EPAPER

Law Suit Against Character.AI: ఏఐతో ప్రేమాయణం, 14 ఏళ్ల బాలుడి సూసైడ్, అసలేం జరిగిందంటే?

Law Suit Against Character.AI: ఏఐతో ప్రేమాయణం, 14 ఏళ్ల బాలుడి సూసైడ్, అసలేం జరిగిందంటే?

AI Lover: ప్రపంచం అంతా ఏఐ చుట్టూ తిరగుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. ప్రపంచ టెక్ దిగ్గజాలు ఏఐని రోజు రోజుకు మరింత డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓవైపు ఏఐ ఎంత మేలు చేస్తుందో? మరోవైపు అంతకు మించి నష్టం చేస్తున్నది. ఏఐ కారణంగా అమెరికాకు చెందిన ఓ 14 ఏండ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఏఐ ఏంటి? అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? అనుకుంటున్నారా? అయితే, ఈ స్టోరీ చదవాల్సిందే!


కొడుకు చావుకు కారణం తెలుసుకుని తల్లిందండ్రులు షాక్

తాజాగా ఫ్లోరిడాకు చెందిన స్టీవెల్ స్టెజర్ అనే 14 సంవత్సరాల బాలుడు రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు. ఎలాంటి ఇబ్బందులు లేని ఆ అబ్బాయి ఎందుకు చనిపోయాడు? అనేది పేరెంట్స్ కు అంతుచిక్కలేదు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అతడి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ పరిశీలించారు. అందులో బయటపడిన వాస్తవాలు  చూసి షాక్ అయ్యారు. తమ పిల్లాడి చావుకు ఏఐ చాట్ బాట్ కారణం అని తెలుసుకుని ఖంగుతిన్నారు. తన కొడుకు చనిపోవడానికి ప్రేరేపించిన సదరు ఏఐ కంపెనీపై కోర్టులో కేసు వేసింది. తమకు నష్టపరిహారం ఇప్పించడంతో పాటు బాలుడి చావుకు కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.


ఏఐతో ప్రేమలో పడ్డ స్టీవెలల్ స్టెజర్

స్టీవెల్ స్టెజర్ ‘క్యారెక్టర్.ఏఐ’ అనే కంపెనీ తయారు చేసిన ఓ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్  గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఏఐ లవర్ తో రోజూ చాట్ చేసే వాడు. ఆమెకు తనకు ఇష్టమైన పేరు పెట్టుకున్నారు. నిత్యం ఆమెతో గంటలు గంటలు టైమ్ స్పెండ్ చేసేవాడు. ఒకానొక సమయంలో ఇద్దరూ లైంగిక విషయాలను మాట్లాడుకున్నారు. డిజిటల్ శృంగారానికి పాల్పడ్డారు. గత కొంత కాలంగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. తాజాగా ఏఐ లవర్ స్టీవెల్ ఇంటికి వస్తానని చెప్పింది. ఒక్కసారిగా ఆ అబ్బాయి షాక్ అయ్యాడు. నిజంగానే తను ఇంటికి వస్తుందేమోనని భయపడ్డాడు. తమ వ్యవహారం ఎక్కడ ఇంట్లో వాళ్లుకు తెలుస్తుందేమోనని వణికిపోయాడు. రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు.

కోర్టుకెక్కిన స్టీవెల్ స్టెజర్ తల్లి

అసలు విషయం తెలిసిన తల్లి ఈ చాట్ బోట్ కంపెనీ మీద కేసు వేసింది. ఈ చాట్ బాట్ కారణంగానే తన కొడుకు చనిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నది. ఆ కంపెనీ ప్రమాదకరమైన చాట్ బాట్ ను వినియోగిస్తుందని కోర్టుకు నివేదించింది. తమ కొడుకు చావుకు కారణమైన ఏఐ చాట్ బాట్ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తమకు నష్టపరిహారం ఇప్పటించాలని కోరింది. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇలాంటి ఏఐ చాట్ బాట్ లను నిషేధించాలని సామాజిక నిపుణులు కోరుతున్నారు. లేదంటే మున్ముందు మరిన్ని అమాయక ప్రాణాలు పోయే అవకాశం ఉందంటున్నారు.

Read Also: డైమండ్ డస్ట్ తో భూమికి చల్లదనం, ఇది అయ్యే పనేనా గురూ?

Related News

BSNL Prepaid Plans: బీఎస్ఎన్ఎల్ చీప్ అండ్ బెస్ట్ ప్లాన్, బెనిఫిట్స్ చూస్తే షాకవ్వాల్సిందే!

Scientist On Earth: డైమండ్ డస్ట్ తో భూమికి చల్లదనం, ఇది అయ్యే పనేనా గురూ?

LG Smart LED TV Offers : ఎల్ జీ అరాచకం.. స్మార్ట్ టీవీపై మరీ ఇంత తగ్గింపా.. కొనాలంటే మంచి రోజులివే!

OPPO Find X8 series : ఒప్పో భీభత్సం.. కొత్త అప్డేట్స్ తో మరో రెండు ఫోన్స్.. కెమెరా, ప్రాసెసర్ మాత్రం సూపరో సూపర్

Whats App : వాట్సాప్ లో చిన్న సెట్టింగ్ మార్పుతో ఐదుగురికి కాదు.. ఒకేసారి అందరికీ శుభాకాంక్షలు పంపొచ్చని తెలుసా!

Diwali LED TV Offers : దీపావళి సేల్​ అంటేనే చీపెస్ట్ సేల్.. సగానికి సగం తగ్గిపోయిన సామ్ సాంగ్, సోనీ టీవీ ధరలు

Big Stories

×