EPAPER

HMD Skyline Launched: హెచ్‌ఎండీ నుంచి కొత్త ఫోన్.. డిజైన్ అదుర్స్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్, ధర ఎంతంటే?

HMD Skyline Launched: హెచ్‌ఎండీ నుంచి కొత్త ఫోన్.. డిజైన్ అదుర్స్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్, ధర ఎంతంటే?

HMD Skyline Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్లలో నోకియా బ్రాండ్ ఒకటి. ఒకప్పుడు నోకియా ఫోన్లకు అద్భుతమైన రెస్పాన్స్ ఉండేది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి మొబైల్‌కు దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి డిమాండ్, క్రేజ్‌ ఉండేది. కానీ ఇప్పుడంతా మారిపోయింది. మార్కెట్‌లోకి కొత్త కొత్త కంపెనీలు ఎంట్రీ ఇవ్వడంతో నోకియా కనుమరుగైంది. ఈ కంపెనీ ఫోన్ల‌ు కొనేవారు పూర్తిగా తగ్గిపోయారు. ఈ తరుణంలో నోకియా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ HMD తన హవా చూపించేందుకు మార్కెట్‌లోకి వచ్చేంది. ఇందులో భాగంగానే తన లైనప్‌లో ఉన్న కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది.


తాజాగా HMD సరికొత్త స్మార్ట్‌ఫోన్ HMD Skyline భారతదేశంలో లాంచ్ చేయబడింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్ని నెలల క్రితం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఆ సమయంలో ఈ ఫోన్‌కి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ ఫోన్ డిజైన్ పరంగా నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లా కనిపించింది. ఇక తాజాగా దేశంలో విడుదలైన స్కైలైన్‌ ఫోన్ అచ్చం గ్లోబల్ వెర్షన్‌ మాదిరిగానే అదే డిజైన్‌ను కలిగి ఉంటుందని.. ఫీచర్లు కూడా వాటి లాగానే ఉంటాయని అంటున్నారు. ఇప్పుడు ఈ HMD Skyline ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, ధర మొదలైన వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

HMD Skyline Specifications


HMD Skyline స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ FHD+ రిజల్యూషన్‌తో వస్తుంది. అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇంకా డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని ప్రాసెసర్ విషయానికొస్తే.. HMD స్కైలైన్‌లో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ ఉంది.

Also Read: రూ.8,999లకే 5జీ ఫోన్లు.. రూ. 6,999లకే స్మార్ట్‌టీవీలు, అమెజాన్ న్యూస్ అదిరిపోయింది!

అలాగే ఇందులో 12GB RAM + 256GB ఇంబిల్ట్ స్టోరేజ్ అందించారు. సేఫ్టీ కోసం పవర్ బటన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించబడింది. అలాగే స్మార్ట్‌ఫోన్ కస్టమ్ బటన్‌ను కూడా కలిగి ఉంది. దీని ద్వారా గేమ్‌ను ప్రారంభించినపుడు లేదా ప్రత్యేక టాస్క్‌లను సెట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే సులభంగా DIY రిపేర్‌ కోసం స్మార్ట్‌ఫోన్ Gen2 రిపేరబిలిటీతో వస్తుంది. ఇక దీని కెమెరా సెటప్ విషయానికొస్తే.. HMD స్కైలైన్ వెనుక భాగంలో OIS మద్దతుతో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.

ఇది 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో వస్తుంది. అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో ఇది ఆటో ఫోకస్, ఐ ట్రాకింగ్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇందులో బిల్ట్ ఇన్ సెల్ఫీ గెస్టర్ ఫీచర్‌ను అందించారు. ఇది సులువైన సెల్ఫీలను క్లిక్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 33W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4600mAh బ్యాటరీని అందించారు.

HMD Skyline Price

HMD Skyline ధర విషయానికొస్తే.. HMD స్కైలైన్ ఫోన్ రూ. 35,999 ధరను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ నియాన్ పింక్, ట్విస్టెడ్ బ్లాక్ కలర్స్‌ ఆప్షన్లలో వస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్, అలాగే రిటైల్ స్టోర్‌లు, HMD వెబ్‌సైట్‌లో సేల్‌కు అందుబాటులో ఉంటుంది.

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×