EPAPER

ChatGPT:- ఆ దేశ యూనివర్సిటీల్లో చాట్‌జీపీటీ బ్యాన్..

ChatGPT:- ఆ దేశ యూనివర్సిటీల్లో చాట్‌జీపీటీ బ్యాన్..

ChatGPT:- ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), చాట్ జీపీటీ అనేవి మార్కెట్లోకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఎంతగా అభినందించి ప్రోత్సహించారో.. ఇప్పుడు వారే దానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. కొన్ని టెక్ సంస్థలతో పాటు పలు ప్రపంచ దేశాలు కూడా చాట్ జీపీటీని బ్యాన్ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే ఇటలీ వంటి దేశాల్లో చాట్ జీపీటీ అనేది బ్యాన్ అయ్యింది. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో దేశం చేరనుంది.


చాట్ జీపీటీ అనేది విద్యార్థులు పరీక్షల్లో చీటింగ్ చేయడానికి ఉపయోగపడుతుందని ఇప్పటికే పరిశోధనల్లో తేలింది. అంతే కాకుండా విద్యార్థులకు మరెన్నో విషయాలను సులువు చేయడానికి చాట్ జీపీటీ ఉపయోగపడనున్నట్టు తెలుస్తోంది. అందుకే చాలావరకు యూనివర్సిటీలు చాట్ జీపీటీకి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాయి. ముందుగా జపాన్‌లోని యూనివర్సిటీలు ఇలాంటి యాక్షన్‌కు సిద్ధపడ్డాయి.

సమాచారాన్ని లీక్ చేయడం కోసం కూడా చాట్ జీపీటీ ఉపయోగపడుతుందని, అందుకే విద్యార్థులు ఎవరూ దానిని ఉపయోగించకూడదని జపాన్ యూనివర్సిటీలు ఆదేశాలు జారీ చేశాయి. ఒకవేళ ఇలాంటి ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా విద్యార్థులు చాట్ జీపీటీ సాయం తీసుకుంటున్నారేమో చూసే బాధ్యత టీచర్లదే అని నిపుణులు అంటున్నారు. జపాన్‌లోని సోఫియా యూనివర్సిటీ.. చాట్ జీపీటీతో పాటు ఇతర ఏఐ చాట్‌బోట్స్ వినియోగం కూడా నిషేదం అని ముందుగా ప్రకటనను విడుదల చేసింది.


రియాక్షన్ పేపర్స్, రిపోర్ట్స్, థీసిస్ వంటి వాటిలో విద్యార్థులు చాట్ జీపీటీ సాయం అస్సలు తీసుకోకూడదని యూనివర్సిటీలు చెప్తున్నాయి. ఒకవేళ వారు చాట్ జీపీటీని ఉపయోగించుకోవాలి అనుకున్నా కూడా టీచర్ల అనుమతి తీసుకోవాలని మరికొన్ని యూనివర్సిటీలు ప్రకటించాయి. అలా ఉపయోగించే సమయంలో టీచర్లు వారిని కనిపెడుతూ ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. గత నవంబర్‌లో మార్కెట్లోకి వచ్చిన చాట్ జీపీటీని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ ప్రజలు వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది.

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×