EPAPER
Kirrak Couples Episode 1

China : కమర్షియల్ స్పేస్ సెక్టార్‌పై చైనా ఫోకస్..

China : కమర్షియల్ స్పేస్ సెక్టార్‌పై చైనా ఫోకస్..

China : ఈరోజుల్లో దేశంలోని ప్రతీ రంగాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ సహకారంతో పాటు ప్రైవేట్ సంస్థల సహకారం కూడా ఎంతో ముఖ్యంగా మారింది. రెండు కలిసి ముందుకెళ్తేనే ఒక రంగం అభివద్ధి చెందడానికి సహాయపడుతుంది. అందుకే కొన్ని ప్రభుత్వ సంస్థలు సైతం వెనక్కి తప్పుకొని ప్రైవేట్ సంస్థలకు ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ప్రస్తుతం చైనాలోని స్పేస్ సెక్టార్ కూడా అదే పనిలో ఉంది. శాస్త్రవేత్తలు తయారు చేసిన రాకెట్ ఇంజెన్లను కమర్షియల్ స్పేస్ సంస్థలకు ఇచ్చి సహాయపడుతోంది చైనా ప్రభుత్వం.


చైనాలోని ప్రభుత్వ స్పేస్ సెక్టార్ మాత్రమే కాదు.. ప్రైవేట్ స్పేస్ సెక్టార్ కూడా అభివద్ధి చెందాలని శాస్త్రవేత్తలు ఒక నిర్ణయానికి వచ్చారు. మళ్లీ మళ్లీ ఉపయోగించగలిగే రాకెట్ ఇంజెన్లను మార్కెటింగ్ నిమిత్తం కమర్షియల్ స్పేస్ సంస్థలకు ట్రాన్స్‌ఫర్ చేస్తోంది. ఇప్పటికే వైఎఫ్ 102 కిరోసిన్ లిక్విడ్ ఆక్సిజన్ గ్యాస్ జెనరేటర్ ఇంజెన్, వైఎఫ్ 102వీ, వైఎఫ్ 209 ఇంజెన్లు కమర్షియల్ స్పేస్ సెక్టార్‌కు పయణమయ్యాయి. మిథేన్ లిక్విడ్ ఆక్సిజన్‌తో పనిచేసే వైఎఫ్ 209 ఇంజెన్ ఇంకా ప్రయోగాల దశలోనే ఉందని సమాచారం.

వైఎఫ్ 102 ఇంజెన్లు విమానాలలో కూడా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతే కాకుండా ఇప్పటికే మూడు వైఎఫ్ 102 ఇంజనీర్లు టియాన్లాంగ్ 2 అనే రాకెట్ డెవలప్‌మెంట్‌లో ఉపయోగపడ్డాయని వారు బయటపెట్టారు. ఇది చైనా కమర్షియల్ స్పేస్ సెక్టార్ నుండి ఆర్బిట్‌లోకి సక్సెస్‌ఫుల్‌గా ఎగిరిన మొదటి స్పేస్ ఫ్లైట్‌గా తెలుస్తోంది. చైనా ముఖ్య స్పేస్ కాంట్రాక్టర్ అయిన ఏఏఎల్పీటీ.. ఈ ఇంజెన్లు తక్కువ ఖర్చుతో పనిచేస్తాయని, మాస్ ప్రొడక్షన్స్‌కు ఉపయోగపడతాయని తెలిపింది.


ఈ ఇంజెన్లు తయారు చేయడం చాలా సింపుల్ అని ఏఏఎల్పీటీ అంటోంది. ఇందులో ఉపయోగించే కాంపొనెంట్స్ చాలా చిన్నగా ఉంటాయని, 3డీ టెక్నాలజీని కూడా ఇందులో ఉపయోగిస్తారని చెప్పింది. అందుకే ఈ ఇంజెన్ల తయారీ చైనా భవిష్యత్తునే మార్చేస్తుందని భావిస్తోంది. రాకెట్ల ఇంజెన్ల తయారీని వేగవంతం చేయడంతో పాటు ప్రతీ సంవత్సరం చైనా నుండి దాదాపు 60 లాంచ్‌లు జరగాలని, 200కు పైగా స్పేస్‌క్రాఫ్ట్స్ గాలిలోని ఎగరాలని అనుకుంటున్నట్టు చైనా స్పేస్ సంస్థ కాస్క్ ప్రకటించింది.

కమర్షియల్ సంస్థలను కూడా కాస్క్‌లో భాగం చేసుకుంటే వారు అనుకున్న సంఖ్యలో లాంచ్‌లు సాధ్యమవుతాయని కాస్క్ శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. శాటిలైట్ ప్రొడక్షన్‌లో వారి కోరికలు నిజమవుతాయని భావిస్తున్నారు. అంతే కాకుండా 2022లో చేసిన లాంచ్‌లో కంటే 2023లో మరిన్ని ఎక్కువ లాంచ్‌లు చేయాలని చైనా కమర్షియల్ స్పేస్ సెక్టార్ అనుకుంటోంది. ఈ ఏడాదిలో ఎలాగైనా 20 లాంచ్‌లు చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి చైనాలోని ప్రభుత్వ స్పేస్ సెక్టార్‌తో పాటు కమర్షియల్ స్పేస్ సెక్టార్ కూడా చేతులు కలిపి ఎవరూ అందుకోనంత అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తున్నారని నిపుణులు అంటున్నారు.

Related News

iphone demand in india : ఐఫోన్లకు భారీగా పెరిగిన గిరాకీ – డైమండ్స్​ను అధిగమించిన స్మార్ట్‌ ఫోన్ల విలువ!

Washing Machine Offers : వాషింగ్​ మెషీన్ కొనే ప్లాన్​లో ఉన్నారా? – అమెజాన్​లో ఈ మెషీన్లు ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ!

Amazon Smart Watch Sale : సూపర్ డీల్ బాస్.. ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడూ కొనలేరు.. స్మార్ట్ వాచెస్ పై అదిరిపోయే ఆఫర్స్!

Lava Agni 3 : స్పెషల్ ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ లాంఛ్… ప్రోసెసర్, కెమెరా ఫీచర్స్ అదుర్స్ గురూ!

Best Laptop Under 50000 : సేలా మజాకా.. హై క్వాలిటీ ల్యాప్ టాప్స్ పై మరీ ఇంత తగ్గింపా!

Whatsapp Updates 2024: వాట్సాప్ లో ఈ అప్డేట్స్ తెలుసా.. నెంబర్ సేవ్ చేయకుండానే సందేశాలు పంపేయండిలా!

Redmi Watch 5 Active Review : వాచ్ ఏంటి భయ్యా ఇంత ఉంది.. ఫీచర్స్ మాత్రం అదుర్స్.. రేట్ ఎంత అంటే?

Big Stories

×