BigTV English

ChatGPT services for Microsoft users : మైక్రోసాఫ్ట్‌ యూజర్లకు చాట్‌జీపీటీ సేవలు

ChatGPT services for Microsoft users : మైక్రోసాఫ్ట్‌ యూజర్లకు చాట్‌జీపీటీ సేవలు

ChatGPT services for Microsoft users :టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్న చాట్‌జీపీటీ సేవలను… త్వరలో మైక్రోసాఫ్ట్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. త్వరలోనే చాట్‌జీపీటీ మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌ ఓపెన్‌ ఏఐ సేవలు తమ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని… వాటి ద్వారా ప్రపంచంలోనే అత్యాధునికమైన ఏఐ సేవలను, వినియోగదారులు తమ వ్యాపారాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.


మైక్రోసాఫ్ట్ తన సెర్చ్‌ ఇంజిన్‌ బింగ్‌లో చాట్‌జీపీటీ సేవలను పరిచయం చేస్తుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సత్య నాదెళ్ల ప్రకటనతో చాట్‌జీపీటీపై టెక్‌ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. బింగ్‌ సెర్చ్‌ ఇంజిన్‌తో పాటు వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లో కూడా చాట్‌జీపీటీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.

సెర్చ్‌ ఇంజిన్‌ తరహాలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీని… ఓపెన్‌ ఏఐ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఇందులో మైక్రోసాఫ్ట్ 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడుతోందని ఇటీవల వార్తలొచ్చాయి. సత్య నాదెళ్ల తాజా ప్రకటనతో ఓపెన్ ఏఐతో మైక్రోసాఫ్ట్ జట్టు కట్టడం ఖాయమైపోయిందని టెక్‌ వర్గాలు అంటున్నాయి. భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ క్లౌడ్‌ సేవలు ఉపయోగించుకుంటున్న వాళ్లు… చాట్‌జీపీటీ సేవలను అదనంగా పొందవచ్చు. అజ్యూర్‌ యూజర్లకు ఇప్పటికే జీపీటీ-3.5, DALL-E2, Codex వంటి ఏఐ ఆధారిత సేవలు అందుబాటులో ఉన్నాయి.


చాట్‌జీపీటీ భద్రతపైనా మైక్రోసాఫ్ట్ ప్రకటన చేసింది. అసభ్య పదజాలం, హింసను ప్రేరేపించే సమాచారం, అసత్య వార్తలు వంటి వాటిని ఎప్పటికప్పుడు నిరోధించేలా… కంపెనీ ఏఐ నియమ నిబంధనలకు అనుగుణంగా అజ్యూర్‌ ఓపెన్‌ ఏఐ సర్వీస్‌లో మార్పులు చేసినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఒకవేళ యూజర్లు కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నట్లు గుర్తిస్తే… వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ChatGPT: గూగుల్‌ గుబుల్.. దూసుకొస్తున్న చాట్‌జీపీటీ!

Apple Watch: యాపిల్‌ వాచ్‌ను తలదన్నే వాచ్‌.. ధర తెలిస్తే ఎగబడి కొనాల్సిందే!

Follow this link for more updates :- Bigtv

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×