EPAPER

CMF Phone 1: లాంచ్‌కు సిద్ధమైన CMF.. సోమవారమే లాంచ్.. ఎన్ని రంగులు మారుస్తుందో!

CMF Phone 1: లాంచ్‌కు సిద్ధమైన CMF.. సోమవారమే లాంచ్.. ఎన్ని రంగులు మారుస్తుందో!

CMF Phone 1: నథింగ్ టెక్ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చాకా ఎక్సెస్‌‌ఫుల్‌గా ఎదిగింది. దీంతో కంపెనీ దాని సబ్ బ్రాండ్ సీఎంఎఫ్‌ను పరిచయం చేసింది. ఇప్పుడ సీఎంఎఫ్ తన బ్రాండ్ నుంచి మొదటి స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. అదే సీఎంఎఫ్ ఫోన్ 1. ఈ ఫోన్ దేశంలో జులై 8వ తేదీన లాంచ్ కానుంది. మీరు దీన్ని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే దాని ధర తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే మీకో శుభవార్త ఉంది. ఎందుకంటే లాంచ్‌కు ముందే ఫోన్ ధరను వెల్లడించారు. గత కొన్ని రోజులుగా కంపెనీ తన ప్రత్యేక స్పెసిఫికేషన్లను వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ బ్యానర్ లైవ్ అవుతుంది.


ఈ సీఎంఎఫ్ ఫోన్ 1 ధర విషయానికి వస్తే భారతదేశంలో CMF ఫోన్ 1 ధర రూ. 17,999గా ఉంటుంది. కానీ దీనిపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ అందిస్తోంది. దీని తర్వాత ఫోన్ రూ.14,999కి అందుబాటులో ఉంటుంది. తగ్గింపు ధరలతో పాటు. ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తున్నారు. జూలై 12 నుంచి సేల్ ప్రారంభం కానుంది.

Also Read:  ప్రపంచంలో వీటిని కొట్టేవి లేవు.. వేరే లెవల్ కెమెరా ఫోన్స్.. బడ్జెట్ ప్రైస్‌లోనే!


అయితే ఈ డిస్కౌంట్లు అందించడం మొదటి సారేమి కాదు. నథింగ్ ఫోన్ 2(a)పై కూడా సేల్ సమయంలో ఆఫర్లు తీసుకొచ్చారు. దీన్ని ధర రూ. 19,999. CMF ఫోన్ 1 మొదటి సేల్ జూలై 12 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుందని తెలుస్తోంది.  CMF ఫోన్ 1లో డైమెన్షన్ 7300 ప్రాసెసర్, 5,000 mAh బ్యాటరీ. డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ (50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్) కలిగి ఉంటుంది.

CMF ఫోన్ 1లో మీరు వెనుక ప్యానెల్‌ని తీసివేసి, కొత్త ప్యానెల్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు. CMF ఫోన్ 1 బ్లాక్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ కలర్స్ బ్యాక్ ప్యానెల్‌లతో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. వెనుక ప్యానెల్ కూడా లాన్యార్డ్స్ వంటి టూల్స్ అటాచ్ చేయడానికి డయల్ లాంటి డిజైన్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 2000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ AMOLED డిస్‌ప్లే పొందతుంది.

Also Read: ఆకర్షణీయమైన డీల్‌.. వివో 5జీ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్..!

లీక్ అయిన ధరను చూస్తేలాంచ్ అయిన తర్వాత, CMF ఫోన్ 1 దాని పోటీదారులకు గట్టి పోటీని ఇస్తుందని అర్థం చేసుకోవచ్చు. అదనపు బ్యాక్ కవర్‌లు, అటాచ్‌మెంట్‌లు విడిగా విక్రయించబడే అవకాశం కూడా కంపెనీకి ధరను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫోన్ రోజు కొత్తగా కనిపించాలనే ఆసక్తి ఉన్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.

Related News

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

Flipkart : అదిరిపోయే ఆఫర్.. వివో సిరీస్ పై భారీ తగ్గింపు

DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

×