EPAPER

Chicken Feather: కోడి ఈకల నుంచి కరెంట్.. ఉత్పత్తి ఇలా..!

Chicken Feather: కోడి ఈకల నుంచి కరెంట్.. ఉత్పత్తి ఇలా..!

Chicken Feather: కోడి ఈకే కదా అని హీనంగా చూడొద్దు. ఎందుకూ పనికి రానివని మనం భావించే ఆ ఈకల నుంచి కాలుష్య రహిత విద్యుత్తును తయారు చేయొచ్చు. జ్యూరిచ్‌లోని ఈటీహెచ్, సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ(ఎన్‌టీయూ) పరిశోధకులు ఈకలనూ లాభసాటిగా మార్చి విద్యుత్తు తయారు చేసే కొత్త ప్రక్రియను ఆవిష్కరించారు.


పౌల్ట్రీ సహా ఆహార రంగం మొత్తం భారీ మొత్తంలో వ్యర్థాలు, ఉప ఉత్పత్తులకు కారణమవుతోంది. కోళ్ల పరిశ్రమ వల్ల ఏటా ఉత్పత్తయ్యే ఈకలు 40 మిలియన్ టన్నులని అంచనా. వీటిని కాల్చి పడేస్తుండటంతో బూడిద వ్యర్థంగా మారుతోంది. ఫలితంగా కార్బన్-డై-ఆక్సైడ్‌తో పాటు విషపు వాయువైన సల్ఫర్-డై-ఆక్సైడ్ భారీ మొత్తంలో విడుదలవుతోంది.

ఎందుకూ పనికి రాని ఆ ఈకలకే ఈటీహెచ్, ఎన్‌టీయూ పరిశోధకులు అదనపు విలువను జోడిస్తున్నారు. సులువైన, పర్యావరణహిత విధానంలో వాటిని వినియోగించుకునే ప్రక్రియను కనుగొన్నారు. ఇందులో భాగంగా కోడి ఈకల నుంచి కెరటిన్ అనే ప్రొటీన్‌ను వెలికితీశారు. దానిని అమలాయిడ్ ఫైబ్రిల్స్ అనే అతి శ్రేష్ఠమైన ఫైబర్‌గా మార్చారు. ఆ కెరటిన్ ఫైబ్రిల్స్‌నే ఫ్యూయల్ సెల్ మెంబ్రేన్‌గా వినియోగించి విద్యుత్తును తయారు చేయొచ్చనేది ఈటీహెచ్-ఎన్‌టీయూ పరిశోధన సారాంశం.


హైడ్రోజెన్, ఆక్సిజెన్‌ను వినియోగించుకుని ఫ్యూయల్ సెల్స్ కాలుష్యరహిత విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఉష్ణంతో పాటు నీరు మాత్రమే విడుదలవుతాయి. భవిష్యత్తులో సుస్థిర ఇంధనోత్పత్తిలో ఈ పరిశోధన కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూయల్ సెల్‌కు సెమీపర్మియబుల్ మెంబ్రేన్ అనేది గుండెకాయలాంటిది. ఈ పొర ఎలక్ట్రాన్లను అడ్డుకుని ప్రోటాన్లు మాత్రమే ప్రవహించేలా చేస్తుంది. వెలుపల ఉన్న సర్క్యూట్‌లో రుణాత్మకంగా చార్జ్ అయిన యానోడ్ నుంచి ధనాత్మక కాథోడ్‌కు ప్రసరించేలా చేస్తుంది. దాంతో కరెంట్ ఉత్పత్తి అవుతుంది.

సంప్రదాయ ఫ్యూయల్ సెల్స్‌లో ఈ మెంబ్రేన్లు అత్యంత విషపూరితమైన రసాయనాలతో తయారవుతాయి. ఇందుకు అయ్యే ఖర్చు కూడా ఎక్కువే. పైపెచ్చు.. ఆ రసాయనాలను విచ్ఛిన్నం చేయడం కూడా కష్టమే. ఈటీహెచ్-ఎన్‌టీయూ రిసెర్చర్లు అభివృద్ధి చేసిన మెంబ్రేన్‌లో జీవసంబంధ కెరటిన్ మాత్రమే ఉంటుంది.

అందుకే ఇది పర్యావరణహితమే కాకుండా పెద్ద పెద్ద మొత్తాల్లో లభ్యమవుతుంది. కోళ్ల ఈకల్లో 90% కెరటిన్ ప్రొటీనే ఉంటుంది. దీని ద్వారా లాబొరేటరీల్లో తయారు చేసే మెంబ్రేన్ చాలా చౌక అనే చెప్పొచ్చు. సంప్రదాయ మెంబ్రేన్లకయ్యే వ్యయంలో మూడోవంతుకే బయోలాజికల్ మెంబ్రేన్లు లభ్యం కాగలవు.

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×