EPAPER

Mission Divyastra Success: మిషన్‌ దివ్యాస్త్ర సక్సెస్.. శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు

Mission Divyastra Success: మిషన్‌ దివ్యాస్త్ర సక్సెస్.. శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు

Mission Divyastra


India successfully tested Mission Divyastra-Agni 5 Missile: భారత్ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ..ఆర్డీవో మరో విజయం సాధించింది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో చేపట్టిన అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఈ క్షిపణికి బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది. మిషన్ దివ్యాస్త్ర విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు.

అగ్ని-5 మిషన్ దివ్యాస్త్రను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ క్షిపణిని మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ-ఎట్రీ వెహికల్ సాంకేతికతతో డెవలప్ చేశారు. మిషన్ దివ్యాస్త్ర అగ్ని-5ను ఒకే క్షిపణి సాయంతో వార్ హెడ్లను వివిధ టార్గెట్ పై ప్రయోగించే అవకాశం కలుగుతుంది.


అగ్ని-5కి 5 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది. ఇది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. అలాగే అణ్వాయుధాల తీసుకెళ్లే సత్తా కూడా ఉంది. చైనాకు ఈ విషయంలో సామర్థ్యం ఉంది. ఆ దేశం వద్ద డాంగ్ ఫెంగ్ -41 లాంటి క్షిపణులు ఉన్నాయి. ఈ క్షిపణులు 12 వేల నుంచి 15 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన సామార్థ్యాన్ని పెంచుకునే చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే అగ్ని-5 ను రూపొందించింది.

Read More: పౌరసత్వ సవరణ చట్టం-2019 అమలుకు చర్యలు.. నోటిఫికేషన్ జారీ..

మిషన్ దివ్యాస్త్ర అగ్ని-5 ఆసియా పరిధిలోనికి ఏ దేశంలోకైనా దూసుకెళ్లగల సత్తా ఉంది. అగ్ని-1 నుంచి అగ్ని-4 వరకు రూపొందించిన క్షిపణులు కనిష్టంగా 700 కిలోమీటర్లు, గరిష్టం 3,500 కిలోమీటర్లు మధ్య దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. అగ్ని-1 నుంచి అగ్ని-4 వరకు భారత్ రక్షణ బలగాలకు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×