Big Stories

Joe Biden:క్రిప్టోపై అమెరికా కన్ను.. టెక్నాలజీ కోసం కసరత్తు..

Joe Biden:ఇప్పటికే అమెరికా ఎన్నో ప్రపంచ దేశాలకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో గట్టి పోటీ ఇస్తోంది. కానీ ఆ దేశ టెక్నాలజీ సాధిస్తున్న అభివృద్ధి విషయంలో అధినేత జో బైడెన్ ఇంకా సంతృప్తి చెందనట్టు తెలుస్తోంది. అందుకే నేషనల్ అసెట్స్ రీసెర్చ్ అండ్ డెవలెప్మెంట్ అజెండా పేరుతో ఓ కొత్త అధ్యాయానాన్ని ప్రారంభించింది.

- Advertisement -

తాజాగా ఈ అజెండా దేనిపై ఫోకస్ చేయనుందో నిర్ణయించడం కోసం వైట్ హౌస్‌లో ఓ మీటింగ్ కూడా జరిగింది. దేశంలో డిజిటల్ ఆస్తులు పెరగాలని బైడెన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే క్రిప్టో కరెన్సీపై అమెరికా దృష్టిపెట్టనుంది. ముందుగా క్రిప్టోకు సంబంధించిన పూర్తిస్థాయి రీసెర్చ్ జరగాలని అధినేత ఆదేశించినట్టుగా సమాచారం. డిజిటల్ ఆస్తులను ముందుకు తీసుకెళ్లే పరిశోధనలకు అమెరికా ప్రభుత్వ మద్దతు పూర్తిస్థాయిలో లభించనుంది.

- Advertisement -

టెక్నాలజీలో విజయం సాధిస్తున్న ప్రతీ ప్రొడక్ట్ ప్రజల ముందుకు వచ్చేలా చేయాలని వారు అమెరికా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. డిజిటల్ ఆస్తులను పెంచుకునే ప్రక్రియలోనే యూస్ డిజిటల్ డాలర్‌ను కూడా మార్కెట్లోకి దించనుంది. దీనికోసం సెంట్రల్ బ్యాంకుతో చర్చలు జరుపుతోంది. అయితే ఈ డిజిటల్ ఆస్తుల విషయంలో కొందరు బైడెన్‌కు సపోర్ట్‌గా నిలబడితే మరికొందరు మాత్రం విమర్శలతో ముంచెత్తుతున్నారు.

విమర్శలను పట్టించుకోకుండా అమెరికా అధినేత జో బైడెన్ తన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిజిటెల్ ఆస్తులకు తగిన టెక్నాలజీని డెవలప్ చేయడానికి అమెరికా ప్రభుత్వాన్ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మరి బైడెన్ అనుకున్నట్టుగా త్వరలోనే అమెరికా మార్కెట్‌లో డిజిటల్ డాలర్, క్రిప్టో కరెన్సీ సక్సెస్ అవుతాయేమో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News