EPAPER

Diwali Gifting Ideas : థ్రిల్, ​రిలాక్సేషన్​ కాంబోలో అదిరిపోయే టెక్ గిఫ్ట్స్ ఇవే.. వీటితో మీ ఫేవరెట్ పర్షన్స్ ఫుల్ ఖుషీ!

Diwali Gifting Ideas : థ్రిల్, ​రిలాక్సేషన్​ కాంబోలో అదిరిపోయే టెక్ గిఫ్ట్స్ ఇవే.. వీటితో మీ ఫేవరెట్ పర్షన్స్ ఫుల్ ఖుషీ!

Diwali Gifting Ideas : దీపావళి(Diwali) రాగానే మన సన్నిహితులకు, స్నేహితులకు, మనకు ఇష్టమైన వారికి ఈ సారి ఏం స్పెషల్ గిఫ్ట్(Diwali Special Gifts) ఇవ్వాలా అని అందరం ఆలోచిస్తాం. చాలామంది సంప్రదాయ పద్ధతులను అనుసరించి స్వీట్లు లేదా ఇతర బహుమతులు ఇస్తారు. అయితే ఈ దీపావళికి మీరు మీ ప్రియమైన వారికి కొంచెం కొత్తగా ఆశ్చర్యపరచాలనుకుంటే టెక్​ బహుమతులు(Diwali Tech Gifts) ను కూడా ఇవ్వవచ్చు. కాబట్టి ఈసారి కొత్తదాన్ని ఎందుకు ప్రయత్నించకూడదని భావిస్తే మీ సన్నిహితులకు, ఫ్యామిలీకి థ్రిల్ పంచే, రిలాక్సేషన్ ఇచ్చే టెక్ గిఫ్ట్​లను ఇచ్చేయండి.


Honeywell Trueno U300 Bluetooth Speaker – ఈ పోర్టబుల్ స్పీకర్​ 20 డబ్ల్యూ సౌండ్​ను కలిగి ఉంది. మ్యూజిక్ లవర్స్​ను బెస్ట్ ఛాయిస్. 4,500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దాదాపు 13 గంటల పాటు ఆగకుండా పనిచేస్తుంది. ఫాస్ట్ టైప్ సీ ఛార్జింగ్​ను సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.2,298. ఇంకా ఇందులో 15 మీటర్లకు వరకు కనెక్షన్ ఉండేలా బ్లూటూత్​ V5.3 ఫీచర్ ఉంది. ఇండోర్, ఔట్​డోర్​లో రెండింటిలోనూ ఉపయోగించుకునేలా వాటర్ రెసిస్టెన్స్​ కోసం IPX6ను ఇచ్చారు. ఇంకా స్ట్రీరియో ఎక్స్​పీరియన్స్​ కోసం రెండు స్పీకర్స్​ను కనెక్ట్ చేసేలా టీడబ్ల్యూఎస్​ పెరియింగ్​ ఆప్షన్ కూడా ఉంది.

Spigen 20,000mAh Power Bank – ఇది 30డబ్ల్యూ ఔట్​పుట్​తో వస్తుంది. ఐఫోన్ 14ప్రోను కూడా ఐదు సార్లు ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రీమియమ్ అలయ్​ మెటేరియల్​తో డిజైన్ చేశారు. స్టైలిష్​గా, మన్నికగా ఉంటుంది. ఫోస్ట్ పీపీఎస్​ ఛార్జింగ్​ను సపోర్ట్ చేస్తుంది. గంటలోనే 94 శాతం ఛార్జ్ చేస్తుంది. ఇది రూ.2,348కు అందుబాటులో ఉంది.


