BigTV English

iPhone 15 @ Rs 53,000: రూ.53 వేలకే ఐఫోన్​ 15.. ఇదే సూపర్​ డీల్!

iPhone 15 @ Rs 53,000: రూ.53 వేలకే ఐఫోన్​ 15.. ఇదే సూపర్​ డీల్!


Buy iPhone 15 at Rs 53,000: యాపిల్ ఐఫోన్లకు మార్కెట్‌లో సూపర్ డిమాండ్ ఉంది. ఈ కంపెనీ ఫోన్లు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అంతేకాకుండా ఐఫోన్ కొత్త మోడల్ వస్తుందంటే కళ్ల కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. దీని రేట్లు ఎంత ఎక్కువగా ఉన్నా కొనేందుకు వెనకడుగు వేయరు. లక్షల్లో పెట్టి పెట్టి కొనుక్కుంటుంటారు. అంత క్రేజ్ ఉంది ఐఫోన్‌కి.

కానీ ఈ మొబైల్‌ని కొనాలని ఆసక్తి ఉన్నా.. అధిక రేటు కారణంగా కొందరు తమ ప్లాన్‌ను మార్చుకుంటుంటారు. అలాంటి వారికి ఇప్పుడొక గుడ్ న్యూస్. ఐఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్‌ను ఇప్పుడు పొందొచ్చు. అదెలాగో తెలుసుకుందాం..


ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఐఫోన్‌పై సూపర్ డూపర్ డిస్కౌంట్ ఉంది. గతేడాది రిలీజైన ఐఫోన్ 15పై అమెజాన్ భారీ తగ్గింపు అందిస్తోంది. డిస్కౌంట్‌తో పాటు పలు బ్యాంక్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉంచింది.

READ MORE: ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.39వేల తగ్గింపు!

అమెజాన్‌లో ఐఫోన్ 15 అసలు ధర రూ.79,900గా ఉంది. అయితే ఇప్పుడు దీనిపై అమెజాన్ 11 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో ఐఫోన్ 15ను రూ.70,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే దాదాపు రూ.8,901 తగ్గింపు లభిస్తుందన్న మాట. అయితే ఈ ఆఫర్ ఐఫోన్ 15.. 128 జీబీ వేరియంట్‌కు అందుబాటులో ఉంది.

అలాగే ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. ఏదైనా పాతఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే దాదాపు రూ.17,300 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అయితే ఆ పాత ఫోన్ కండీషన్ బట్టి ధర మారుతూ ఉంటుంది. దీనికోసం మీ పిన్‌కోడ్‌ని ఎంటర్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తే ఈ ఫోన్ రూ.53,699కే లభిస్తుంది.

READ MORE: రూ.1849కే ఐఫోన్ 14.. ఏకంగా రూ.56 వేలకు పైగా డిస్కౌంట్..!

ఇక ఈ ఐఫోన్ 15పై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌పై రూ.150 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతోపాటు మరిన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

Tags

Related News

Six stroke engine:18 ఏళ్ల కృషి ఫలితం.. సిక్స్ స్ట్రోక్ ఇంజిన్.. మైలేజ్ ఏకంగా లీటర్‌కు 200 కిలోమీటర్లు

Vivo T4 Pro Launch: వివో T4 ప్రో ఇండియాలో లాంచ్.. మిడ్ రేంజ్‌లో పవర్‌ఫుల్ చిప్ సెట్, భారీ బ్యాటరీ

New Cyber Scam: కొత్త సైబర్ మోసం.. ఓటీపీ, కార్డు లేకుండానే బ్యాంకు ఖాతా ఖాళీ!

Pixel 10 Pro XL vs Galaxy S25 Ultra vs iPhone 16 Pro Max: స్మార్ట్‌ఫోన్ దిగ్గజాల మధ్య హోరాహోరీ.. విన్నర్ ఎవరు?

Surya AI: సూర్య పేరుతో భానుడికి డిజిటల్ వెర్షన్ తయారు చేసిన నాసా.. ఇది ఎలా పని చేస్తుందంటే?

Marathon Battery: చార్జింగ్ తరిగిపోని సెల్ ఫోన్ వచ్చేస్తోంది.. బ్యాటరీ పవర్ ఎంతంటే?

Big Stories

×