EPAPER
Kirrak Couples Episode 1

Track Lost Phone with IMEI Number: ఫోన్ పోయిందా.. అయితే నిమిషాల్లో కనుక్కోవచ్చు!

Track Lost Phone with IMEI Number: ఫోన్ పోయిందా.. అయితే నిమిషాల్లో కనుక్కోవచ్చు!

Track Stolen Phone with IMEI Number: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ అవసరం ఉన్నా లేకున్నా కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరైతే ఏకంగా ఫోన్లను కొనుగోలు చేసేందుకు లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. అయితే కొందరు కేటుగాళ్లు స్మార్ట్‌ఫోన్లను సులభంగా చోరీ చేస్తున్నారు. ఈ క్రమంలో వేలు,లక్షల రూపాయలు చెల్లంచి ఇష్టంగా తీసుకునే ఫోన్ల భద్రత గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మన స్మార్ట్‌ఫోన్లో IMEI అనేది ఒకటి ఉంటుదని మీకు తెలుసా? ఈ నెంబర్ ద్వారా మీరు పోగొట్టుకున్న, లేదా దొంగిలించబడ్డ ఫోన్‌ చిరునామా చెబుతుంది. మొబైల్‌లో IMEI నంబర్ చాలా ముఖ్యమైనది. ఫోన్ దొంగిలించబడినా లేదా పోగొట్టుకున్నా IMEI ద్వారా ట్రాక్ చేయవచ్చు. ఇది ఫోన్‌ను తిరిగి పొందడం సులభతరం చేస్తుంది. IMEI ప్రాముఖ్యత నంబర్ ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకోండి.


IMEI అంటే ఏమిటి..?

IMEI నంబర్ అంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ. ఇది 15 అంకెల ప్రత్యేక కోడ్. ఇది ప్రతి మొబైల్ ఫోన్‌కు ఉంటుంది. ఒక విధంగా ఇది ఫోన్ ఫింగర్ ప్రింట్‌గా చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ట్రాక్ చేయవచ్చు. చెప్పాంటే.. దొంగ సిమ్ మార్చినా ఐఎంఈఐ నంబర్ కారణంగా ఫోన్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయగానే సమాచారం పోలీసులు చేరుతుంది. దీంతో ఫోన్‌ను తిరిగి పొందడమే కాకుండా దొంగను కూడా పట్టుకోవచ్చు.


IMEI ప్రాముఖ్యత

  • దొంగిలించబడిన ఫోన్‌ను ట్రాక్ చేయడంలో IMEI నంబర్ సహాయపడుతుంది.
  • మీరు మీ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా మీరు IMEI నంబర్‌ని ఉపయోగించి టెలికాం కంపెనీ కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం ద్వారా నెట్‌వర్క్‌ను బ్లాక్ చేయవచ్చు.

Also Read: Lava Blaze 5G @ Rs 649: రూ.8,999 ధరగల 5జీ ఫోన్‌.. ఇప్పుడు రూ.649కే కొనుక్కోవచ్చు.. ఎలాగో తెలుసా..?

  •  నకిలీ ఫోన్‌లను గుర్తించడానికి IMEI నంబర్‌ను కూడా ఉపయోగించవచ్చు.
  •  కొన్ని సందర్భాల్లో IMEI నంబర్‌ను వారంటీ క్లెయిమ్‌లు చేయడానికి లేదా బీమా మొదలైన వాటి కోసం కూడా ఉపయోగించవచ్చు.
  • ఫోన్ IMEI నంబర్‌ను ఎలా కనుగొనాలంటే.. మీ ఫోన్‌లో #06# డయల్ చేయండి.
  • ఇది మీ ఫోన్ సెట్టింగ్‌లలో కూడా సాధారణంగా IMEI నంబర్‌ను చూడవచ్చు.
  • మీరు దీన్ని మీ ఫోన్ వెనుక ప్యానెల్ లేదా SIM ట్రేలో కూడా చూడవచ్చు.
  • IMEI నంబర్‌ను సురక్షితంగా ఉంచండి
  • మీరు మీ IMEI నంబర్‌ను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.

మీరు మీ ఫోన్ పోగొట్టుకున్నా లేదా అది దొంగిలించబడినా వెంటనే పోలీసు రిపోర్ట్‌ను ఫైల్ చేయండి. IMEI నంబర్ అనేది మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచడంలో సహాయపడే ముఖ్యమైన విషయం.

Tags

Related News

OnePlus Diwali Sale: వన్‌ప్లస్ దీపావళి ఆఫర్.. వీటిపై కొప్పలు తెప్పలు డిస్కౌంట్లు, అస్సలు వదలొద్దు!

Samsung Galaxy S24 FE: శాంసంగ్ పరుగులు.. అధునాతన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్, ట్యాబ్ వచ్చేస్తున్నాయ్!

OnePlus 13: 24 GB ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు కెవ్ కేక!

New Smartphone: 48 MP సోనీ సెన్సార్‌తో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. ఇంత తక్కువ ధరకేనా!

Flipkart Big Billion Days Sale 2024: స్మార్ట్‌ఫోన్ల జాతర.. రూ.7,499లకే 5జీ ఫోన్, మొత్తం 6 మోడళ్లపై భారీ డిస్కౌంట్లు!

iPhone 13 Price Cut: ఉఫ్ ఉఫ్.. చెమటలు పట్టించే ఐఫోన్ ఆఫర్, చాలా తక్కువకే కొనేయొచ్చు!

NASA Records Black hole Sound: అంతరిక్షంలో అలజడి.. భయానక శబ్దాలను రికార్డ్ చేసిన నాసా.. ఇదిగో ఇక్కడ వినండి

Big Stories

×