EPAPER

iPhone 16 Banned : అసలు ఇండోనేషియాలో ఐఫోన్ ను ఎందుకు బ్యాన్ చేశారు?

iPhone 16 Banned : అసలు ఇండోనేషియాలో ఐఫోన్ ను ఎందుకు బ్యాన్ చేశారు?

iPhone 16 Banned :ఇండోనేషియాలో యాపిల్ ఐఫోన్ ను బ్యాన్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. అయితే అసలు బ్యాన్ వెనుక కారణాలు ఏంటి? అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ కథనం చదవాల్సిందే


ఐఫోన్ 16.. ఈ స్మార్ట్ ఫోన్ తాజాగా లాంఛ్ అయి గ్యాడ్జెట్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. హాట్ కేక్స్ లా అమ్ముడుపోయాయి. లేటెస్ట్ అప్డేట్ తో అలరించిన ఈ మెుబైల్ తాజాగా ఇండోనేషియాలో బ్యాన్ అయిందనే విషయం అందర్నీ షాక్ కు గురిచేసింది. ఐఫోన్ 16ను ఇండోనేషియాలో విక్రయించడం చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఇక ఎవరైనా ఈ ఫోన్ ను అమ్మినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే ఒక దేశం ఇంత ప్రతిష్టాత్మకంగా లాంఛ్ అయిన మెుబైల్ ను నిషేధించటం వెనుకు పెద్ద కథే ఉంది.

అసలు.. ఈ నిర్ణయం ఇండోనేషియా ఎందుకు తీసుకుందంటే… తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు యాపిల్ నిర్ణయించుకుందని ఈ విషయం తమకు తెలిపిందని ఆరోపించిన ఇండోనేషియా ప్రభుత్వం… యాపిల్ కంపెనీ ఆ మాట తప్పిందని తెలిపింది. నిజానికి యాపిల్ కంపెనీ ముందే ఇండోనేషియాలో కొంత మెుత్తాన్ని పెట్టుబడిగా పెట్టింది. అయితే అది ఇండోనేషియా ప్రభుత్వం ఆశించినంత లేకపోవటంతో సమస్య మెుదలైంది. దీంతో టీకేడీఎన్ సర్టిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయటానికి నిరాకరించింది. ఈ సర్టిఫికేషన్ లేకపోతే ఆ దేశంలో యాపిల్ ఐఫోన్ 16 ను విక్రయించటానికి వీలులేదు. దీంతో ప్రస్తుతానికి ఆ ఫోన్ విక్రయాలు ఆగిపోయాయి.


ALSO READ : థ్రిల్, ​రిలాక్సేషన్​ కాంబోలో అదిరిపోయే టెక్ గిఫ్ట్స్ ఇవే.. వీటితో మీ ఫేవరెట్ పర్షన్స్ ఫుల్ ఖుషీ!

ఇక ప్రస్తుతం ఇండోనేషియా ప్రభుత్వం మిగిలిన పెట్టుబడి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కొన్ని నివేదికలు తెలిపిన సమాచారం ప్రకారం.. .యాపిల్ కంపెనీ తమ దేశంలో 1.48 ట్రిలియన్స్ పెట్టుబడిగా పెట్టిందని… అయితే ముందుగా జరిగిన అగ్రిమెంట్  ప్రకారం..  యాపిల్ మొత్తంగా 1.71 ట్రిలియన్స్ పెట్టుబడి పెడతామని తెలిపిందని ఇండోనేషియా ఆరోపించింది. ఇక అంచనాలను అందుకోలేదు కాబట్టి ఇకపై తమ దేశంగా ఐఫోన్ విక్రయాలు జరగవని ప్రకటించింది. ఈ విషయాన్ని తమ దేశం చాలా సీరియస్ గా తీసుకుంటుందని.. ఎవరైనా అదుపుదాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.  ఐఫోన్ 16 సిరీస్ ఫోన్స్ ఇండోనేషియా సరిహద్దుల్లో కనిపిస్తే చట్ట విరుద్ధమని.. ఆ దేశ మంత్రి అగస్ గుమీవాంగ్ తెలిపారు. విదేశాల నుంచి ఐఫోన్ 16ను దిగుమతి చెయ్యెద్దని.. అలా చేసినా కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇండోనేషియాకు వచ్చే కస్టమర్స్ సైతం ఐఫోన్ వాడవచ్చా లేదా అనే విషయం ఇప్పటికి క్లారిటీ రాలేదు. దీంతో ఇప్పటికే ఆ దేశంలో ఉన్న పర్యాటకులు సైతం ఆందోళనకు గురవుతున్నారు.

ఈ విషయం యాపిల్ కంపెనీకి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. యాపిల్ 16 సిరీస్ లాంఛ్ కు ముందు ఆపిల్ అధినేత టిమ్ కుక్ సైతం ఇండోనేషియా అధ్యక్షునితో సమావేశంలో పాల్గొన్నారు. ఇండోనేషియాలో ఆపిల్ తయారీ ప్లాంట్ సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఐఫోన్ 16ను బ్యాన్ చేయటం కంపెనీ సేల్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అమ్మకాలపై సైతం ఈ బ్యాన్ కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

Related News

Diwali Mobiles Gifts : ఓడియమ్మా.. ఏం ఆఫర్స్ బాసూ.. బడ్జెట్లోనే దొరికే ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!

Netflix’s Moments Feature : దిమ్మతిరిగే ఫీచర్ తీసుకొచ్చిన నెట్​ఫ్లిక్స్ – ఇకపై వాటి షేరింగ్ డబుల్ ఈజీ

Instagram : ఇన్టాగ్రామ్ సేవలు ఆగిపోయాయా.. అసలు ఏమైంది?

Digital Condom App: ‘డిజిటల్ కండోమ్’.. భయం లేని ఏకాంతం కోసం సరికొత్త యాప్!

OPPO A3x 4G, OPPO Find X8 : ఒప్పో A3x 4G, ఒప్పో Find X8లో బెస్ట్ మెుబైల్ ఏదంటే!

BSNL 4G : బీఎస్ఎన్ఎల్ 4G స్లోగా ఉందా.. ఈ సెట్టింగ్స్ తో చిటికెలో హై స్పీడ్ గా మర్చేయండి

Apple Intelligence : మీ గ్యాడ్జెట్లో ఆపిల్ ఇంటెలిజెన్స్ వర్క్ అవుట్ అవుతుందా! చెక్ చేసేయండిలా

×