EPAPER

Hearing Aids:- హియరింగ్ ఎయిడ్స్‌తో మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు..!

Hearing Aids:- హియరింగ్ ఎయిడ్స్‌తో మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు..!


Hearing Aids:- ఒకప్పుడు వయసు పెరుగుతున్నకొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రతీదానికి ఒక సొల్యూషన్ దొరికింది. కంటిచూపు మందగిస్తే.. ఆపరేషన్లు ఉన్నాయి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే వినికిడి లోపం ఉన్నవారికోసం హియరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి. అంతే కాకుండా వీటన్నింటిని ఎప్పటికప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి కొత్తగా తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు. ప్రస్తుతం అలాంటి ఒక హియరింగ్ ఎయిడ్ మార్కెట్లోకి వచ్చింది.

హియరింగ్ ఎయిడ్స్ అనేవి కేవలం వినికిడి లోపం ఉన్నవారికి ఇతరులు చెప్పే విషయాలు స్పష్టంగా వినిపించడం కోసం తయారు చేశారు. ఆ తర్వాత టెక్నాలజీ మారింది. దాని సాయంతో హియరింగ్ ఎయిడ్స్‌లో ఉండే సౌండ్ సిస్టమ్ కూడా మెరుగుపడుతూ వచ్చింది. ప్రస్తుతం ఇవి స్పీచ్ నుండి అనవరసరమైన వాయిస్‌ను తీసేసి కేవలం అవసరమైన విషయాలు మాత్రమే వినిపించేలా చేస్తున్నాయి. కానీ ఇప్పటివరకు హియరింగ్ ఎయిడ్స్ అనేవి కేవలం స్పీచ్‌ను వినడం కోసం తప్పితే మ్యూజిక్‌ను వినడం కోసం ఏర్పాటు కాలేదు.


తాజాగా శాస్త్రవేత్తలకు ఇలాంటి ఆలోచనే వచ్చింది. హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకున్నవారు మ్యూజిక్‌ను ఎంజాయ్ చేసే సౌకర్యం అందించాలని వారికి అనిపించింది. అంతే ఆ ఆలోచనతో కొత్త రకమైన హియరింగ్ ఎయిడ్స్‌ను తయారు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ ఐడియా గురించి వారు ఓపెన్‌గా ప్రకటించారు. చాలామంది ఈ ఐడియాను విని వారిని ప్రశంసించడంతో పాటు సపోర్ట్ చేయడానికి కూడా ముందుకొచ్చారు. తాజాగా జరిగిన ఒక కాన్ఫరెన్స్‌లో మ్యూజికల్ హియరింగ్ ఎయిడ్స్ గురించి బయటికొచ్చింది.

ఇప్పటివరకు జరిగిన సర్వేల ప్రకారం.. అమెరికన్లు యావరేజ్‌గా రెండు గంటలు మ్యూజిక్‌ను వింటుంటారని తెలిసింది. మ్యూజిక్ వినడం అనేది మనిషి మెంటల్ హెల్త్‌ను, ఎమోషనల్ హెల్త్‌ను మెరుగుపరుస్తుందని ఇప్పటికే పలు స్టడీలలో తేలింది. కానీ గత రెండు దశాబ్దాలుగా హియరింగ్ ఎయిడ్స్ ఉపయోగిస్తున్న పేషెంట్లు మ్యూజిక్‌ను వినే విషయంలో నిరుత్సాహంగా ఉన్నారని బయటపడింది. అయితే హియరింగ్ ఎయిడ్స్ ఉపయోగించేవారికి కూడా మ్యూజిక్ లాంటి ఎంటర్‌టైన్మెంట్ ముఖ్యమని శాస్త్రవేత్తలు భావించారు.

ప్రస్తుతం ఈ ఆలోచనతో పలు హియరింగ్ ఎయిడ్స్ కంపెనీలు తమ పరికరాలు మ్యూజిక్ ప్రోగ్రాంలను డిజైన్ చేశాయి. మ్యూజికల్ హియరింగ్ ఎయిడ్స్‌ను తయారు చేసిన తర్వాత అవి మార్కెట్లోకి వెళ్లేముందే వాటిని క్షుణ్ణంగా పరీక్షించడంతో పాటు పలువురి చేత రివ్యూ చేయించారు. ఇప్పటికీ ఈ హియరింగ్ ఎయిడ్స్‌ను మెరుగుపరచడం కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉండగా.. త్వరలోనే ఇవి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలోకి అందుబాటులోకి వస్తాయని కంపెనీలు చెప్తున్నాయి.

Tags

Related News

Poco F6 5G Price Drop: ఇదేం ఆఫర్ సామీ.. ఏకంగా రూ.8000 డిస్కౌంట్, ఇప్పుడు తక్కువకే కొనేయొచ్చు!

Airtel Cheap Recharge Plan: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వెరీ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్, 1.5GB డేటా పొందొచ్చు!

Xiaomi 15 Series: షియోమి నుంచి కొత్త ఫోన్లు.. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో లాంచ్‌కు రెడీ, స్పెసిఫికేషన్లు అదిరిపోయాయ్!

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Big Stories

×