EPAPER

Gaming Apps : గేమింగ్ యాప్స్‌తో జాగ్రత్త..! యూజర్ల సమాచారంతో ఆటలు..

Gaming Apps : గేమింగ్ యాప్స్‌తో జాగ్రత్త..! యూజర్ల సమాచారంతో ఆటలు..

Gaming Apps : ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ అనేవి మార్కెట్లోకి ఎంటర్ అయిన కొత్తలో గేమ్ యాప్స్ అనేవాటికి చాలా క్రేజ్ ఉండేది. ఇప్పటికీ కూడా కొన్ని గేమ్స్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. కానీ ఆ గేమ్స్ అనేవి మన ఫోన్‌పై, అందులో ఉన్న డేటాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది చాలామందికి తెలియదు. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ గేమ్స్ అనేవి యూజర్లకు చెందిన చాలా డేటాను తెలియకుండానే యాక్సెస్ చేస్తాయని తేలింది.


కాల్ ఆఫ్ డ్యూటీ, క్యాండీ క్రష్ సాగా, కార్రమ్ పూల్, డిస్క్ గేమ్.. ఇలాంటి గేమ్స్ అన్ని ముందుగానే చాలా డేటాకు యాక్సెస్ కోరుతాయని, మనకు తెలియకుండానే ఆ యాక్సెస్‌ను మనం వాటికి ఇచ్చేస్తామని నిపుణులు చెప్తున్నారు. 32 డేటా పాయింట్స్‌లో 17 డేటా పాయింట్స్ వాటికి అందించేస్తున్నామని వారు బయటపెట్టారు. ఇందులో ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్స్, లొకేషన్ లాంటివి కూడా ఉంటాయని తేలింది. ఇందులో లుడో కింగ్, సబ్‌వే సర్ఫర్స్ లాంటి గేమ్స్ కూడా ఉంటాయని సైబర్ సెక్యూరిటీ కంపెనీ బయటపెట్టింది.

అన్ని గేమ్స్‌తో పోలిస్తే సబ్‌వే సర్ఫర్స్ గేమ్ అనేది ఎక్కువ డేటాను కలెక్ట్ చేస్తుందని వారు స్టడీలో తేలింది. 9.3 శాతం డేటాను సబ్‌వే సర్ఫర్స్ కలెక్ట్ చేస్తుందని తెలిసింది. ఇందులో లొకేషన్ డేటా కూడా భాగమే. లుడో కింగ్, సబ్‌వే సర్ఫర్స్.. ఈ రెండు గేమ్స్.. డేటాను తీసుకొని మూడో పార్టీకి అందిస్తాయని షాకింగ్ విషయాన్ని ఈ సైబర్ సెక్యూరిటీ కంపెనీ బయటపెట్టింది. ప్రస్తుతం ఇండియాలో దాదాపు 50 ఫేమస్ గేమింగ్ యాప్స్ ఉన్నాయి. అందులో 38 యాప్స్.. వారి యూజర్ల డేటాను థర్డ్ పార్టీలకు అందిస్తుందని తెలిసింది.


లొకేషన్ యాక్సెస్ అనే చాలావరకు యాప్స్‌కు అవసరం లేని విషయం. అయినా కూడా గేమింగ్ యాప్స్ అనేవి లొకేషన్ యాక్సెస్‌ను అడుగుతున్నాయంటే ఎంతో సెన్సిటిక్ సమాచారం బయటికి వెళ్లే అవకాశం ఉందని అర్థమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని బట్టి యూజర్లు ఎక్కడుంటున్నారు, వారి అడ్రస్ ఏంటి, వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, వెళ్లారు.. ఇలాంటి సమాచారం అంతా తెలుసుకోవచ్చు. ఈ సమాచారం అంతా చివరికి ఎక్కడికి, ఎవరి దగ్గరకి వెళ్లి చేరుకుంటుందో ట్రాక్ చేయడం కోసం కష్టమని అన్నారు.

Related News

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

Flipkart : అదిరిపోయే ఆఫర్.. వివో సిరీస్ పై భారీ తగ్గింపు

DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

×