ALSO READ : ఎగిరి గెంతేసే రిలయన్స్ జియో ఆఫర్.. కేవలం రూ.699 4G స్మార్ట్ ఫోన్

CrossBeats Nexus ChatGPT-Powered Smartwatch – ఈ స్మార్ట్ వాచ్​ గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి. 2.01 అమోలెడ్​ డిస్​ ప్లేతోను కలిగి ఉంది. అలానే చాట్​జీపీటీ, స్మూత్ నోటిఫికేషన్స్​ కోసం అడ్వాన్స్​డ్​ డైనమిక్ ఐలాండ్ ఫీచర్​తో వాయిస్ రికజ్ఞిషన్​ సదుపాయం కూడా ఉంది. ఇందులో 100 స్పోర్ట్స్ మోడ్స్​, జీపీఎస్ నావిగేషన్, బీపీ, స్లీప్​ వంటి హెల్త్ ట్రాకింగ్​ ఫీచర్స్ ఉన్నాయి. 6 రోజుల బ్యాటరీ లైఫ్​తో పాటు బ్లూటూట్ కాలింగ్​ వంటివి ఉన్నాయి. దీనిని రూ.3,599కు కొనుగోలు చేయొచ్చు.

Frontech Dragon Warrior Gaming Combo – మీ ఫ్యామిలీలో లేదా ఫ్రెండ్స్​లో గేమింగ్ లవర్స్ ఉన్నారా? అయితే ఇది వారికి బాగా ఉపయోగపడుతుంది. దీని ధర రూ.1,451. ఈ కాంబో గేమర్స్​కు చెస్ట్ ఛాయిస్. ఇందులో ఆర్​జీబీ ఎల్​ఈడీ కీబోర్డ్​, 1000-డీపీఐ గేమింగ్ మోస్​, డ్యూరబుల్ మౌస్​ప్యాడ్​ ఉంటాయి. అలానే క్లియర్​ ఆడియో, బెస్ట్ గేమింగ్ ఎక్స్​పీరియన్స్ కోసం 40ఎమ్​ఎమ్​ డ్రైవర్​ యూనిట్ కలిగిన హెడ్​సెట్​ కూడా ఉంటుంది.

Welko Drone With 4K Camera – ఈ మధ్య కాలంలో డ్రోన్​ కెమెరాలకు ఆదరణ బాగా పెరిగింది. సందర్భం ఏదైనా స్పష్టమైన విజువల్స్​, స్టన్నింగ్​ ఏరియల్ వ్యూ ఎక్స్​పీరియన్స్​ కోసం దీన్ని బాగా వినియోగిస్తున్నారు. పైగా దీపావళి వస్తుంది. కాబట్టి డ్రోన్ కెమెరాను కొనుగోలు చేసి బెస్ట్​ విజువల్స్​ను క్యాప్చర్స్​ చేయొచ్చు. ఈ వెల్కో డ్రోన్ 4కే అడ్జస్టబుల్​ కెమెరాతో బెస్ట్ ఏరియల్ షాట్స్​ను క్యాప్చర్ చేస్తుంది. ఇందులో గెస్టర్ కంట్రోల్​, 360 ఫ్లిప్​ కూడా ఉన్నాయి. దీన్ని సులభంగా క్యారీ చేయొచ్చు. ట్రెవెల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దీని బరువు కేవలం 188 గ్రాములే. 25 నిమిషాల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఇది రూ.3,999కు అందుబాటులో ఉంటుంది.వ

Related News

Diwali Mobiles Gifts : ఓడియమ్మా.. ఏం ఆఫర్స్ బాసూ.. బడ్జెట్లోనే దొరికే ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!

Netflix’s Moments Feature : దిమ్మతిరిగే ఫీచర్ తీసుకొచ్చిన నెట్​ఫ్లిక్స్ – ఇకపై వాటి షేరింగ్ డబుల్ ఈజీ

Instagram : ఇన్టాగ్రామ్ సేవలు ఆగిపోయాయా.. అసలు ఏమైంది?

Digital Condom App: ‘డిజిటల్ కండోమ్’.. భయం లేని ఏకాంతం కోసం సరికొత్త యాప్!

OPPO A3x 4G, OPPO Find X8 : ఒప్పో A3x 4G, ఒప్పో Find X8లో బెస్ట్ మెుబైల్ ఏదంటే!

BSNL 4G : బీఎస్ఎన్ఎల్ 4G స్లోగా ఉందా.. ఈ సెట్టింగ్స్ తో చిటికెలో హై స్పీడ్ గా మర్చేయండి

Apple Intelligence : మీ గ్యాడ్జెట్లో ఆపిల్ ఇంటెలిజెన్స్ వర్క్ అవుట్ అవుతుందా! చెక్ చేసేయండిలా

×