ..

Computer Technology: మనిషి మెదడు, గుండె సామర్ధ్యంతో కంప్యూటర్ తయారీ..

నాగరికతను మార్చే టెక్నాలజీలలో కంప్యూటర్ ముఖ్య పాత్రను పోషిస్తుందని నిపుణులు చెప్తుంటారు. కానీ గత కొన్నేళ్లలో కంప్యూటర్ టెక్నాలజీలను శాసించే ఎన్నో టెక్నాలజీలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ లేకముందు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కేవలం కంప్యూటర్ మాత్రమే సమాచారాన్ని చేరవేయడానికి, టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి.. ఇలా ఎన్నో విషయాలకు ఉపయోగపడేది.


కంప్యూటర్ అనేది తయారైనప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో మార్పులు చేసుకుంది. ఇప్పటికీ ఈ విభాగంలో ఎన్నో కొత్త మార్పులకు కంప్యూటర్ సైంటిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈరోజుల్లో కంప్యూటర్‌పై వెచ్చించే సమయం, కరెంటు కూడా ఎక్కువయిపోయాయి. ఇది కొందరు సైంటిస్టులకు అసహనాన్ని ఇస్తుంది. అందుకే తక్కువ ఎనర్జీ, టైమ్‌తో పనిచేసే కంప్యూటింగ్ మోడల్స్‌ను తయారు చేయాలని అమెరికన్ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మనుషులు మల్టీ టాస్కింగ్ చేసినట్టుగా కంప్యూటర్ పరికరాలు మల్టీ టాస్కింగ్ చేయడం అంత సులభం లేదు. అందుకే మరింత మెరుగ్గా మల్టీ టాస్కింగ్ చేసేటట్టుగా కంప్యూటర్లను మార్చాలని శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానికోసమే వారు ఒక బయోకంప్యూటింగ్ పరికరాన్ని డెవలప్ చేయనున్నారు. ఇది మెదడు, గుండెకు సంబంధించిన సెల్స్‌తో తయారు చేయబడనుంది. ప్రపంచంలోనే మొదటిసారి ఇలాంటి ఒక బయోకంప్యూటింగ్ టెక్నాలజీపై అమెరికన్ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టారు.


గుండె అనేది రెండు బిలియన్ సెల్స్ సమూహం. అయినా కూడా ఇది కేవలం ఆరు వాట్స్ శక్తిని మాత్రమే బయటికి వదులుతుంది. మామూలుగా ఇంట్లో రోజూ వెలిగే బల్బ్ కూడా 60 వాట్స్ ఎనర్జీని విడుదల చేస్తుంది. దానితో పోలిస్తే గుండె విడుదల చేసే ఎనర్జీ చాలా తక్కువ. ఒక దాంతో పాటు మనిషి బ్రెయిన్ కూడా ఎంతో మల్టీ టాస్కింగ్ చేస్తుంది. ఇది ఒకేసారి మనిషి ఊపిరిని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ రేట్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది, బీపీని గమనిస్తూ ఉంటుంది.. ఇలా మరెన్నో ఫంక్షన్స్‌ను మెదడు ఒకేసారి చేస్తుంది.

ఇలా మనిషి గుండె, మెదడులోని సామర్థ్యాన్ని కలిపి ఒక బయోకంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌ను తయారు చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న కంప్యూటర్లు చేయలేని ఎన్నో పనులు ఈ బయో కంప్యూటర్లు చేసే విధంగా తయారు చేయబడనున్నాయి. బయోలజీ, కంప్యూటర్ సైన్స్.. రెండు కలిపితేనే బయోకంప్యూటర్ తయారవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే కంప్యూటర్‌లలో ఉండే సర్క్యూట్స్, కాంపొనెంట్స్.. బయోలజీకల్ మాలిక్యూల్స్‌తో అమర్చబడతాయి. త్వరలోనే బయో కంప్యూటర్ అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.

Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×