EPAPER

ICICI credit card : ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజర్స్ కు షాక్.. ఇకపై కోత తప్పదు!

ICICI credit card : ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజర్స్ కు షాక్.. ఇకపై కోత తప్పదు!

ICICI credit card : ప్రముఖ బ్యాంకింగ్ దగ్గర సంస్థ ఐసిఐసిఐ తన క్రెడిట్ కార్డ్ యూజర్స్ కు భారీ షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డ్ వాడకంలో కీలక మార్పులు చేస్తూ లావాదేవీపై లభించే రివార్డు ప్రయోజనాల్లో కోత విధించింది.


ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజర్స్ కు భారీ షాక్ ఇచ్చింది. గ్రోసరీ కొనుగోలు, ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫ్యూయల్ ఛార్జ్ రద్దు, లేట్ పేమెంట్స్ ఛార్జ్ విషయంలో మార్పులు చేస్తూ లావాదేవీల విషయంలో కోత విధించింది. రివార్డు ప్రయోజనాల్లో విధించిన ఈ కోత నవంబర్ 15 నుంచి అమలవుతుందని చెప్పింది.

కస్టమర్కు ఇప్పటికే మెసేజ్ రూపంలో ఇన్ఫర్మేషన్ను తెలియజేసింది. ఇక రాబోయే కాలంలో సైతం పెను మార్పులు ఉండబోతున్నాయని ముందే హెచ్చరించింది. అయితే ఈ మార్పులతో యూజర్స్ క్రెడిట్ కార్డు వాడకంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఓసారి చూద్దాం.


క్రెడిట్ కార్డు వాడకంపై షరతులు విధించిన ఐసిఐసిఐ.. యుటిలిటీ, ఇన్సూరెన్స్ చెల్లింపులపై కొత్తగా పరిమితిని తీసుకొచ్చింది. ప్రీమియం కార్డ్ హోల్డర్స్ కు రూ. 50 వేల వరకు సాధారణ కార్డు హోల్డర్స్ రూ.40 వేల వరకు మాత్రమే ఇకపై రివార్డులు అందించనున్నట్టు చెప్పుకొచ్చింది.

డిపార్ట్మెంటల్ స్టోర్ తో పాటు గ్రోసరీ ఖర్చులపై వచ్చే రివార్డులపై కోత విధించింది. కొన్ని కార్డులపై రూ. 40,000, మరికొన్ని కార్డులపై రూ. 20000 వరకు మాత్రమే రివార్డులు చెల్లిస్తామని తెలిపింది.

ఇక వార్షిక ఫీజు చెల్లింపులు, మైల్ స్టోన్ ప్రయోజనాలు కస్టమర్లు పొందేందుకు విధించిన పరిమితి నుంచి ప్రభుత్వ, ఎడ్యుకేషన్ చెల్లింపులతో పాటు రెంట్ చెల్లింపులు సైతం మినహాయిస్తున్నట్టు వెల్లడించింది.

ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో స్కూల్, కాలేజ్ ఫీజులు చెల్లిస్తే ఎలాంటి ఫీజు ఉండదని తెలిపింది. అయితే థర్డ్ పార్టీ ఆప్స్ ని ఉపయోగించి ఫీజు చెల్లింపులు చేసినప్పుడు మాత్రం ఒక శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

యాడ్ ఆన్ కార్డుపై వార్షిక ఫీజు రూ. 199 వసూలు చేస్తామని తెలిపింది.

త్రైమాసికం ప్రకారం లెక్క వేస్తూ రూ. 75 వేల కంటే ఎక్కువగా వినియోగించిన కస్టమర్స్ కు తదుపరి నెలలో లాంజ్ యాక్సెస్ సదుపాయం కల్పిస్తామని చెప్పింది.

ALSO READ : తొలి సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ ఇదే – ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఆలస్య చెల్లింపులు..

క్రెడిట్ కార్డు ఫీజులు ఆలస్యంగా చెల్లిస్తే ఫైన్ విధిస్తామని తెలిపింది.

రూ.100 వరకు ఎలాంటి చెల్లింపులు అవసరం లేదని.. రూ. 100 నుంచి రూ. 500 వరకు 100 రూపాయలు ఫైన్ వేస్తామని తెలిపింది.

రూ. 500 నుంచి రూ. 1000 వరకు రూ. 500 ఫైన్ ఫైన్ విధిస్తామని తెలిపింది.

రూ .1000 నుంచి రూ. 5000 వరకు రూ. 600 ఫైన్ ఫైన్ విధిస్తామని తెలిపింది.

రూ. 5000 నుంచి రూ. 10000 వరకు రూ. 750 ఫైన్ విధిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.

ఇక రూ. 10,000 నుంచి రూ. 25 వేల వరకు రూ. 900 ఫైన్ విధిస్తామని తెలిపింది.

రూ. 50వేలు పై పడిన కస్టమర్స్ ఫీజు చెల్లించడం ఆలస్యం అయితే రూ. 1300 వరకు ఫైన్ విధిస్తున్నట్టు తెలిపింది.

 

Related News

Oppo Find X8 : కిర్రాక్ ఫీచర్స్ తో ఒప్పో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Jio ISD : జియో బంపర్ ఆఫర్.. 29 దేశాలకు ISD కాలింగ్.. కేవలం రూ.39కే

Social Media : తొలి సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ ఇదే – ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Internet : రికార్డు వేగంతో ఇంటర్నెట్ సేవలు… ఏ దేశంలో ఎంతమంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారంటే?

Tesla Robo : తగ్గేదేలేదంటున్న టెస్లా.. ఎలక్ట్రానిక్ రంగంలో మరో ముందడుగు.. రోబో వ్యాన్, రోబో టాక్సీ లాంఛ్

WhatsApp Scam: వాట్సాప్ లో నయా స్కామ్, ఇలా చేశారో అంతే సంగతులు!

Big Stories

×