iQOO Neo 10 Pro : iQOO తాజాగా చైనాలో తన ఫ్లాగ్‌షిప్ iQOO 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ అదిరిపోయే ఫీచర్స్ తో త్వరలోనే భారత్ లో సైతం అందుబాటులోకి రానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 6150mAh బ్యాటరీతో పాటు అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ పై ఓ లుక్కేయండి.
టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ సంస్థలన్నీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ తో కొత్త మొబైల్స్ లో లాంఛ్ చేస్తున్నాయి. ఇక ఈ నవంబర్ లో రియల్ మీ, ఒప్పో నుంచి కొత్త సిరీస్ రానున్న నేపథ్యంలో ఐక్యూ సైతం మరో మోడల్ లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ మొబైల్ చైనాలో లాంఛ్ కాగా త్వరలోనే ఇండియాలో లాంఛ్ అయ్యేందుకు సిద్ధమవుతుంది. iQOO 13 పేరుతో లేటెస్ట్ అప్డేట్స్ తో వస్తున్న ఈ మెుబైల్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ ఫోన్ భారత్ లో ఎప్పుడు లాంఛ్ అవుతుంది, ధర, స్పెసిఫికేషన్స్ పూర్తి వివరాలివే..
iQOO Neo 10 Pro Specifiations –
డిస్ ప్లే – Weiboలో ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఇటీవలే ఐక్యూ నియో 10 ప్రో ఫీచర్స్ ను లీక్ చేసింది. iQOO నియో 10 ప్రో 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ 6.78 అంగుళాల 1.5K 8T LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.
ప్రాసెసర్ – ఈ మెుబైల్ MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో రాబోతుంది.
స్టోరేజ్ – ఇందులో హై స్టోరేజ్ ను ఐక్యూ అందిస్తుంది. 16GB RAM + 512GB స్టోరేజీకి సపోర్ట్ చేసేలా మెుబైల్ ను డిజైన్ చేశారు.
కెమెరా – ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 50MP సెకండరీ కెమెరా, అల్ట్రా వైడ్ లెన్స్‌తో రానుంది. ఇక ఈ లీక్ లో సెల్ఫీ కెమెరా అప్డేట్ రావల్సి ఉంది. ఈ కెమెరా సెటప్ సైతం హై క్వాలిటీతో రావొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
బ్యాటరీ – ఇక 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000mAh బ్యాటరీతో ఈ మెుబైల్ రాబోతుంది.
సెన్సార్ – ఇక ఐక్యూ ముందు మెుబైల్స్ లో ఉపయోగించే ఆప్టికల్ సెన్సార్‌తో పోలిస్తే ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైతం ఉండనుంది.
ధర – iQOO Neo 10 సిరీస్ ధర వివరాలు ఇప్పటికి తెలియనప్పటికీ iQOO ముందు మోడల్స్ కంటే ఎక్కువ అప్డేట్స్ ఉండటంతో ధర కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని.. iQOO Neo 9 సిరీస్ తో సమానంగా కూడా ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
లాంఛ్ డేట్ – ప్రస్తుతం చైనాలో ఈ మెుబైల్ లాంఛ్ అయ్యి టెక్ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఇక త్వరలోనే భారత్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఐక్యూ నియో 10 నవంబర్ లో రానుందని.. నియో 10 ప్రో జనవరిలో లాంఛ్ కానుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలు విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
ALSO READ : నవంబర్లో రానున్న స్మార్ట్ ఫోన్స్ లో టాప్ 4 ఇవే.. దిమ్మతిరిగే ఫీచర్స్, అదిరిపోయే హైలెట్స్ గురూ!