EPAPER

Lunar Space Station: చంద్రుడిని కబ్జా చేయనున్న చైనా.. ఏకంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు, మెల్ల మెల్లగా భూమిలా మార్చేస్తారట!

Lunar Space Station: చంద్రుడిని కబ్జా చేయనున్న చైనా.. ఏకంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు, మెల్ల మెల్లగా భూమిలా మార్చేస్తారట!

China To Build Lunar Space Station: అంతరిక్షపరిశోధనలను మరింత స్పీడప్ చేయాలని చైనా భావిస్తోంది. అమెరికా, రష్యాతో పోల్చితే స్పేస్ రీసెర్చ్ లో కాస్త వెనుబడి ఉన్న డ్రాగన్ కంట్రీ,  ప్రపంచ దేశాలకు దీటుగా ముందుకెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగానే చైనా స్పేస్ ఏజెన్సీలు తాజా సమావేశమై కీలక ప్రకటన చేశాయి. వచ్చే మూడు దశాబ్దాలకు సంబంధించి రోడ్ మ్యాప్ అనౌన్స్ చేశాయి. ఈ సమయంలో సుమారు 20కి పైగా మిషన్లు చేపట్టనున్నట్లు తెలిపాయి. వాటిలో లూనార్ రీస‌ర్చ్‌ స్పేస్ స్టేష‌న్‌ ను నిర్మించడంతో పాటు, మానవ సహిత లూనార్ మిషన్ చేపట్టాలని నిర్ణయించాయి. విశ్వంలో మానవ నివాస‌యోగ్య‌మైన గ్ర‌హాన్వేష‌ణ మొదలుపెట్టడంతో పాటు భూగోళానికి బయట ఉన్న జీవులను కనిపెట్టాలని యోచిస్తున్నాయి. చైనా స్పేస్ ఏజెన్సీలు అన్నీ కలిసి 2024 నుంచి 2050 వరకు చేపట్టే అంతరిక్ష పరిశోధనలకు చెందిన వివరాలను వెల్లడించాయి. చైనా అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్‌, చైనా నేష‌న‌ల్ స్పేస్ అడ్మినిస్ట్రేష‌న్‌, చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ తమ భవిష్యత్  ప్లాన్స్  ప్రకటించాయి.


2028 నుంచి లూనార్ స్పేస్ స్టేషన్ నిర్మాణం

రాబోయే మూడు దశాబ్దాల్లో కీలక ప్రాజెక్టులను చేపట్టాలని చైనా ప్రయత్నిస్తోంది. 2050 వరకు 22 స్పేస్ మిషన్లు చేపట్టనున్నట్లు తెలిపింది. వీటిలో 5 అత్యంత కీలకమైన ప్రాజెక్టులు కాగా, మిగతావి ఇతర ప్రాజెక్టులు. అత్యంత  ముఖ్యమైన పరిశోధనల్లో మానవ సహిత లూనార్ మిషన్ ఒకటి. 2027 వరకు ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు చైనా తెలిపింది. రెండోవది లూనార్ స్పేస్ స్టేషన్ నిర్మాణం. 2028 నుంచి లూనార్ స్పేస్ స్టేషన్ నిర్మాణం మొదలుకానుంది.  2035 వరకు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. మూడో ప్రాధాన్యత ప్రాజెక్టులో భాగంగా విశ్వంలో మానవ నివాసయోగ్యమైన గ్రహాలను కనుగొనే ప్రయత్నం చేయనుంది. గ్రహాంతరాలలో ఎక్కడైనా జీవరాశి ఉందేమోనని తెలుసుకునేందుకు పరిశోధనలు చేయనుంది. ఆ తర్వాత విశ్వం థీమ్ మీద పరిశోధన జరపనున్నట్లు తెలిపింది. విశ్వానికి మూలం, పరిణామంపై దృష్టి పెట్టనుంది. అనంతరం సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి మీద పరిశోధన నిర్వహించనున్నట్లు తెలిపింది. భూమి, చంద్రుడిపై సమగ్ర పరిశోధనలు జరపనున్నట్లు తెలిపింది. అంతరిక్ష వాతావరణం, హీలియోస్పియర్ అణ్వేషణ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.


ఇతర మిషన్లకూ ప్రాధాన్యత

2050 వరకు ప్రకటించిన రోడ్ మ్యాప్ పరిశోధనలు కొనసాగిస్తూనే దేశ అవసరాలకు సంబంధించిన ఇతర మిషన్లను చేపట్టే అవకాశం ఉన్నట్లు చైనా స్పేస్ ఏజెన్సీలు తెలిపాయి. తాజా రోడ్ మ్యాప్ ద్వారా ఖగోళానికి సంబంధించిన బోలెడు రహస్యాలను తెలిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.  ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న చైనా ఇప్పుడు మరిన్ని పరిశోధనలు చేపట్టనుంది. చైనా స్పేస్ ఏజెన్సీల తాజా ప్రకటనపై ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. చైనా వీలైనంత వరకు తమ ప్రాజెక్టుల గురించి బయటకు చెప్పదని, అందుకు భిన్నంగా ఏకంగా మూడు దశాబ్దాల రోడ్ మ్యాప్ ప్రకటించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

Read Also: అంతరిక్ష హోటల్ లో ఎంజాయ్ చేద్దాం పదండి, వచ్చే ఏడాదే ప్రారంభం!

Related News

Honor X60 : కిర్రాక్ కెమెరా ఫీచర్స్ తో Honor మెుబైల్ లాంఛ్.. ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువోచ్

Vivo Y19s Mobile: వివో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే !

Indian Mobile Number : భారత్​లో ఫోన్ నెంబర్లకు +91 కోడ్ ఇచ్చింది అందుకే – ఈ విషయాలు మీకు తెలుసా?

Top IT Companies : యాపిల్, గూగుల్​ టు ఫేస్​బుక్​, ఇన్​స్టా – ఈ 8 బడా సంస్థల అసలు పేర్లు తెలుసా?

Readmi Note 13 5G : 108MP కెమెరా, 5000mAh బ్యాటరీ – ఓరి బాబాయ్​.. రూ.14 వేలకే బ్రాండెడ్​​ స్మార్ట్ ఫోన్​

Redmi A4 5G : రెడ్ మీ అరాచకం.. స్నాప్ డ్రాగన్ 4s జెన్‌ 2 ప్రాసెసర్‌ మెుబైల్ మరీ అంత చీపా!

Big Stories

×