EPAPER
Kirrak Couples Episode 1

How To Check iPhone Is Real Or Fake : ఐఫోన్ కొంటున్నారా? మరి అది ఒరిజినలా? ఫేకా.. అనేది ఇలా కనిపెట్టేయండి

How To Check iPhone Is Real Or Fake : ఐఫోన్ కొంటున్నారా? మరి అది ఒరిజినలా? ఫేకా.. అనేది ఇలా కనిపెట్టేయండి

How To Check New IPhone Is Real Or Fake : మార్కెట్​లోకి ఎన్ని బ్రాండెడ్​ స్మార్ట్ ఫోన్లు వచ్చినా ఐఫోన్​కు ఉండే ప్రత్యేకతే వేరు. ఎందుకంటే ఈ యాపిల్ ఫోన్లకు సెక్యురిటీతో కలిగిన టాప్ టైర్​ ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​తో ఉండటంతో పాటు దీన్ని చాలా మంది ఓ స్టేటస్ సింబల్​గా భావిస్తారు. అందుకే ఈ ఐఫోన్లకు ఎప్పుడూ హై డిమాండ్ ఉంటుంది. మరి ఈ ఐఫోన్లను యాపిల్ స్టోర్ల నుంచి, యాపిల్ వైబ్ సైట్ల నుంచి కొనుగోలు చేస్తే ఎటువంటి సమస్య ఉండదు కానీ థర్డ్ పార్టీ ఈ కామర్స్ వెబ్​సైట్ల నుంచి కొనుగోలు చేయడం వల్ల ఒక్కోసారి సమస్య ఎదురవ్వొచ్చు. అవి నిజమైన ఐఫోన్లా.. లేదా నకిలీవా అనేది చెప్పలేం. ఇంకా చెప్పాలంటే నకిలీ వాటినీ కనిపెట్టడం కూడా కష్టమే. పైగా మన దగ్గర ఉన్న ఐఫోన్​కు రిపేర్ ఏమైనా వచ్చినప్పుడు కూడా దాన్ని ఐఫోన్ సర్వీస్ సెంటర్లకు ఇస్తే సరికానీ ఇతర చోట్ల ఇస్తే తిరిగి మన ఒరిజినల్ ఐఫోన్ మన చేతికి వస్తుందనే గ్యారంటీ లేదు. అందులో పార్ట్స్​ను మార్చేసి కస్టమర్లకు తిరిగి ఇచ్చేస్తుంటారు.


ప్రస్తుతం ఫెస్టివల్ సేల్స్​ కొనసాగుతున్నాయి. పైగా రీసెంట్​గానే ఐఫోన్​ 16 సిరీస్​ను విడుదల చేసింది యాపిల్. ఈ నేపథ్యంలో ఐఫోన్ 15, 13 సహా పలు మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. దీంతో కొనుగోలు చేసేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని మోసగాళ్లు నకిలీ విక్రయాలకు తెరలేపుతారు. అందుకే ఈ ఫెస్టివల్​ సేల్​లో ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ మార్కెట్లలో నకిలి ఫోన్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి మీరు కొత్తది కొన్నా, రిఫర్​బిష్​డ్​ది కొనుగోలు చేసినా? అది ఒరిజినలా? లేదా నకిలా? కనిపెట్టడం ఎలా? అనేది ప్రస్తుతం కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం..

ముందుగా ప్యాకేజింగ్, యాక్సెసరీస్​ చెక్​ – ఐఫోన్​ ప్రామాణికతను నిర్థారించుకోవడానికి ముందుగా ప్యాకేజింగ్, యాక్సెసరీస్​ను క్షుణ్ణంగా పరిశీలించాయి. యాపిల్​ ప్యాకేజింగ్​ విషయంలోనూ ఎంతో ఖచితత్త్వంతో ఉంటుంది. ప్రతి యాక్సెసరీపై దాని వివరాలను కచ్చితంగా, డీటెయిల్డ్​గా పొందుపరుస్తుంది. ఒరిజినల్​ iPhone బాక్స్‌లు ధృడంగా ఉంటాయి. వీటిపై హై క్వాలిటీ ఉన్న చిత్రాలతో డీటెయిల్డ్​ సమాచారం ఉంటుంది. బాక్స్​లో ఉన్న యాక్సెసరీస్​లో కేబుల్ Apple స్టాండర్డ్​కు తగ్గట్టుగా మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ పూర్ క్వాలిటీ ప్రింటింగ్, లూస్ ప్యాకేజింగ్, యాక్సెసరీస్​లో ఏదైనా తేడాగా అనిపిస్తే అది కచ్చితంగా నకిలీది అని నిర్థారణకు రావాలి.


