BigTV English

Indian Immigrants : అమెరికాకు వలసవెళుతున్న ఇండియన్లపై స్టడీ..

Indian Immigrants : అమెరికాకు వలసవెళుతున్న ఇండియన్లపై స్టడీ..
Indian Immigrants

Indian Immigrants : ఇండియాలో యువత ఎక్కువగా ఉన్నా వారిలో టాలెంట్ లేదని.. చదువుల విషయంలో చాలామంది ఆసక్తి చూపించరని.. ఇలాంటి ఎన్నో విమర్శలను మనం ఎంతోకాలంగా వింటూనే ఉన్నాం. అలాంటివారికి సరైన సమాధానం ఇవ్వడం కోసమేనేమో కొందరు యువతీయువకులు ఫారిన్ దేశాలకు వెళ్లి.. అక్కడ భారతీయుల సత్తా చాటుతున్నారు. ప్రస్తుత కాలంలో ప్రతీ ఫారిన్ దేశంలో చెప్పుకోదగిన ఒక్క ఇండియన్ అయినా ఒక ఉన్నతస్థాయిలో కనిపిస్తున్నారని సర్వేలు చెప్తున్నాయి.


మైక్రోసాఫ్ట్‌కు సత్య నాదెళ్ల, ఆల్పాబెట్‌కు సుందర్ పిచై.. వీటితో పాటు ఐబీఎమ్, అడోబ్, పాలో ఆల్టో నెట్‌వర్క్స్, వీఎమ్‌వేర్, విమియో.. ఇలాంటి ఎన్నో సంస్థలలో కామన్ పాయింట్ ఏంటంటే.. వాటిలోని ఉన్నతస్థాయిలో భారతీయులు, లేదా భారత సంతతికి చెందినవారు ఉండడమే. తాజాగా భారత్ నుండి వెళ్లి ఇతర దేశాల్లో తమ సత్తాచాటుకున్న వ్యక్తులపై భూటాన్.. ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో అందరికీ తెలియని ఇంకా ఎందరో వ్యక్తుల గురించి కూడా బయటపడింది.

భూటాన్ చేసిన సర్వే ప్రకారం.. దాదాపు భారత్‌కు చెందిన దాదాపు నాలుగు మిలియన్ మైనరీటల వ్యక్తులు అమెరికాలో ఉన్నతస్థానంలో ఉన్నారు. అందులో ఒక మిలియన్ వ్యక్తులు.. సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా వృత్తిని కొనసాగిస్తున్నారు. వారిలో కూడా 70 శాతంకు పైగా వ్యక్తులకు హెచ్ 1బీ వీసా ఉన్నట్టు తెలిసింది. అంతే కాకుండా భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని సర్వే తెలిపింది. తాజాగా యూట్యూబ్‌కు సీఈఓగా అపాయింట్ అయ్యింది కూడా ఒక భారత సంతతి అని గుర్తుచేసింది.


అమెరికాలో పనిచేస్తున్న ఎక్కువశాతం భారత సీఈఓలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో చదువుకున్నవారే అని భూటాన్ సర్వే తేల్చింది. కేవలం 2 శాతం యువతకు మాత్రమే అందులో అడ్మిషన్ దొరకుతుందని, అలా అడ్మిషన్ దొరికి చదువుకున్న తర్వాత వారు ఫారిన్ కలలతో అక్కడికి పయణమవుతున్నారని తెలుస్తోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని, అందుకే ఫారిన్ దేశాలు కూడా ఇక్కడ చదువుకున్నవారికి ఉద్యోగాలు ఇవ్వడంలో ముందుంటాయి.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×