EPAPER
Kirrak Couples Episode 1

New Milkyway : విశ్వంలో మిల్కీవే తరహా గెలాక్సీ!

New Milkyway : విశ్వంలో మిల్కీవే తరహా గెలాక్సీ!
New Milkyway

New Milkyway : అనంత విశ్వంలో మరో నక్షత్ర మండలం బయటపడింది. ఆ గెలాక్సీ అచ్చం మన పాతపుంత(Milky Way)లాగానే ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విశ్వానికి 2 బిలియన్ సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇది ఏర్పడినట్టు భావిస్తున్నారు.


మిల్కీవే సహా సర్పిలాకార గెలాక్సీల్లోని రెండొంతుల వరకు.. ఆ గెలాక్సీల మధ్యన చిన్నచిన్న నక్షత్రాలన్నీ కలసి కమ్మీ(బార్) ఆకారంలో కనిపిస్తాయి. ఇలాంటి బార్ షేప్డ్ స్పైరల్ గెలాక్సీలన్నీ బిగ్ బ్యాంగ్ తర్వాత 4 బిలియన్ సంవత్సరాలకు ఏర్పడటం ఆరంభమై ఉండొచ్చనేది సూత్రీకరణ. తాజా పరిశోధన ఆ వాదనకు సవాల్ విసురుతోంది.

ఆస్ట్రానమర్లు ప్రస్తుతం కనుగొన్న గెలాక్సీ అంతకన్నా పూర్వమే ఏర్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మొత్తం మీద ఆ గెలాక్సీ వయసు 11 బిలియన్ సంవత్సరాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పంపిన కాస్మిక్ ఎవల్యూషన్ ఎర్లీ రిలీజ్ సైన్స్(CEERS) సర్వే వివరాలను విశ్లేషిస్తుండగా కొత్త గెలాక్సీ గురించి వారు తెలుసుకోగలిగారు.


ఈ సర్వేలో భాగంగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సుదూరాన ఉన్న గెలాక్సీల తాలూకు వేలాది చిత్రాలను పంపింది. కొత్త గెలాక్సీని గుర్తించిన వెంటనే దాని ఆకారాన్ని శాస్త్రవేత్తలు తొలుత నిర్థారించలేకపోయారు. హబుల్ టెలిస్కోప్ సమాచారంతో పోల్చి చూసిన అనంతరమే అది బార్‌డ్ స్పైరల్ గెలాక్సీ అని విశ్లేషించగలిగారు.

కొత్త నక్షత్రమండలానికి CEERS-2112గా పేరు పెట్టారు. మన పాలపుంత స్పైరల్ గెలాక్సీ అయినా.. మధ్యభాగంలో అలాంటి బార్(కమ్మీ)నే కలిగి ఉంది. కొత్త స్పైరల్ గెలాక్సీ CEERS-2112 కూడా పాలపుంతలాగానే 11.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండొచ్చని తాజా పరిశోధన స్పష్టం చేస్తోంది. దీంతో బార్‌డ్ గెలాక్సీల ఆవిర్భావం, పెరుగుదలకు సంబంధించిన సిద్ధాంతాలను పునర్నిర్వచించాల్సిన అవసరం కనపడుతోంది.

హబుల్‌తో పోలిస్తే ఆరురెట్లు కాంతిని గ్రహించగలదని, ఫలితంగా అత్యంత దూరంలో ఉన్న గెలాక్సీల రూపురేఖలను మరింత వివరంగా సేకరించలదు. తాజా పరిశోధన నేపథ్యంలో.. మిల్కీవే, విశ్వారంభం తొలినాళ్ల గురించి లోతైన అధ్యయనం చేసే వీలు చిక్కింది. CEERS-2112 లాంటి అతి ప్రాచీన గెలాక్సీల గురించే కాకుండా.. కృష్ణ పదార్థం, విశ్వం రహస్యాల గుట్టు వీడే అవకాశం ఉంది.

Related News

Best Gadgets Under 500 In Flipkart : ఇదేం సేల్ అయ్యా బాబు.. మరీ ఇంత చీపా.. రూ.500లోపే ఎన్ని గాడ్జెట్స్​ కొనొచ్చో!

iphone Fastest Delivery : ఐఫోన్ రాక్… కస్టమర్ షాక్.. జెట్ స్పీడ్ లో డెలివరీ!

Amazon Smart Tv Offers : ఓడియమ్మా ఇదెక్కడి ఆఫర్.. టాప్ బ్రాండ్ స్మార్ట్ టీవీలపై ఏకంగా 65% డిస్కౌంట్..!

How To Check iPhone Is Real Or Fake : ఐఫోన్ కొంటున్నారా? మరి అది ఒరిజినలా? ఫేకా.. అనేది ఇలా కనిపెట్టేయండి

Whatsapp New Features 2024 : వాట్సాప్ ప్రియులకు కిక్ ఇచ్చే అప్డేట్.. కొత్తగా ఈ 3 ఫీచర్స్

Festival Season shopping : డబ్బులు ఊరికే రావ్.. పండుగ సేల్‌లో ఇవి పాటిస్తే మీ డబ్బులు సేఫ్!

Jio Recharge Plan : జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్ – మరో సరికొత్త ​ప్లాన్​ తో వచ్చేసిన టెలికాం దిగ్గజం

Big Stories

×