EPAPER

Infinix Note 40 Pro 5G Series: ఇన్ఫినిక్స్ న్యూ స్మార్ట్ ఫోన్.. మరే ఫోన్‌లో లేని ఫీచర్‌తో లాంచ్!

Infinix Note 40 Pro 5G Series: ఇన్ఫినిక్స్ న్యూ స్మార్ట్ ఫోన్.. మరే ఫోన్‌లో లేని ఫీచర్‌తో లాంచ్!
Infinix Note 40 Pro 5G Series

Infinix Note 40 Pro 5G Series Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ తమ బ్రాండ్ ‌నుంచి వరుస ఫోన్లను లాంచ్ చేస్తూ ఉంటుంది. గత నెలలోనే వివిధ రకాల ఉత్పత్తులను రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా ఎక్కువగా బడ్జెట్ రేంజ్‌లోనే ఉంటాయి. ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్స్ తక్కువ ధరకే మంచి ఫీచర్లతో లభిస్తాయి.


అయితే తాజాగా ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరిస్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్లను మార్చి 18 రిలీజ్ చేస్తున్నట్లు కంపెనీ నిర్ణయించింది. ఈ గ్రాండ్ ఈవెంట్ మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరగనుంది. ఈ సిరీస్‌లో ఉన్న మోడళ్లు చూసేయండి.

  • Infinix Note 40
  • Infinix Note 40 Pro
  • Infinix Note 40 Pro 5G
  • Infinix Note 40 Pro Plus 5G

Also Read: సూపర్ క్రేజీ ఆఫర్ భయ్యా.. 4,999కే స్మార్ట్ ‌ఫోన్!


ఇన్ఫినిక్స్ లాంచ్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్లలో ఉన్న మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఇందులో Brand Active Holo అనే AI లైట్ ఫీచర్ ఉండనుంది. ఈ ఫీచర్ ఉన్న మొట్టమొదటి స్మార్ట్ ఇదే కావడం విశేషం. ఈ ఫీచర్ లైటింగ్ ఎఫెక్ట్‌లతో వాయిస్ కమాండ్‌లను ఫోన్‌కు ఇస్తుంది. వినియోగదారులు దీని ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో ఇంటరాక్ట్ అవ్వొచ్చు.

అలానే Hi Polex అనే కమాండ్ ద్వారా వాయిస్ అసిస్టెంట్‌ను ఉపయోగించొచ్చు. దీని ద్వారా ఇన్‌కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్, మ్యూజిక్ ప్లేబ్యాక్, గేమింగ్, ఛార్జింగ్‌ను హలో పోలెక్స్‌తో కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ యాక్టివ్ పోలో మూడు రకాలు లైటింగ్ ఎఫెక్ట్‌లను కలిగి ఉంటుంది. AI, లైవ్లీ, రిథమిక్. వినియోగదారులు కోరుకున్న విధంగా లైటింగ్ సెట్ చేసుకోవచ్చు.

Also Read: శ్యామ్‌సంగ్ హోలీ సేల్.. కళ్లు జిగేల్ మనేలా ఆఫర్స్!

ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్ ఫీచర్లు పూర్తిగా కంపెనీ వెల్లడించలేదు. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. నోట్ 40లో 5,000mAh బ్యాటరీ, మీడియా టెక్ హీలియో G91 ప్రాసెసర్ ఉంటుంది. అలానే ఈ సిరీస్‌లో చీతా X1 చిప్ ఉంటుంది. ఇది నోట్ 40 సిరీస్‌లోని ఫాస్ట్‌ఛార్జ్ 2.0 టెక్నాలజీకి పవర్ మేనేజ్‌మెంట్‌‌పై పని చేస్తుంది. నోట్ 40 ప్రో 5Gలో డైమెన్సిటీ 7020 చిప్‌సెట్, 8GB RAM, ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. ఈ ఇన్ఫినిక్స్‌ నోట్ 40 సిరీస్ భారత్‌లో వస్తున్న Active Holo లైట్ ఫీచర్‌తో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్.

Tags

Related News

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Big Stories

×