EPAPER

Data Recharge : డేటా త్వరగా అయిపోతుందా? – ఇలా చేస్తే తక్కువ రిచార్జ్​ ప్లాన్​కే ఫుల్ డేటా!

Data Recharge : డేటా త్వరగా అయిపోతుందా? – ఇలా చేస్తే తక్కువ రిచార్జ్​ ప్లాన్​కే ఫుల్ డేటా!

Data Recharge : ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. చిన్న పిల్లలు అన్నం తిన్నాలంటే, గేమ్స్​ ఆడాలంటే మొదలు పెద్దవారికి, యువతకు వృత్తి పరంగా లేదా ఇతర వ్యక్తిగత అవసరాలకు స్మార్ట్ ఫోన్​ ఉండాల్సిందే. అయితే ఈ స్మార్ట్​ ఫోన్ ఉంటే సరిపోదు దానికి తోడు కచ్చితంగా డేటా ఉండాల్సిందే. అప్పుడు మనకు కావాల్సిన సమచారం లేదా ఇతర ఇంకేమైనా అందులో దొరుకుతుంది. అందుకే ఫోన్​లో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. పైగా ప్రారంభ దశలో డేటా ఛార్జీలు తక్కువగా ఉండటం, ఆ తర్వాత అందుబాటు ధరలో ఉండటం వల్ల కూడా డేటా వినియోగం బాగా పెరిగిపోయింది.


కానీ ఇప్పుడు ప్రముఖ టెలికాం సంస్థలు తమ తెలివితేటలతో రీఛార్జ్ ప్లాన్ ధరల్ని భారీగా పెంచేసి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే డేటా వినియోగం తప్పనిసరి అయిపోయింది. ఏం చేయలేక పెంచిన ధరలకే డేటా రిచార్జ్​లు చేసుకుంటూ ఇంటర్నెట్ సేవలను ఉపయోగిస్తున్నారు.

అయితే చాలా మందికి ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఫోన్​లో రోజువారి డేటా కూడా త్వరగా అయిపోతుంది. దీంతో అదనపు డేటా కోసం రీఛ్చార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్‌లో డేటా తొందరగా అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో మీ ముందుకుకు వివరాలను తీసుకొచ్చాం.


ముందుగా రీఛార్జ్ చేసుకునేటప్పుడే డేటా అవసరాలను బట్టి ప్లాన్​ను సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే ధర తక్కువ ఉండే ప్లాన్ ఎంచుకుంటే ఆ తర్వాత అదనపు డేటా ప్యాక్​లు కొనాల్సి వస్తుంది. డబ్బులు అదనంగా ఖర్చు అవుతాయి.

ప్లే స్టోర్​ యాప్స్ ఆటో అప్డేట్​ డిసెబుల్ లేదా ఓన్లీ వైఫైలోనే ఉంచాలి. అలా చేయకపోతే యాప్స్ మొబైల్ డేటాను ఉపయోగించుకుని అప్డేట్ అయిపోతాయి. దీంతో అవసరమైన సమయంలో డేటా కొరత ఏర్పడుతుంది.

ALSO READ : 10వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే!

వైఫై సదుపాయం ఉంటే డేటా ఆఫ్ చేసుకుని దానికి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మొబైల్ డేటా ఆదా అవుతుంది. ఏవైనా అప్డేట్స్, డౌన్ లోడ్స్ ఉన్నా వైఫైలోనే చేసుకోవాలి. అయితే, వైఫై కనెక్ట్ ముందు సురక్షితమో కాదో కచ్చితంగా చెక్ చేసుకోవాలి. లేదంటే మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అవ్వొచ్చు.

అనవసరమైన యాప్స్ అ న్ఇన్స్టాల్ చేయడం మంచిది. తాత్కాలిక అవసరాల కోసం ఇన్​స్టాల్​ చేసుకున్న యాప్స్, బ్యాక్ గ్రౌండ్ డేటా యూసేజ్​ను రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. దీంతో ఆయా యాప్స్ బ్యాక్ గ్రౌండ్​లో డేటా వినియోగించడం ఆగిపోతుంది.

హైక్వాలిటీ ఫొటోలు, వీడియోలు కూడా ఎక్కువ డేటాను యూసేజ్ చేస్తాయి. ఆన్లైన్ స్ట్రీమింగ్ అయినా, డౌన్లోడ్ అయినా క్వాలిటీని ఆటోమోడ్​లో పెట్టుకోకుండా తక్కువ క్వాలిటీలో పెట్టుకోవాలి. అప్పుడు కూడా డేటాను ఆదా చేయొచ్చు.

కొన్ని బ్రౌజర్లు, యాప్స్​కు డేటా సేవింగ్ ఫీచర్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడు బ్రౌజింగ్​ వెబ్​ పేజీలు, ఇమేజ్, వీడియో సైజును కంప్రెస్ చేసి చూపిస్తుంది. దీంతో ఎక్కువ డేటా ఖర్చవదు.

యాప్స్ అడిగే పర్మిషన్స్​ను చెక్​ చేసుకుని అవసరం లేని వాటిని రిజెక్ట్ చేయాలి. అవసరం లేని వాటికి కూడా పుష్ నోటిఫికేషన్స్ కూడా ఆఫ్ చేసుకోవాలి. వీటన్నిటినీ సెట్టింగ్స్​లోని యాప్స్ సెక్షన్​లో మార్పులు చేసుకోవాలి.

చివరిగా ఎప్పటికప్పుడు మీ డేటా వినియోగాన్ని సమీక్షించుకోవాలి. ఏ యాప్​ ద్వారా ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసుకోవాలి. అప్పుడు వాటిని ఆప్టిమైజ్ చేసుకోవడం ద్వారా డేటా ఆదా అవుతుంది.

Related News

Samsung Galaxy F05 : సూపర్ సేల్ బాస్.. రూ. 6,499కే అదిరిపోయే స్మార్ట్ ఫోన్

Rajmargyatra : హైవేపై లాంగ్ జర్నీ చేస్తున్నారా? – ఇది మీతో ఉంటే ఫుల్ సేప్​!

Best Smart Phones Under 10,000 : 10వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే!

Sunita Williams in Space: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, ఎక్కువ కాలం స్పేస్ లో ఉన్న ఆ జీవులకు ఏమైందో తెలుసా?

Phone Battery : స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పాడైందని ఇలా కనిపెట్టేయండి..

Mobile Addiction : మొబైల్​కు బానిసలయ్యారా? – ఇలా చేస్తే ఇట్టే బయటపడొచ్చు!

Big Stories

×