EPAPER

HMD Crest And HMD Crest Max: హెచ్ఎండీ కొత్త ఫోన్ల సేల్ షురూ.. ఈ ప్రోమో కోడ్‌తో మరింత తక్కువకే పొందొచ్చు..!

HMD Crest And HMD Crest Max: హెచ్ఎండీ కొత్త ఫోన్ల సేల్ షురూ.. ఈ ప్రోమో కోడ్‌తో మరింత తక్కువకే పొందొచ్చు..!

HMD Crest, HMD Crest Max: ఒకప్పుడు నోకియా ఫోన్లకు దేశీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ అండ్ క్రేజ్ ఉండేది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లపై చాలా మంది ఆసక్తి చూపించేవారు. అయితే ఆ తర్వాత మార్కెట్‌లోకి రకరకాల కంపెనీలు రావడంతో నోకియా ఫోన్లకు డిమాండ్ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో నోకియా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ HMD మార్కెట్‌లో తన హవా చూపించేందుకు ముందుకు వచ్చింది. ఇటీవల భారతదేశంలో HMD క్రెస్ట్, క్రెస్ట్ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. వాటి సేల్స్ ఆగస్టు 6 నుంచి ప్రారంభమయ్యాయి.


అమెజాన్‌లో జరుగుతున్న సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌లను అత్యంత భారీ తగ్గింపుతో కొనుక్కోవచ్చు. ఈ రెండు ఫోన్లు ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 5000 mAh బ్యాటరీతో వస్తాయి. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులో ఉంది.

HMD Crest, HMD Crest Max Price


HMD క్రెస్ట్ స్మార్ట్‌ఫోన్ 6GB+128 GB మోడల్ ధర రూ. 14,499గా కంపెనీ నిర్ణయించింది. దీనిపై మొదటి సేల్‌లో రూ.1500 తగ్గింపు ఉంది. ఈ తగ్గింపుతో హెచ్ఎండీ క్రెస్ట్ రూ. 12999కి పొందవచ్చు. అదే సమయంలో HMD క్రెస్ట్ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ 8GB+256 GB మోడల్ ధర రూ.16499గా కంపెనీ నిర్ణయించింది. దీనిపై కూడా కంపెనీ రూ.1500 తగ్గింపు అందిస్తుంది. దీంతో హెచ్‌ఎండీ మాక్స్ ఫోన్‌ని రూ.14999 ధరకు కొనుక్కోవచ్చు.

Also Read: తస్సాదియ్యా.. రూ. 6,500లకే కొత్త ఫోన్ లాంచ్.. ఎవ్వరికీ చెప్పొద్దు..!

అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో HMD క్రెస్ట్, HMD క్రెస్ట్ మ్యాక్స్ సేల్‌కి అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనుక్కునేటప్పుడు చెక్అవుట్ సమయంలో CREST500 ప్రోమో కోడ్‌ను ఎంటర్ చేయాలి. అప్పుడు ఈ ఫోన్‌లపై రూ. 500 తగ్గింపును పొందవచ్చు. అలాగే SBI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే 1,000 రూపాయల తగ్గింపును పొందవచ్చు. దీంతో మొత్తం రూ.1500 తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్ 11 ఆగస్టు 2024 వరకు అందుబాటులో ఉంటుంది.

HMD Crest, HMD Crest Max Specifications

HMD Crest, HMD Crest Max స్మార్ట్‌ఫోన్లు 6.67 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తాయి. HMD క్రెస్ట్‌లో 2 MP డెప్త్ సెన్సార్‌తో పాటు 50 మెగాపిక్సెల్ మెయిన్ బ్యాక్ కెమెరా ఉంది. అదే సమయంలో HMD క్రెస్ట్ మ్యాక్స్ 5 MP అల్ట్రా వైడ్, 2 MP మాక్రో సెన్సార్‌తో పాటు 64 MP ప్రధాన వెనుక కెమెరాను కలిగి ఉంది. రెండు ఫోన్‌లలో 50 ఎంపీ సెల్ఫీ కెమెరాను అమర్చారు. HMD క్రెస్ట్ 6 GB RAMని కలిగి ఉంది. దీనిని వాస్తవంగా 6 GB వరకు విస్తరించవచ్చు. HMD క్రెస్ట్ మ్యాక్స్ 8 GB RAMని కలిగి ఉంది. ఇది వర్చువల్‌గా కూడా విస్తరించవచ్చు.

ఈ ఫోన్‌లు యునిసాక్ T760 ప్రాసెసర్‌తో అమర్చబడి సరికొత్త ఆండ్రాయిడ్‌లో రన్ అవుతాయి. రెండు ఫోన్‌లు 5000 mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఇది 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. HMD క్రెస్ట్ మూడు కలర్‌లలో అందుబాటులోకి వచ్చింది. అవి మిడ్‌నైట్ బ్లూ, రాయల్ పింక్, లష్ లిలక్. అదే సమయంలో క్రెస్ట్ మ్యాక్స్ డీప్ పర్పుల్, రాయల్ పింక్, ఆక్వా గ్రీన్ కలర్‌లలో లభిస్తుంది. ఈ ఫోన్‌లు HMD.comలో కూడా అందుబాటులో ఉంటాయి.

Related News

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Big Stories

×