EPAPER

Fastest Charging Mobiles: నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. 120W ఫాస్ట్ ఛార్జింగ్.. రాకెట్ కన్నా వేగం!

Fastest Charging Mobiles: నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. 120W ఫాస్ట్ ఛార్జింగ్.. రాకెట్ కన్నా వేగం!

Fastest Charging Mobiles: ప్రస్తుతం మొబైల్ మార్కెట్లోకి రకరకాల ఫోన్లు వస్తున్నాయి. వాటిలో చాలా స్మార్ట్‌ఫోన్‌లు పెద్ద బ్యాటరీ, వేగవంతమైన ప్రాసెసర్, అద్భుతమైన కెమెరా వంటి కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఉన్నాయి. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఫోన్లు మార్కెట్లో మరింత ఆకర్షణీయంగా మారాయి. వాటిలో 100 వాట్స్ ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉన్న ఫోన్లు దృష్టిని ఆకర్షించాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌ ఫోన్‌లు దాదాపు 30 నిమిషాల్లో ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి సహాయపడతాయి. ఇలా ప్రముఖ మొబైల్ బ్రాండ్‌లు ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు ఎక్కువగా విడుదల చేస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఉన్న కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల గురించి  తెలుసుకుందాం.


OnePlus 12R
ఈ వన్‌ప్లస్ ఫోన్ 1,264×2,780 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల BOE X1 OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ రన్ అవుతుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. దీని ప్రైమరీ కెమెరా 50-మెగాపిక్సెల్ సెన్సార్. ఇది కాకుండా ఈ మొబైల్ 5,000 mAh కెపాసిటీ గల బ్యాటరీ బ్యాకప్ ఫీచర్ కలిగి ఉంది. అదనంగా ఇది 100W SuperVOOC వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Realme GT 6T
ఈ రియల్‌మీ GT 6T మొబైల్ 2,789 x 1,264 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల 3D LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.  ఇది స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో వస్తుంది.  Android 14 OS సపోర్ట్ కూడా ఉంది. ఇది డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీని మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్‌తో  ఉంటుంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో  పాటు 5,500mAh కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్ కూడా కలిగి ఉంది.


Also Read: Heavy Discount On Mobile: 5G స్మార్ట్‌ఫోన్.. హెవీ డిస్కౌంట్.. కిక్కిస్తున్న ఫీచర్లు!

IQOO Neo 9 Pro
ఈ ఐక్యూ నియో 9 ప్రో మొబైల్ 1260 x 2800 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది Qualcomm Snapdragon 8 Gen 2 SoC ప్రాసెసర్‌తో వస్తుంది.  Android 14 OSలో రన్ అవుతుంది. దీనికి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీని ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్స్. దీనితో పాటు 5160 mAh కెపాసిటీ బ్యాటరీ కూడా ఉంటుంది. దీనికి అదనంగా ఇది 120W FlashCharge ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×