Diwali Mobile Offers : దీపావళి పండగ రోజు చాలా మంది తమ ప్రియమైన వారి కోసం ఏదో ఒక గిఫ్ట్ లేదా స్వీట్లను ఇస్తుంటారు. అయితే గిఫ్ట్‌ల విషయానికొస్తే ఏది ఇవ్వాలా అని కూడా తెగ ఆలోచిస్తుంటారు. మరి మీ ప్రియమైన వారు టెక్ ప్రియులైతే? వారికి ఎంచక్కా టెక్ గ్యాడ్జెట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసేయండి. ఏంటి అంత ఈజీగా చెప్పేశానని అనుకుంటున్నారా? ఎందుకంటే తక్కువ బడ్జెట్లోనే సూపర్ పెర్ఫార్మెన్స్తో పనిచేసే, అదిరిపోయే స్టైలిష్ ఫీచర్స్ ఉన్న ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్‌ను అందిస్తున్నాయి ఇ కామర్స్ ప్లాట్ ఫామ్స్.
పవర్‌ఫుల్ ప్రాసెసర్, వైబ్రంట్ డిస్‌ప్లే, మల్టిపుల్ కెమెరా సెటప్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ఉన్న స్మార్ట ఫోన్లు తక్కువ ధరకే అందిస్తున్నారు. మరి మీరు ఎంచక్కా మీ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్, లేదా పార్ట్నర్కు ఓ మంచి స్మార్ట్ ఫోన్‌ను స్పెషల్ గిఫ్ట్‌గా ఇచ్చేయండి. ఇంతకీ ఏఏ స్మార్ట్ ఫోన్లు తక్కువ బడ్జెట్లో ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
Poco F6 – 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 2400 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, అలాగే కంటి అలసటను తగ్గించడంలో సహాయపడటానికి 1920Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉంటుంది. ఓవరాల్‌గా మెరుగైన వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కోసం Widevine L1, డాల్బీ విజన్, HDR 10+ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ముందు భాగం కార్నింగ్ గొరిల్లా విక్టస్ గ్లాస్‌ను, వెనుక భాగంలో మన్నికైన పాలికార్బోనేట్‌ను అమర్చారు. ఈ స్మార్ట్ ఫోన్ టైటానియం, నలుపు రంగులలో లభిస్తుంది.
పనితీరు విషయానికొస్తే 4nm ప్రక్రియను ఉపయోగించి Poco F6లో స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్‌ను అమర్చారు. గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ అప్లికేషన్‌లను సమర్ధవంతంగా నిర్వహించడానికి Adreno 735 GPUను కలిగి ఉంటుంది. 12GB వరకు LPDDR5x ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ఓరిజినల్ ధర రూ. 33,999. డిస్కౌంట్లో రూ. 23,999 లభిస్తోంది.
Realme GT 6T – ఈ Realme GT 6T 6.78-అంగుళాల LTPO కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 2789 x 1264 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందిస్తుంది. 2500Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉంది. 6000 నిట్‌ల గరిష్ట బ్రైట్నెస్ను అందిస్తుంది. ప్రొటెక్షన్ కోసం డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ను అమర్చారు. డస్ట్ రెసిస్టన్స్ కోసం IP65 రేటింగ్‌ను కలిగి ఉంది. దీని డిస్కౌంట్ ధర రూ. 25,000 కంటే కొంచెం ఎక్కువగా ఉంది. కానీ మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా మరింత తక్కువ ధరకు పొందవచ్చు. ఒరిజినల్ ధర రూ.33,999. డిస్కౌంట్లో రూ.28,522కు పొందవచ్చు.
ALSO READ : గుండె గుబేల్ అనిపించే ఆఫర్.. రూ.799కే టాప్ బ్రాండ్ స్మార్ట్ వాచెస్.. మళ్లీ మళ్లీ కొనలేరంతే!
OnePlus Nord CE 4 5G – ఈ స్మార్ట్ ఫోన్ 6.7-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 2412 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. 210Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్, HDR 10+ కలర్ సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది. మెరుగైన, స్పష్టమైన విజువల్స్ కోసం 10-బిట్ కలర్ డెప్త్‌కు సపోర్ట్ చేస్తుంది. Qualcomm Snapdragon 7 Gen 3 SoCను, Adreno 720 GPUతో జత చేశారు. గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ అప్లికేషన్‌లకు ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ LPDDR4x ర్యామ్, 256 జీబీ UFS 3.1 స్టోరేజ్‌ను సపోర్ట్ చేయగలదు.
కెమెరా విషయానికొస్తే 50MP సోనీ LYT600 ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8MP సోనీ IMX355 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఇచ్చారు. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసేలా 5,500 mAh బ్యాటరీని అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ OS 14లో పని చేస్తుంది. మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు రెండు సంవత్సరాల OS అప్‌డేట్‌లను అందిస్తుంది. దీని ధర రూ.24,999. డిస్కౌంట్లో రూ.22,193కు పొందవచ్చు.
Motorola Edge 50 – ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2712 x 1220 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ను అందించారు. బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కోసం HDR10+ను అమర్చారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 యాక్సిలరేటెడ్ ఎడిషన్‌తో పాటు గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ అప్లికేషన్‌ల హ్యాండిల్ కోసం అడ్రినో 644 GPUను అమర్చారు. 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2ను సపోర్ట్ చేస్తుంది.
ఫ్రంట్ సైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP Sony LYT-700C సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్‌ను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 68W టర్బో ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసేలా 5,000 mAh బ్యాటరీని ఇచ్చారు. IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Motorola My UIతో రన్ అవుతుంది. మూడు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందించడంతో పాటు రెండేళ్ల వరకు అండ్రాయిడ్ అప్డేట్స్ను ఇస్తుంది. దీని ధర రూ. 32,999. డిస్కౌంట్ ప్రైస్ రూ. 26,999.
Infinix GT 20 Pro – ఈ స్మార్ట్ ఫోన్ 6.78-అంగుళాల పూర్తి HD+ LTPS AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 1300 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. MediaTek డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇది మెరుగైన గ్రాఫిక్స్ పనితీరు కోసం Mali G610-MC6 GPUను అమర్చారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ప్రత్యేకమైన గేమింగ్ డిస్‌ప్లే చిప్, పిక్సెల్‌వర్క్స్ X5 టర్బోను కూడా ఇన్స్టాల్ చేశారు. ఇది GPU పనితీరును మరింత పెంచుతుంది. 5,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 45W అడాప్టర్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Infinix యొక్క XOS 14లో నడుస్తోంది, కంపెనీ రెండు సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో పాటు మూడేళ్లు సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తోంది.