EPAPER

Mobiles Hacked : మీ ఫోన్ హ్యాకైందా..? ఇలా తెలుసుకోండి..

Mobiles Hacked : మీ ఫోన్ హ్యాకైందా..? ఇలా తెలుసుకోండి..
Mobiles Hacked

Mobiles Hacked : నేటి ప్రపంచంలో మనిషికి కూడు, గుడ్డ, నీరు అనే మూడు అవసరాలతోపాటు.. ప్రస్తుతం ఫోన్ నాలుగో అవసరంగా మారిపోయింది. జేబులో పర్సు లేకున్నా.. చేతిలో మాత్రం ఫోన్ ఉండాల్సిన పరిస్థితి. దానిలోనే.. వ్యక్తిగత, ఆర్థిక సమాచారమంతా ఉంటోంది. దీంతో హ్యాకర్లు ఫోన్లను ఈజీగా హ్యాక్ చేస్తుంటారు. ఇప్పుడు ఫోన్ హ్యాకింగ్‌ను పసిగట్టడమెలాగో చూద్దాం.


హ్యాక్ సంకేతాలివే..
మీ ఫోన్ వేగం బాగా తగ్గిపోయినా, యాప్స్ వంటివి ఎంతకూ ఓపెన్ కాకపోయినా, ఇంటర్నెట్ వాడేటప్పుడు అదేపనిగా పాపప్‌లు ఓపెన్ వస్తున్నా మీ ఫోన్ హ్యాక్ అయినట్లు భావించాలి.

ఇవి గమనించండి!
మీ ఫోన్‌లో కొత్త యాప్స్ కనిపించడం, మీ ప్రమేయం లేకుండా కాల్స్, మెసేజ్‌లు వెళ్లడం, ఇంటర్నెట్ డేటా త్వరగా అయిపోవడం, మొబైల్ స్క్రీన్‌లాక్ ఓపెన్ అవడం వంటివి జరిగినా మీ ఫోన్ హ్యాక్ అయినట్లే.


ఏం చేయాలి?
మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయినట్లు అనిపిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీ ఫోన్‌లో కొత్త యాప్స్ కనిపిస్తే డిలీట్ చేయండి. యాంటి వైరస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని రన్ చేయండి.

పాస్‌వర్డ్స్ మార్చండి!
ఫోన్‌లో లాగిన్ పాస్‌వర్డ్స్‌ను మార్చుకుని, డేటాను బ్యాకప్ చేసుకుని ఫోన్‌ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. ఆ తర్వాత కూడా హ్యాక్ సంకేతాలు కనిపిస్తే సైబర్ సెక్యురిటీకి సమాచారమిచ్చి వారి సాయం తీసుకోండి.

Related News

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Big Stories

×