EPAPER

CMF Phone 1 Sales Record: CMF రికార్డ్ సేల్స్.. క్షణాల్లో అవుట్ ఆఫ్ ది స్టాక్.. మళ్లీ సేల్ ఎప్పుడంటే?

CMF Phone 1 Sales Record: CMF రికార్డ్ సేల్స్.. క్షణాల్లో అవుట్ ఆఫ్ ది స్టాక్.. మళ్లీ సేల్ ఎప్పుడంటే?

CMF Phone 1: నథింగ్ తన సబ్ బ్రాండ్ CMF ఫోన్ 1ని ఇటీవలే విడుదల చేసింది. అయితే ఫోన్ లాంచ్ అవకముందు దీని సేల్స్‌పై టెక్ వర్గాల్లో అనేక అనుమానాలు వెల్లడయ్యాయి. కానీ ఎవరి ఊహలకి అందనట్లుగా సీఎమ్ఎఫ్ ఫోన్ 1 సేల్స్‌లో రికార్డులు బ్రేక్ చేసింది. ఫోన్ వచ్చిన కొద్ది నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ ది స్టాక్ అంటూ దర్శనమిచ్చింది. మొదటి సేల్ ఈవెంట్‌లో కేవలం 3 గంటల్లోనే 100,000 ఫోన్‌లు అమ్ముడయ్యాయి. రేపు ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ రీస్టాక్ చేయబడుతుందని బ్రాండ్ ప్రకటించింది. CMF ఫోన్ జూలై 19 అర్ధరాత్రి 12 గంటలకు తిరిగి సేల్‌కు రానుంది.


CMF ఫోన్ 1 రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. అందులో 6GB + 128GB, 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ.15,999, రూ.17,999కి అందుబాటులో ఉన్నాయి. కానీ బ్రాండ్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. దీని వల్ల ఫోన్ ధర రూ.14,999కి తగ్గుతుంది.

Also Read: Amazon Top 10 Smartphone Offers: అమోజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 10 ఫోన్లపై బిగ్ డిస్కౌంట్స్..!


CMF ఫోన్ 1 అనేది స్క్రూ డ్రైవర్‌తో తెరవగలిగే మొదటి ఫోన్. అలానే ఇది స్టాండ్‌ను కూడా కలిగి ఉంటుంది. CMF ఫోన్ 1 6.7-అంగుళాల పూర్తి HD+ LTPS AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. దీనికి 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉంటుంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తోంది. ఇది వాటర్,డస్ట్ నుంచి ప్రొటక్ట్ చేయడానికి, IP52 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ఫ్రింట్ స్కానర్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G హ్యాండ్‌సెట్‌లో ఉపయోగించారు.

CMF ఫోన్ 1కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఇది Sony 50 MP ప్రైమరీ సెన్సార్ కెమెరాను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో 16 MP కెమెరా సెన్సార్ అందించారు. స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.

Also Read: Amazon Prime Day Sale Laptops: ప్రైమ్ డే సేల్.. కొత్త ల్యాప్‌టాప్‌లు.. ఫీచర్లు ఇవే!

నథింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ 2.5 Android 14 ఆధారంగా రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లు 2 సంవత్సరాలు, సెక్యురిటీ  ప్యాచ్‌లు 3 సంవత్సరాల వరకు అందిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్‌ను 2 TB వరకు పెంచవచ్చు. రూ. 1,000 బ్యాంక్ ఆఫర్‌తో ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ నుండి మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×