E-Paper
Advertisement

Asteroids:భూమి దగ్గరకి దూసుకొస్తున్న అయిదు ఆస్ట్రాయిడ్స్..

Asteroids:భూమి దగ్గరకి దూసుకొస్తున్న అయిదు ఆస్ట్రాయిడ్స్..
Advertisement

Asteroids: గత కొన్నేళ్లుగా అంతరిక్షంపై జరిగే పరిశోధనలు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకే స్పేస్‌లో చెత్త కూడా ఎక్కువగా పేరుకుపోయింది. వాటితో పాటు ఆస్ట్రాయిడ్స్ కూడా అంతరిక్షంలో తిరుగుతూ ఉన్నాయి. ఇలా అంతరిక్షంలో జరిగే పరిణామాల వల్ల భూమిపై ప్రభావం పడుతుందని ఆస్ట్రానాట్స్ చెప్తున్నారు. తాజాగా అలాంటి ఒక ఆస్ట్రాయిడ్ నుండే భూమికి భారీ ప్రమాదం జరగనుందని వారు హెచ్చరిస్తున్నారు.

ఆస్ట్రాయిడ్స్ అనేవి భూమిపైన అప్పుడప్పుడూ పడుతూ ఉన్నా కూడా వాటిని మనుషులు ఉన్న ప్రాంతంలో కాకుండా సముద్రాల్లో పడేసే ప్రయత్నం చేస్తుంటారు శాస్త్రవేత్తలు. ఒకవేళ అవి మానవాళి ఉన్న ప్రాంతాల్లో పడితే.. జరిగే నష్టం ఎవరూ ఊహించలేనిదిగా ఉంటుందని ఇదివరకే హెచ్చరించారు. తాజాగా ఆ హెచ్చరిక నిజం కానుందని నాసా అంటోంది. నాసాలోని జెట్ ప్రపోల్షన్ టీమ్ చేసిన తాజా పరిశోధనల్లో దీనికి సంబంధించిన కొన్ని విషయాలు బయటపడ్డాయి.

Advertisement

నాసా తెలిపినదాని ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలోనే దాదాపు అయిదు ఆస్ట్రాయిడ్స్ భూమికి చాలా దగ్గరగా రానున్నాయని తెలుస్తోంది. వీటిలో రెండు ఒకేరోజున దగ్గరగా రానున్నాయన్నది శాస్త్రవేత్తలను సైతం కలవరపెడుతోంది. ఇప్పటికే భూమికి దగ్గరగా వచ్చే ఆస్ట్రాయిడ్స్‌ను ట్రాక్ చేయడానికి నాసా వద్ద టెక్నాలజీ ఉంది. అసలు ఆస్ట్రాయిడ్ ఏ దిశగా ప్రయాణిస్తుంది, దాని పరిణామం ఎంత అనే విషయాలను ఈ టెక్నాలజీ చెప్తుంది. రానున్న ఆస్ట్రాయిడ్స్ వివరాలు కూడా దీని ద్వారానే నాసా బయటపెట్టింది.

45 అడుగుల పరిమాణంలో ఉండే చిన్న ఆస్ట్రాయిడ్.. 2023 FU6 ఇప్పటికే ఏప్రిల్ 3 న భూమికి సమీపంగా వచ్చింది. అదే రోజు 82 అడుగుల ఆస్ట్రాయిడ్ 2023 FS11 కూడా భూమికి దగ్గరగా వచ్చింది. ఇక ఏప్రిల్ 4న 92 అడగుల ఆస్ట్రాయిడ్ 2023 FA7 భూమికి దగ్గరగా వచ్చి వెళ్లింది. ఏప్రిల్ 5న 65 అడుగుల ఆస్ట్రాయిడ్ 2023 FQ7 భూమికి 5,750,000 కిలోమీటర్ల సమీపానికి రానుంది. వెంటనే ఏప్రిల్ 6న కూడా 150 అడుగుల ఆస్ట్రాయిడ్ 2023 FZ3 భూమికి దగ్గరగా రానుంది. ఇక ఈ ఆస్ట్రాయిడ్స్ అన్నీ భూమికి ఎక్కువ హాని కలిగించేవి కావని నాసా ముందస్తు నిర్ధారణకు వచ్చింది.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×