E-Paper
Advertisement

Vaccine For Covid:కోవిడ్‌కు కొత్త వ్యాక్సిన్.. మరింత మెరుగ్గా..

Vaccine For Covid:కోవిడ్‌కు కొత్త వ్యాక్సిన్.. మరింత మెరుగ్గా..
Advertisement

Vaccine For Covid:కోవిడ్ అనే మహమ్మారి ఒక్కసారిగా ప్రపంచాన్ని కమ్మేసింది. అప్పుడు ఫ్రంట్ లైన్ వర్కర్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు కూడా దీనిని అరకట్టడానికి పోరాడారు. అది సోకకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా వ్యాక్సిన్‌ను కూడా కనిపెట్టారు. ఇప్పుడు కోవిడ్ ఎఫెక్ట్ తగ్గిపోయినా కూడా అది పూర్తిగా మాయమయిపోయింది అని చెప్పలేని పరిస్థితి. అందుకే శాస్త్రవేత్తలు ఇంకా వ్యాక్సిన్‌ను మెరుగుపరిచే ప్రయత్నంలోనే ఉన్నారు.

ప్రపంచదేశాల కంటే ఎఫెక్టివ్‌గా ఇండియా.. కోవిడ్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసింది. అది అన్ని దేశాలకు సప్లై చేసింది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు కోవిడ్ ప్రభావం బాగా తగ్గిపోయింది. అందుకే ప్రపంచ దేశాలు అన్నీ సొంతంగా వ్యాక్సిన్‌ను తయారు చేసుకునే పనిలో పడ్డాయి. అలాగే ఇస్లామిక్ రిపబ్లిక్ కూడా వ్యాక్సిన్ తయారీపై దృష్టిపెట్టింది. ఇప్పుడు కనీసం అయిదు రకాల వ్యాక్సిన్‌ను ప్రజలకు అందిస్తోంది ఈ దేశం. దాంతో పాటు తాజాగా మరో కొత్త వ్యాక్సిన్‌ను కూడా తయారు చేయడంలో విజయం సాధించింది.

Advertisement

ఇరాన్‌లో కోరెన్యాప్సిన్ అనే కొత్త వ్యాక్సిన్‌ను తయారు చేసి తాజాగా ఒకరిపై ప్రయోగం కూడా చేశారు. ఇటీవల ఒక కార్యక్రమం ద్వారా ఈ వ్యాక్సిన్‌ను లాంచ్ చేశారు. దీనికి ఇరాన్‌లోని ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఈ వ్యాక్సిన్ తయారీకి సాయం చేసిన రెనాప్ గ్రూప్ కూడా హాజరయ్యింది. ఈ వ్యాక్సిన్ టెస్ట్ సక్సెస్ అయినందుకు ఇరాన్ ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది తీసుకున్న తర్వాత శరీరంలోకి వైరస్ ఎంటర్ అయితే యాంటిబాడీస్ అన్నీ కలిసి శరీరంలో ఈ వైరస్ వ్యాప్తి కాకుండా చూస్తాయని వైద్యులు చెప్తున్నారు.

ఇప్పటివరకు కోవిడ్‌కు వ్యాక్సిన్ కనిపెట్టిన ప్రపంచ దేశాల్లో ఇరాన్.. ఆరో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా వెస్ట్ ఏసియాలో వ్యాక్సిన్ కనిపెట్టిన మొదటి దేశం కూడా ఇదే. ఇప్పటివరకు ఈ దేశం అయిదు వ్యాక్సిన్‌లను కనిపెట్టడం మాత్రమే కాకుండా అన్ని విధాల వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ప్లాట్‌ఫార్మ్స్ ఇరాన్‌లో ఉన్నాయి. అక్కడి న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. ఆ దేశంలో 50 మిలియన్ కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌‌‌లను తయారు చేయడానికి 21 కంపెనీలు కష్టపడుతున్నాయని తెలుస్తోంది.

Advertisement

Brain Activity:ఆక్టోపస్‌పై ప్రయోగాలు సక్సెస్.. బ్రెయిన్ యాక్టివిటీ కోసం..

Vehicle Headlights:హెడ్‌లైట్స్ వల్ల కళ్లకు ప్రమాదమా..? నిపుణుల రిపోర్ట్..

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×