Big Stories

Alzheimers: కంటి ఆరోగ్యంతో మానసిక సమస్యకు చెక్..

Alzheimers: అల్జీమర్స్ లాంటి మానసిక వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్నా.. అసలు దానికి కారణాలు ఏంటని ఇప్పటివరకు ఎవరూ పూర్తిగా కనిపెట్టలేకపోయారు. అంతే కాకుండా ఈ వ్యాధి అనేది మనిషిపై తీవ్ర ప్రభావం చూపించేవరకు బయటపడదు కాబట్టి దీనికి చికిత్సను అందించడం కూడా కష్టంగా మారింది. అందుకే శాస్త్రవేత్తలు అల్జీమర్స్ వ్యాధిని ముందస్తుగా కనిపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఓ కొత్త విషయాన్ని కనుగొన్నారు.

- Advertisement -

కంటిలోని రక్తనాళాలు దెబ్బతినడం వల్ల అల్జీమర్స్ సోకుతుందని తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. అందుకే ముందుగా కంటిలోని మార్పులను గమనిస్తే.. అల్జీమర్స్‌ను ముందస్తుగా కనిపెట్టే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. వారు చేసిన పరిశోధనల్లో ముఖ్యంగా కంటిలోని రెటీనాలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఆ మార్పులు అల్జీమర్స్‌కు ఎలా దారితీస్తాయి అనేది తెలుస్తుందని కనిపెట్టారు. అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారిలో రెటీనాపై తీవ్ర ప్రభావం పడుతుందని కూడా వారు బయటపెట్టారు.

- Advertisement -

అల్జీమర్స్ అనేది కంటిపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి కంటి సమస్యలను కనిపెడుతూ ఉండడం వల్ల అల్జీమర్స్‌ను కూడా ముందస్తుగా కనిపెట్టే అవకాశాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పరిశోధనల కోసం అల్జీమర్స్‌తో బాధపడుతున్న వారి కంటి శాంపుల్స్‌ను శాస్త్రవేత్తలు కలెక్ట్ చేశారు. ఆ పేషెంట్లకు సంబంధించిన కంటి రెటీనా 70 శాతం దెబ్బతిన్నదని వారు గుర్తించారు. కంటిచూపు సమస్యలు ముందు నుండే ఉన్నవారిపై అల్జీమర్స్ వ్యాధి తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపారు.

కొన్నిసార్లు కంటిచూపు సమస్యలు సోకడం అనేది మన చేతుల్లోనే ఉంటుందని, అందుకే అలాంటి సమస్యల నుండి దూరంగా ఉండడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కంటిచూపు సమస్యలు అనేది కేవలం అల్జీమర్స్ మాత్రమే కాకుండా మరెన్నో మానసిక సమస్యలకు కూడా దారితీస్తాయని అన్నారు. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్ చేసుకోవడం, షుగర్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినడం, మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండడం.. ఇవన్నీ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయని సలహా ఇస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News