EPAPER

Google Pixel 9 Pro Fold : గూగుల్ పిక్సిల్ 9 ప్రో ఫోల్డింగ్ ఫోన్ వచ్చేసింది.. ధర కూడా తక్కువే జస్ట్..

Google Pixel 9 Pro Fold : గూగుల్ పిక్సిల్ 9 ప్రో ఫోల్డింగ్ ఫోన్ వచ్చేసింది.. ధర కూడా తక్కువే జస్ట్..

Google Pixel 9 Pro Fold : గూగుల్ కొత్త స్మార్ట్ ఫోన్ గూగుల్ గూగుల్ పిక్సిల్ 9 ప్రో ఫోల్డ్ సిరీస్ ఇప్పుడు ఇండియాలో లాంచ్ అయ్యాయి. ఈ కొత్త పిక్సెల్ సిరీస్ లో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో Xl, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ మోడల్స్ ఉన్నాయి. వీటన్నింటిలో లేటెస్ట్ గా లాంచ్ అయిన గూగుల్ పిక్సిల్ 9 ప్రో ఫోల్డ్.. గూగుల్ అందిస్తున్న రెండో ఫోల్డింగ్ స్మార్ట్ ఫోన్. దానికంటే ముందు లాంచ్ అయిన గూగుల్ పిక్సిల్ ఫోల్డ్ ఇండియాలో అందుబాటులో లేదు. ఇతర దేశాలలో లాంచ్ అయిన మూడు వారాల తరువాత గూగుల్ పిక్సిల్ 9 ప్రో ఫోల్డ్ ఇండియాలో లాంచ్ కావడం గమనార్హం.


అయితే యూజర్లకు ఈ ఫోన్ సెప్టెంబర్ 4 నుంచి మార్కెట్లో లభిస్తుంది. ఈ కామర్స్ దిగ్గజ ప్లాట్ ఫామ్.. ఫ్లిప్ కార్ట్ లో గూగుల్ పిక్సిల్ 9 ప్రో ఫోల్డ్ సేల్ పై అద్భుతమైన ఆఫర్లు కూడా ఉన్నాయి.

గూగుల్ పిక్సిల్ 9 ప్రో ఫోల్డ్ ఆఫర్లు ఇవే
సెప్టెంబర్ 4, 2024 మధ్యహ్నం 12 గంటల నుంచి గూగుల్ పిక్సిల్ 9 ప్రో ఫోల్డ్ ఇండియాలో కొనుగోలు చేసేందుకు యూజర్ల కు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం సింగిల్ వేరియంట్ లోనే లభిస్తోంది. 16 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజితో ‘అబ్ సేడియన్’ కలర్ లో వస్తున్న ఈ ఫోల్డింగ్ గూగుల్ స్మార్ట్ ఫోన్ రూ. 1,72,999 ధరకు ఫ్లిప్ కార్ట్ లో లభిస్తోంది.


ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ.10,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఒక వేళ స్మార్ట్ ఫోన్ ఎక్స్ ఛేంజ్ ఆఫర్ లో కొనాలంటే అదనంగా రూ.13,500 డిస్కౌంట్ కూడా ఉంటుంది. అంటే ఎక్సె ఛేంజ్ + ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో డిస్కౌంట్ పై ఈ స్మార్ట్ ఫోన్ రూ.1,49,499 ల ధరకే లభిస్తుంది.

గూగుల్ పిక్సిల్ 9 ప్రో ఫోల్డ్ ఫీచర్స్

  • గూగుల్ పిక్సిల్ 9 ప్రో ఫోల్డ్ లో 8 అంగుళాల ఓటెడ్ ప్యానెల్ ఉంటుంది. ఈ ప్యానెల్ లో 2K (2152×2076) రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,800 nits HDR మరియు 2,700 nits పీక్ బ్రైట్‌నెస్, అలాగే 24-బిట్ కలర్ సపోర్ట్.
  • ఈ స్మార్ట్ ఫోన్ లో FHD+ (2424×1080) రిజల్యూషన్‌తో 60-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,800 nits HDR, 2,700 nits పీక్ బ్రైట్‌నెస్ మరియు 24-బిట్ కలర్ సపోర్ట్ తో 6.3-అంగుళాల OLED కవర్ స్క్రీన్ కూడా ఉంటుంది.
  • అయితే ఈ ఫోల్డింగ్ స్మార్ట్ ఫోన్ లోని కోర్ ప్రాసెసర్ కు Tensor G4 SoC టైటాన్ M2 సెక్యూరిటీ కో-ప్రాసెసర్‌తో జత చేయబడింది. ఈ స్మార్ట్ డివైస్ లో 4,650mAh బ్యాటరీ, ఛార్జింగ్ కోసం 45W వైర్ ఛార్జర్, అలాగే Qi వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
  • ఫోల్డింగ్ స్మార్ట్ ఫోన్ లో 48MP ప్రైమరీ సెన్సార్, 10.5MP అల్ట్రావైడ్ లెన్స్, 5x ఆప్టికల్ – 20x సూపర్-రిజల్యూషన్ జూమ్ సపోర్ట్‌తో 10.8MP టెలిఫోటో జూమ్ లెన్స్‌తో సహా వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అమర్చారు.
  • ఫోన్ ముందుభాగంలో 10MP ఫ్రంట్ కెమెరా కవర్ డిస్ ప్లే పై ఉంది. మరో 10MP ఫ్రంట్ కెమెరా మెయిన్ డిస్ ప్లే పై ఉంది.

Also Read: గూగుల్ పిక్సెల్ 8ఏ పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్ కార్ట్ లో అతి తక్కువ ధరకు!

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×