EPAPER

IQOO Z9s Pro: నేడే విడుదల: IQOO Z9s Pro ..కొత్త మొబైల్ ఫీచర్లు

IQOO Z9s Pro: నేడే విడుదల: IQOO Z9s Pro ..కొత్త మొబైల్ ఫీచర్లు

IQOO Z9s Pro Features: ఐక్యూ నుండి అత్యంత శక్తివంతమైన మిడ్-రేంజ్ డివైజ్ గా పిలిచే ఐక్యూ జెడ్ 9ఎస్ ప్రో… నేటి నుంచి ఇండియాలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ లో ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. మార్కెట్ లో బలమైన పోటీని ఇవ్వగలిగే మొబైల్ ఫోన్ ఇదే కావచ్చునని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.


ఐక్యూ జెడ్ 9ఎస్ ప్రో కి సంబంధించి క్లుప్తంగా చెప్పాలంటే.. ఇది మూడు కాన్ఫిగరేషన్లలో లభిస్తోంది. అయితే ఇండియాలో దీని ధర రూ .24,999 నుండి ప్రారంభం కానుంది.

స్నాప్ డ్రాగన్ 7 జెనరేషన్, 3 5జీ ప్రాసెసర్ పై పనిచేసే ఈ ఫోన్ లో 6.77 అంగుళాల స్క్రీన్ డిస్ ప్లేను అందించారు.


డ్యూయల్ సిమ్ 5జీ కనెక్టివిటీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, ఆండ్రాయిడ్ 14 ఆధారిత, ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఐక్యూ నుండి అత్యంత శక్తివంతమైన మిడ్-రేంజ్ డివైజ్ గా పిలిచే.. జెడ్ 9ఎస్ ప్రోపై కొన్ని రోజుల నుంచి భారీ అంచనాలున్నాయి. అలాంటి ఫోన్ ఇప్పుడు మార్కెట్ లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

ఐక్యూ జెడ్ 9ఎస్ ప్రో మూడు కాన్ఫిగరేషన్ల ధరలు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .24,999గా ఉంది.
8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .26,999గా ఉంది.
12 జీబీ ర్యామ్ + 256 జీబీ వేరియంట్ ధర రూ .28,999.

Also Read: ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ ధరలు.. తగ్గుతున్నాయా?

లాంచ్ ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను ఉపయోగిస్తే, వినియోగదారులకు మరో రూ.3000 ఇనిస్టెంట్ డిస్కౌంట్ పొందవచ్చునని అంటున్నారు.

ఐక్యూ జెడ్ 9 ఎస్ ప్రో రెండు రంగుల్లో లక్స్ మార్బుల్, ఫ్లాంబోయెంట్ ఆరెంజ్ అనే రెండు రంగుల్లో లభ్యమవుతోంది. లక్స్ మార్బుల్ మోడల్ పొడవు 16.37 సెంటీమీటర్లు, వెడల్పు 7.50 సెంటీమీటర్లు, మందం 0.75 సెంటీమీటర్లు, బరువు 185 గ్రాములు ఉంది. ఆరెంజ్ వేరియంట్ 0.80 సెంటీమీటర్ల వద్ద కొంచెం మందంగా, 190 గ్రాముల బరువుతో ఉంది.

స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 5జీ ప్రాసెసర్ పై పనిచేసే ఈ ఫోన్ 8 జీబీ లేదా 12జీబీ ర్యామ్ ఆప్షన్ ను ఎంచుకున్నా.. పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. జెడ్ 9ఎస్ ప్రోలో 5500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది, ఇది దీర్ఘకాలిక వినియోగాన్నిస్తుంది. ఇంకా 80 వాట్ తో ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుందని చెబుతున్నారు.

6.77 అంగుళాల అమోల్ ఈడీ డిస్ ప్లే, 2392×1080 రిజల్యూషన్, పదునైన, శక్తివంతమైన ఫొటోలను అందిస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇక 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఈ కెమెరాలో పలు మోడ్స్ ఉన్నాయి. అవి రాత్రిళ్లు తీసేవిధంగా నైట్, పనోరమా, స్లో-మో, సూపర్ మూన్ మోడ్ ఇలా ఎన్నో కెమెరా ఆప్షన్లున్నాయి.

కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై 6, బ్లూటూత్ 5.4, యుఎస్ బీ టైప్-సి ఉన్నాయి. జీపీఎస్, ఓటీజీ, ఎఫ్ఎం రేడియోలను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. రెండు కార్డుల్లో 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేసే డ్యూయల్ సిమ్ స్లాట్లు ఇందులో ఉన్నాయి.

ఆండ్రాయిడ్ 14 ఆధారిత, ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే జెడ్9ఎస్ ప్రో స్మూత్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుందని చెబుతున్నారు.

Related News

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Big Stories

×