EPAPER

Honor Magic V3 Launch: అల్లాడించే మ్యాజిక్ ఫోన్.. డీప్‌ఫేక్ డిటెక్షన్ టెక్నాలజీతో హానర్ వచ్చేస్తుంది.. ఇక సూస్కో మావా

Honor Magic V3 Launch: అల్లాడించే మ్యాజిక్ ఫోన్.. డీప్‌ఫేక్ డిటెక్షన్ టెక్నాలజీతో హానర్ వచ్చేస్తుంది.. ఇక సూస్కో మావా

Honor Magic V3 Launch: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు హానర్ కొత్త కొత్త ఫోన్లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఫోన్లనో సేఫ్టీ ఫీచర్లను అందించి ఫోన్ ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది. ఇలాంటి ఫీచర్లతో ఇప్పటికే చాలా మొబైళ్లను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఇక ఇప్పుడు మరొక మ్యాజిక్ చేసే ‘మ్యాజిక్ వి3’ ఫోన్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. హానర్ మ్యాజిక్ వి3 స్మార్ట్‌ఫోన్ వచ్చే వారం జూలై 12న విడుదల కానుంది.


దీనితో పాటు హానర్ మ్యాజిక్ Vs3, మ్యాజిక్‌ప్యాడ్ 2, మ్యాజిక్‌బుక్ ఆర్ట్ 14 కూడా లాంచ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ హానర్ మ్యాజిక్ వి3 కి సంబంధించిన కలర్ ఆప్షన్లను వెల్లడించింది. ఈ బుక్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మ్యాజిక్ V2 కంటే తేలికగా ఉంటుందని చెప్పబడింది. రెడ్ కలర్‌లో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ టీజర్‌ను హానర్ తాజాగా రిలీజ్ చేసింది. కాగా ఇది టండ్రా గ్రీన్, క్విలియన్ స్నో, వెల్వెట్ బ్లాక్ కలర్స్‌లో కూడా అందుబాటులోకి వస్తుందని చైనా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వీబోలో కంపెనీ ఒక పోస్ట్‌లో తెలిపింది.

ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. Magic V3 స్మార్ట్‌ఫోన్ 66 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000 mAh బ్యాటరీని ప్యాక్ చేసే అవకాశం ఉంది. కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి సంబంధించిన డిఫోకస్ ఐ ప్రొటెక్షన్, డీప్‌ఫేక్ డిటెక్షన్ టెక్నాలజీని ఫోన్‌లో అందించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. అలాగే హానర్ మ్యాజిక్‌ప్యాడ్ 2 విషయానికొస్తే.. ఇది 12.3-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది మొదటి విజన్ రిలీఫ్ టాబ్లెట్ అని కంపెనీ పేర్కొంది.


Also Read: ఉఫ్.. చెమటలు పట్టిస్తున్న హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్.. మరే ఫోన్లు వద్దంటారేమో!

ఈ టాబ్లెట్ చాలా స్లిమ్ బెజెల్స్‌తో ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు హానర్ 200 5G సిరీస్ గత నెలలో చైనాలో ప్రారంభించబడింది. త్వరలో భారత్‌లోనూ ఈ సిరీస్‌ను లాంచ్ చేయనున్నారు. ఇందులో హానర్ 200, హానర్ 200 ప్రో వంటివి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో లిస్ట్ చేయబడ్డాయి. Honor 200.. Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. అలాగే హానర్ 200 Pro Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు OLED పూర్తి HD+ స్క్రీన్‌ను కలిగి ఉంటాయి.

ఇది 5200 mAh బ్యాటరీతో 100 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. Honor 200, 200 Pro కోసం అమెజాన్‌లో లైవ్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి. ఇటీవల Honor 200 Pro మోడల్ నంబర్ ELP-NX9తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 14 ఆధారంగా MagicOS 8.0 పై రన్ అవుతాయి. ఇది పూర్తి HD+ (1,224 x 2,700 పిక్సెల్స్) స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ సిరీస్ ప్రో మోడల్ 6.78 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. బేస్ వేరియంట్ 6.7 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ మాక్రో కెమెరా ఉన్నాయి.

Tags

Related News

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

Oura Ring 4 : స్మార్ట్‌ రింగారే – 6 రంగులతో 12 సైజుల్లో… తక్కువ ధరకే, సూపర్ ఫీచర్స్​తో!

Disable Slow Charging : అయ్యో.. స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ సరిగ్గా ఎక్కట్లేదా!

Whats app Videocall update : వాట్సాప్ లో ఇకపై మరింత గోప్యత.. ఆ అప్డేట్ తెచ్చేసిన మెటా

Apple Festival Sale 2024 : అదిరిపోయే డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ తో ఆపిల్ సేల్ ప్రారంభం.. ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే!

Recharge Offers : 3 నెలలు ఫ్రీ ఇంటర్నెట్, 18 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌.. ఈ ఏడాదిలోనే బెస్ట్ ప్లాన్ ఇదే!

Best Gaming phones : అక్టోబర్​లో బెస్ట్​ కెమెరా, గేమింగ్​ స్మార్ట్ ఫోన్స్ ఇవే – ఊహించని రేంజ్​లో అతి తక్కువ ధరకే!

Big Stories

×