EPAPER

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

Make Money With ChatGPT: OpenAI కంపెనీ తీసుకొచ్చిన ChatGPT టెక్నాలజీ రంగంలో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ChatGPTని ఉపయోగించి చాలా మంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. ChatGPTతో డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలున్నాయి. మీ స్కిల్స్, క్రియేటివిటీతో తోడుగా ChatGPT యూజ్ చేసుకుని ఇంట్లో కూర్చొని డబ్బులు కూడబెట్టుకోవచ్చు. ఇంతకీ ChatGPTతో ఎలా డబ్బు సంపాదించుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


కంటెంట్ క్రియేషన్, రైటింగ్

ChatGPT సాయంతో రకరకాల అంశాల గురించి కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కంటెంట్ ను బ్లాగులో పోస్టు చేసుకోవచ్చు. బ్లాగును మానటైజేషన్ చేసుకుని ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ChatGPT సాయంతో ఆయా వెబ్ సైట్లకు కంటెంట్ రైటర్లుగా పని చేయవచ్చు. ఆర్టికల్స్ కు కావాల్సిన సమాచారాన్ని ChatGPT ద్వారా సమకూర్చుకోవచ్చు.


మార్కెటింగ్, SEO

ChatGPT సాయంతో వెబ్ సైట్లకు, బ్లాగ్ ల కోసం యూనిక్ కంటెంట్ ను రూపొందించుకునే అవకాశం ఉంది. అంతేకాదు. సోషల్ మీడియా ప్రచారాల కోసం పోస్టులు, క్యాప్షన్లు, ప్రమోషనల్ కంటెంట్ ను క్రియేటివ్ గా తయారు చేసుకునే అవకాశం ఉంది.

వెబ్‌సైట్ కంటెంట్ ఆడిట్

ChatGPT సాయంతో వెబ్‌సైట్ కంటెంట్ ఆడిట్ చేయవచ్చు.ఆయా బిజినెస్ల వెబ్ సైట్లకు సంబంధించి కంటెంట్ ను ఆడిటింగ్ చేయడంతో పాటు మెరుగుపరిచే అవకాశం ఉంది. అంతేకాదు, ఆయా బిజినెస్ లకు అభివృద్ధికి అవసరమైన వివరాలను సేకరించడంతో పాటు నివేదికలను రూపొందించే అవకాశం ఉంది.

చాట్‌ బాట్ డెవలపింగ్

ChatGPT ద్వారా పలు రకాల బిజినెస్ లకు అనుకూలమైన చాట్‌ బాట్‌ లను రూపొందించవచ్చు. కస్టమర్ సపోర్ట్ సేవలకు ఉపయోగపడే చాట్ బాట్ లను డెవలప్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది.

ఎడ్యుకేషన్, ట్రైనింగ్

ChatGPTని ఉపయోగించి స్పెషల్ టాపిక్స్ గురించి ఆన్ లైన్ కోర్సులను రూపొందించవచ్చు. విద్యార్థులకు అవసరం అయ్యే సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చు.

వ్యాపార సలహాలు

ChatGPT సాయంతో ఆయా వ్యాపారాలకు సంబంధించి సూచనలు, సలహాలు అందించవచ్చు. ప్రపోజల్స్, రిపోర్టులతో పాటు ముఖ్యమైన డాక్యుమెంట్లను రూపొందించే అవకాశం ఉంది.

క్రియేటివ్ రైటప్స్

ChatGPTని ఉపయోగించి క్రియేటివ్ గా రచనలు చేయవచ్చు. నవలలు, కథలు, కవితలు రాసుకోవచ్చు. అంతేకాదు, మీ రచనలు ఇ బుక్ ల రూపంలో అమ్ముకోవచ్చు. క్రియేటివ్ గా వీడియోలు రూపొందించేందుకు అవసరమైన కంటెంట్ ను పొందవచ్చు.

Also Read: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

పర్సనల్ అసిస్టెంట్ సర్వీస్‌లు

ChatGPTతో పలు రకాల పర్సనల్ అసిస్టెంట్ సర్వీస్‌లు అందించవచ్చు. షెడ్యూల్ మేనేజ్మెంట్ సహా పలు టాస్క్ లను నిర్వహించవచ్చు.

ట్రాన్స్ లేషన్స్

ChatGPT సాయంతో పలు భాషలకు సంబంధించిన అనువాదాలను చేయవచ్చు.

ఆన్‌లైన్ కస్టమర్ సపోర్ట్

ChatGPTతో పలు రకాల వ్యాపారాలకు అనుకూలంగా ఉండే కస్టమర్ సపోర్ట్ చాట్‌ బాట్‌ లను అందించవచ్చు.

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×