EPAPER

Honor 200 Series AI Features: ఆనర్ 200 సిరీస్ లో కొత్త ఎఐ ఫీచర్స్.. మ్యాజిక్ ఎరేజర్, ఫేస్ టు ఫేస్ ట్రాన్లేషన్.. మరెన్నో!

Honor 200 Series AI Features: ఆనర్ 200 సిరీస్ లో కొత్త ఎఐ ఫీచర్స్.. మ్యాజిక్ ఎరేజర్, ఫేస్ టు ఫేస్ ట్రాన్లేషన్.. మరెన్నో!

Honor 200 Series AI Features| ఇండియాలో ఆనర్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్‌కు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. మిగతా స్మార్ట్ ఫోన్స్ సంగతి ఎలా ఉన్నా.. చైనాకు చెందిన ఆనర్ ఫోన్ లో గేమింగ్ కోసమే ఎగబడే వారున్నారు. ఇటీవల ఆనర్ కంపెనీ ఆనర్ 200 5G, ఆనర్ 200 ప్రో 5G జూలై నెలలో ఇండియాలో లాంచ్ చేసింది. అయితే తాజాగా ఈ రెండు మోడల్స్ లోనూ కొత్తగా ఎఐ ఫీచర్స్ ను జోడించింది. దీనికి సంబంధించి MR2 అప్డేట్ ని గూగుల్ సెక్యూరిటీ తో ప్యాచ్ తో విడుదల చేసింది. ఈ రెండు మోడల్స్ లోనూ సెక్యూరిటీ ఎన్‌హాన్స్‌మెంట్స్ చేసి.. పర్మఫెర్మాన్స్ కూడా పెంచింది. ఈ అప్డేట్ సెప్టెంబర్ 13 నుంచి ఇండియన్ యూజర్స్ కు అందుబాటులో ఉంటుంది. హానర్ 200 సిరీస్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 ఆధారంగా నడిజే మ్యాజిక్ OS 8.0 ఉంటుంది.


కొత్త అప్డేట్ తో మంచి ఏఐ ఫీచర్స్ జోడించడం విశేషం. ఇందులో ఏఐ ఎరేజర్, ఫేస్ టు ఫేస్ ట్రాన్లేషన్ వంటి ఏఐ ఫీచర్స్ యూజర్స్ సౌలభ్యం కోసం జోడించారు. ఏఐ ఎరేజర్ ద్వారా యూజర్లు తమ ఫోటోలలో అవసరం లేని అబ్జెక్ట్స్, టెక్స్ట్, బ్యాక్ గ్రౌండ్ ఎలిమెంట్స్ ఈజీగా తొలగించవచ్చు. ఈ ఏఐ ఫీచర్స్ గూగుల్ క్లౌడ్ జెనెరేటివ్ కెపెబిలిటీస్ ఆధారంగా పనిచేస్తాయి.

కొత్త ఫేస్ టు ఫేస్ ట్రాన్స్‌లేషన్ ఏఐ ఫీచర్ ద్వారా పలు రకాల భాషల్లో వాయిస్, టెక్స్ట్ కమాండ్ ఆధారంగా ఆనర్ 200 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రియల్ టైమ్ ట్రాన్స్ లేషన్ అందిస్తాయి. ఈ MR2 అప్డేట్ లో యుఎస్‌బి కనెక్టివిటీకి సెక్యూరిటీ ఎన్‌హాన్స్‌మెంట్స్ చేశారు. దీని వల్ల ఫోన్ ఎప్పుడు ల్యాప్ టాప్ లేదా ఇతర డివైస్ కు కనెక్ట్ చేసినప్పుడు ఇది యూజర్ అథెంటికేషన్ అడుగుతుంది. ల్యాప్ టాప్ లేదా పీసీ తో కనెక్ట్ చేసి చార్జింగ్ చేయాలన్నా, డేటా ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా సెక్యూరిటీ కోసం యూజర్ అథెంటికేషన్ చేయాల్సిందే.


Also Read: స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తో రూ.999కే మొబైల్ ఫోన్.. UPI పేమెంట్స్ కూడా చేయొచ్చు

ఇందులో టైమ్ సేవింగ్, ఈజీ ఆక్సెస్ కోసం మరో చిన్న వెసలుబాటు చేశారు. యూజర్ తనకు ఇష్టమైన యాప్ కాంబినేషన్స్ ని హోమ్ స్క్రీన్ ఐకాన్స్ గా స్ప్లిట్ స్క్రీన్ మోడ్ లో సెట్ చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 13 నుంచి ఇండియాలో ఈ MR2 అప్డేట్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ MR2 అప్డేట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి యూజర్లు సెట్టింగ్స్ లోకి వెళ్లి, సిస్టమ్ అండ్ అప్డేట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవచ్చు. చెక్ ఫర్ అప్డేట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే.. ఆ తరువాత డివైస్ పెండింగ్ అప్డేట్స్ చేసేస్తుంది.

ఈ 200 సిరీస్ తో పాటు పలు కొత్త మోడల్స్ ని ఆనర్ కంపెనీ బెర్లిన్ లో ఇంటర్నేష్నల్ ఫంకావుస్తెల్లుంగ్ టెక్ ఫెస్ట్ 2024లో లాంచ్ చేసింది. ఇందులో ఆనర్ వాచ్ 5, ఆనర్ మ్యాజిక్ బుక్ ఆర్ట్ 14 విశేష ఆకర్షణగా నిలిచాయి. అయితే ఇండియాలో ఆనర్ ప్యాడ్ ఎక్స్ X8a (Honor Pad X8a) ని కంపెనీ లాంచ్ చేయనుంది.

Related News

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

New Smartphone: కొత్త ఫోన్ లాంచ్.. రూ.10,000 లకే పొందొచ్చు, ఫీచర్లు బాగున్నాయ్!

HMD Skyline Launched: హెచ్‌ఎండీ నుంచి కొత్త ఫోన్.. డిజైన్ అదుర్స్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్, ధర ఎంతంటే?

Big Stories

×