EPAPER

iQOO Z9s Pro: ఆఫర్లే ఆఫర్లు.. మొన్ననే రిలీజ్.. అప్పుడే ఇంత భారీ డిస్కౌంటా.. వెంటనే కొనేయండి..!

iQOO Z9s Pro: ఆఫర్లే ఆఫర్లు.. మొన్ననే రిలీజ్.. అప్పుడే ఇంత భారీ డిస్కౌంటా.. వెంటనే కొనేయండి..!

iQOO Z9s Pro Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ ఇటీవల iQOO Z9s సిరీస్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లలో iQOO Z9s, iQOO Z9s Pro వంటి మోడళ్లు ఉన్నాయి. తాజాగా కంపెనీ ఈ సిరీస్‌లోని Z9s Pro మోడల్‌ను సేల్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు వినియోగదారులు iQOO Z9s ప్రోని కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్ కొనుగోలు సమయంలో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఇకపోతే ఫోన్‌లో 12GB RAM, Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్, 5500mAh బ్యాటరీ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.


iQOO Z9s Pro Specifications

iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్ 4,500 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో వస్తుంది. iQOO Z9s ట్రిపుల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. ప్రధాన సెన్సార్ 50MP సోనీ IMX882గా ఉంది. ఇది OISకి కూడా మద్దతు ఇస్తుంది. ఫోన్‌లో 2MP పోర్ట్రెయిట్ కెమెరా కూడా ఉంది. ఇది కాకుండా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా అందించబడింది. ఇక ఫోన్‌లో ముందువైపు 16 MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 12 GB RAMతో Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్‌ని అందించారు. బ్యాటరీ విషయానికొస్తే.. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.


Also Read: రూ.7,999 లకే వివో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఫీచర్లు అదిరిపోయాయ్ బాబోయ్..!

iQOO Z9s Pro Offers

iQOO Z9s Proని ఇప్పుడు భారతదేశంలో సరసమైన ధరకు కొనుగోలు చేయవచ్చు. రిటైల్ ధర విషయానికొస్తే.. ఫోన్ 8GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ.24,999 ధరతో వచ్చింది. అదే సమయంలో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.26,999కి అందుబాటులోకి వస్తుంది. అలాగే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.28,999కి లభిస్తుంది. ఈ ఫోన్లపై కంపెనీ భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ఈ ఫోన్‌ను ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా ఈఎంఐ లావాదేవీ ద్వారా కొనుగోలు చేసినప్పుడు రూ.3 వేల తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా ఫోన్‌పై రూ.3,000 ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.

ఈ విధంగా 8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 21,999కు కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ని రూ.23,999కి కొనుగోలు చేయవచ్చు. ఇంకా టాప్ అండ్ హై 12 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 25,999కి కొనుగోలు చేయవచ్చు. అందువల్ల తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్‌ని డిస్కౌంట్ ఆఫర్లతో కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. ఈ ఫోన్‌ Amazon.in, iQOO.comలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×