EPAPER
Kirrak Couples Episode 1

Sensor system :- మనిషి కదలికలను కనిపెట్టే సెన్సార్ సిస్టమ్..

Sensor system :- మనిషి కదలికలను కనిపెట్టే సెన్సార్ సిస్టమ్..

Sensor system :- మనిషి ఎప్పుడు, ఎందుకు అనారోగ్యానికి గురవుతాడు అనేది కనిపెట్టడం చాలా కష్టమయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు ఏ అనారోగ్య సమస్య వచ్చిపడుతుంది అనేది వైద్యులు కూడా నిర్ధారించలేకపోతున్నారు. అందుకే టెక్నాలజీ సాయంతో మనిషిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ, వారి ఆరోగ్యం గురించి సమాచారం అందించే పరికరాలు ఎక్కువయిపోయాయి. తాజాగా అందులోకి మరో సెన్సార్ కూడా యాడ్ అయ్యింది.


పెన్న్ స్టేట్‌లోని శాస్త్రవేత్తలు ఇతర ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలతో కలిసి ఒక కొత్త సెన్సార్ సిస్టమ్‌ను తయారు చేశారు. ఇది తనకు తానుగా పవర్ చేసుకుంటూ.. పర్యావరణంలో ఉన్నవాటితో పాటు మనిషి ఊపిరి నుండి వచ్చే గ్యాస్ మాలిక్యూల్స్‌ను కూడా స్టడీ చేస్తుంటుంది. నానోజెనరేటర్స్, మైక్రో సూపర్ కెపాసిటర్స్‌ను కలిపి ఈ సెన్సార్ సిస్టమ్‌ను తయారు చేశారు. ఇది మనిషి ప్రతీ కదలికను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉంటుంది. పైగా ఈ సెన్సార్ సిస్టమ్ తయారీ చాలా తక్కువ ఖర్చుతో అయిపోయిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

చాలావరకు అందుబాటులో ఉన్న పరికరాలతో, కొన్ని డాలర్లు ఖర్చు పెట్టి ఇతర మెటీరియల్స్ తెచ్చి ఈ సెన్సార్ సిస్టమ్‌ను తయారు చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని తయారీ కోసం కొందరు శాస్త్రవేత్తలు చాలాకాలంగా కష్టపడుతున్నారని అన్నారు. దీనికోసం గ్యాస్ సెన్సార్లపై ఎంతోకాలం స్టడీ కూడా చేశామన్నారు. ఒకే మెటీరియల్‌లో ఎన్నో భాగాలను కలిపి సమూహారంగా ఈ స్టాండలోన్ సెన్సార్ సిస్టమ్‌ను తయారు చేశామని వారు చెప్తున్నారు.


ఈ సెన్సార్ సిస్టమ్‌తో పాటు మనుషుల కదలికల వల్ల ఏర్పడే ఎనర్జీని స్టోర్ చేయడానికి సూపర్ కెపాసిటర్లను కూడా తయారు చేశారు శాస్త్రవేత్తలు. వీటిని పరీక్షించడం కోసం ఒక శాస్త్రవేత్త ముందుకొచ్చారు. వారు తమ ముక్కు, చేతి చుట్టూ ఈ సెన్సార్ సిస్టమ్‌ను అమర్చుకున్నారు. షూలలో నానోజెనరేటర్స్‌ను, షర్ట్ లోపల సూపర్ కెపాసిటర్లను అమర్చారు. ఆపై వారు వ్యాయామం చేయడం మొదలుపెట్టారు. కాలి కదలికలు వేగంగా ఉండడంతో అందులో నుండి వచ్చిన ఎనర్జీ మైక్రోకెపాసిటర్లలో స్టోర్ అయ్యింది. దీనికి సంబంధించిన సమాచారం బ్లూటూథ్ ద్వారా ఇతర శాస్త్రవేత్తలకు చేరింది. ఇలా ప్రతీ సందర్భంలో సెన్సార్ సిస్టమ్ మనిషి కదలికలను కనిపెడుతూ ఉంటుందని వారు ప్రాక్టికల్‌గా చేసి చూపించారు.

Artificial Muscles : మరింత సురక్షితంగా కృత్రిమ కండరాల తయారీ..

Related News

Google Maps : గూగుల్‌ మ్యాప్స్‌లో సరికొత్త టైమ్ ట్రావెల్​​ ఫీచర్‌ – ఇకపై గతంలోకి వెళ్లొచ్చు!

Sony Bravia 9 : సోనీ నుంచి 85 అంగుళాల బ్రేవియా టెలివిజన్

iphone demand in india : ఐఫోన్లకు భారీగా పెరిగిన గిరాకీ – డైమండ్స్​ను అధిగమించిన స్మార్ట్‌ ఫోన్ల విలువ!

Washing Machine Offers : వాషింగ్​ మెషీన్ కొనే ప్లాన్​లో ఉన్నారా? – అమెజాన్​లో ఈ మెషీన్లు ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ!

Amazon Smart Watch Sale : సూపర్ డీల్ బాస్.. ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడూ కొనలేరు.. స్మార్ట్ వాచెస్ పై అదిరిపోయే ఆఫర్స్!

Lava Agni 3 : స్పెషల్ ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ లాంఛ్… ప్రోసెసర్, కెమెరా ఫీచర్స్ అదుర్స్ గురూ!

Best Laptop Under 50000 : సేలా మజాకా.. హై క్వాలిటీ ల్యాప్ టాప్స్ పై మరీ ఇంత తగ్గింపా!

Big Stories

×