EPAPER

LIGO India Project:- ఇండియాలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్.. యూఎస్‌తో సమానంగా…

LIGO India Project:- ఇండియాలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్.. యూఎస్‌తో సమానంగా…


LIGO India Project:- ఇప్పటికే ఇండియా ఎన్నో విధాలుగా ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు పోటీ ఇస్తూ ముందుకెళ్తోంది. ముఖ్యంగా స్పేస్ రంగంలో ఇండియా సాధించిన ఘనతల గురించి శాస్త్రవేత్తలు, ఆస్ట్రానాట్స్ గర్వంగా చెప్పుకుంటారు. తాజాగా మరో మైలురాయిని తాకడానికి ఇండియా సిద్ధంగా ఉంది. భూమిపై గ్రావిటేషనల్ వేవ్స్‌ను స్టడీ చేయడానికి ఇండియా ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల శాస్త్రవేత్తల దృష్టి కూడా దీనిపైనే ఉంది.

లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ.. షార్ట్‌కట్‌లో లిగో ఇండియా ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం ప్రపంచ దేశాలు సైతం మాట్లాడుకుంటున్నాయి. స్పేస్‌లో, భూమిపై ఉన్న ఎన్నో మిస్టరీలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా సమాధానాలు కనుక్కోవాలని ఇండియన్ శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. మొత్తం లిగో ప్రాజెక్ట్‌కు అయ్యే ఖర్చు రూ.2,500 కోట్లను తాజాగా యూనియన్ క్యాబినేట్ సమ్మతించింది. మహారాష్ట్రలోని హంగోళి జిల్లాలో ఇది ఏర్పడనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయని సమాచారం.


ఇప్పటికే అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో ఈ లిగో ప్రాజెక్ట్స్ అనేవి ఏర్పాటయ్యాయి. గ్రావిటేషనల్ వేవ్స్‌ను కనిపెట్టడమే ఈ ప్రాజెక్ట్స్ యొక్క ముఖ్య లక్ష్యం. అందులోనూ లిగో ఇండియా ఇందులో మరింత మెరుగ్గా పనిచేయాలని భావిస్తోంది. గ్రావిటేషనల్ వేవ్ డిటెక్టర్స్ అన్నీ ఒకే లక్ష్యంతో పనిచేసినా.. వాటి టైమింగ్‌లో మాత్రం కొన్ని తేడాలు ఉంటాయి. ట్రిగనామెటరీ పద్ధతిలో ఈ టైమింగ్ తేడాలను గమినిస్తూ వీటిని సరిచేస్తూ ముందుకెళ్లడమే కష్టమైన విషయమని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

ప్రతీ రెండు గ్రావిటేషనల్ డిటెక్టర్స్‌కు కనీసం మిల్లీసెకండ్స్ అయినా గ్యాప్ ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పైగా ఆకాశంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా టైమ్ గ్యాప్ ఉంటుందని, వారిని కూడా క్షుణ్ణంగా పరీక్షించాలన్నారు. అందుకే డిటెక్టర్లు ఎక్కువ దూరంలో ఉండడమే మంచిదని తెలిపారు. అందుకే అమెరికాలో ఉన్న రెండు డిటెక్టర్లు ఒకటి వాషింగ్టన్‌లో ఉండగా.. మరొకటి లివింగ్‌స్టోన్‌లో ఉంది. ఈ రెండిటికి దాదాపు 300 కిలోమీటర్ల దూరం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే పద్ధతిలో లిగోను కూడా అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Related News

Android Tips : ఆండ్రాయిడ్‌లో చాలా మందికి తెలియని ఫీచర్స్.. మీరు ట్రై చేశారా?

Commercial Space Station: అంతరిక్ష హోటల్ లో ఎంజాయ్ చేద్దాం పదండి, వచ్చే ఏడాదే ప్రారంభం!

Phone Pay Diwali Insurence : దీపావళి టపాసుల నుంచి రక్షణ – కేవంల రూ.9కే ఫోన్‌ పే బీమా పాలసీ

Samsung Galaxy Ring : శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ ప్రీ ఆర్డర్​ డీటెయిల్స్​ – ఎప్పుడు, ఎలా చేసుకోవచ్చు!

Gmail Frauds : జీమెయిల్ వాడుతున్నారా.. త్వరలోనే సైబర్ నేరగాళ్ల నుంచి కాల్ రావొచ్చు.. జాగ్రత్త!

Apple Smart Glasses : ఆపిల్ దూకుడు..త్వరలోనే కెమెరాతో రాబోతున్న స్మార్ట్ గ్లాసెస్

Instagram Followers : ఇన్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అమాంతం పెరగాలా.. ఫాలో దిస్ టిప్స్

Big Stories

×