సీరియల్ నెంబర్​, ఐఎమ్​ఈఐ వెరీఫై – ప్రతి స్మార్ట్ ఫోన్​కు ఉన్నట్టే ఐఫోన్​కు కూడా యూనిక్ సీరియల్ నెంబర్, ఇంటర్నేషనల్​ మొబైల్ ఈక్విప్​మెంట్​(ఐఎమ్​ఈఐ) నెంబర్ ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్​ను సెట్టింగ్​ – జనరల్​ – అబౌట్​లోకి వెళ్లి చూడాలి. అప్పుడు విజిట్ యాపిల్స్​ చెక్ కవరేజ్ పేజ్​లోకి వెళ్లి సీరియల్ నెంబర్​ను ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ ఐఫోన్ డివైస్ ఒరిజినల్ అయితే వెబ్​సైట్​ మీ ఐఫోన్ మోడల్ డీటెయిల్స్​, వారంటీ స్టేటస్​, ఇతర సమాచారాన్ని చూపిస్తుంది. *#06# కు డయల్ చేస్తే ఐఎమ్​ఈఐ నెంబర్ చూపిస్తుంది. అప్పుడు ఆ నెంబర్​ను బాక్స్​, సిమ్​ ట్రేపై ఉన్న ఐఎమ్​ఈఐ నెంబర్​కు మ్యాచ్​ అవ్వాలి. అలా అవ్వకపోతే మీ ఐఫోన్ నకిలీ అని నిర్థారణకు రావొచ్చు.

ALSO READ : వాట్సాప్ ప్రియులకు కిక్ ఇచ్చే అప్డేట్.. కొత్తగా ఈ 3 ఫీచర్స్

ఐపోన్ బుల్డ్ క్వాలిటీ – యాపిల్ ఐఫోన్స్ అంటే ​ప్రీమియమ్​తో పాటు బలంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. కింద పడినా డ్యామేజ్​ అవ్వవు. అంత బలంగా వీటిని తయారు చేస్తారు. జెన్యూన్ ఐఫోన్​ను అరచేతిలోకి తీసుకుంటే సాలిడ్​గా, బలంగా ఉండి, ఎటువంటి లూజ్ గ్యాప్స్​, పార్ట్స్​ లేకుండా ఉంటుంది. బటన్స్​ కూడా క్లిక్ చేయడానికి కంఫర్ట్​గా ఉంటాయి. వెనకవైపు ఉన్న యాపిల్ లోగో కూడా పర్ఫెక్ట్​గా, తాకగానే స్మూత్​ టచ్​ ఉండేలా ఉంటుంది. మొత్తంగా ఓవరాల్ డిజైన్, దాని ఫిజికల్ ఫీచర్స్​ టచ్ చేయగానే దాదాపుగా అర్థమవుతుంది. అలానే స్క్రీన్ సైజ్​, డిస్​ ప్లే క్వాలిటీ, బరువు, ఫోన్ మందం స్పెసిఫికేషన్స్​కు మ్యాచ్ అవ్వాలి. ఇంకా సిమ్ ట్రేను రిమూవ్ చేసి స్లాట్​ను చెక్ చేసుకోవాలి. అదే నకిలీ వాటిని బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే రఫ్​ ఎడ్జెస్​ ఉంటాయి. డిజైన్​లో కూాడా లైట్​గా తేడాగా అనిపిస్తుంది. లోగో, లూస్ బటన్స్​ కనిపిస్తాయి. ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ వీటిని కనిపెట్టలేమని గుర్తుపెట్టుకోవాలి.

సాఫ్ట్​వేర్, ఫీచర్స్ చెక్​ – ఫేక్ ఐఫోన్​ ను దాని సాఫ్ట్​వేర్​ ద్వారా కనిపెట్టొచ్చు. ఒరిజినల్ ఐఫోన్​.. యాపిల్​ ఐఓఎస్ ​తో నడుస్తాయి. దీనిని సెట్టింగ్స్​ – జనరల్​లోకి వెళ్లి సాఫ్ట్​వేర్ అప్డేట్​లోకి వెళ్లి చూడాలి. అప్పుడు లేటెస్ట్ వెర్షన్ ఐఓఎస్​ రన్నింగ్ అవుతుంటే అది ఒరిజినల్​. లేదంటే అది ఫేక్ అని అర్థం చేసుకోవాలి. అలానే పవర్ బటన్ పట్టుకుని సిరీని వినియోగించినప్పుడు సిరీ యాక్టివేట్ కాకపోయినా అది నకిలీ అని తెలుసుకోవచ్చు. ఫైనల్​ గా పైన చెప్పినవాటిలో ఏ ఒక్కటి కూడా తేడాగా అనిపించినా వెంటనే యాపిల్ సర్వీస్ సెంటర్ ​ను సంప్రదించాలి. అక్కడి ఎక్స్​పర్ట్స్ చెక్​ చేసి మీ ఐఫోన్ 100శాతం జెన్యూనా కాదా అనేది ​స్పష్టత ఇస్తారు.

Related News

Whatsapp New Features 2024 : వాట్సాప్ ప్రియులకు కిక్ ఇచ్చే అప్డేట్.. కొత్తగా ఈ 3 ఫీచర్స్

Jio Recharge Plan : జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్ – మరో సరికొత్త ​ప్లాన్​ తో వచ్చేసిన టెలికాం దిగ్గజం

Iphone 15 : పండగ సేల్ ఆఫర్​​ – ఐఫోన్​ 15, ఐఫోన్ 13పై కళ్లు చెదిరే డిస్కౌంట్​!

Samsung : రూ.10వేలకే శాంసాంగ్ 5G ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Amazon Great India Festival Sale 2024 : సామ్ సాంగ్ మెుబైల్స్ మరీ ఇంత చౌకా.. దిమ్మతిరిగే డీల్స్ మీకోసం!

iPhone 15: మతిపోగొట్టే ఆఫర్.. జస్ట్ రూ.15,650కే ఐఫోన్ 15, ఎలా కొనాలో తెలుసా?

Big Stories

×