Smart Tv Offers : ప్రస్తుతం ఇ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో దీపావళి సేల్స్ కొనసాగుతున్నాయి. అదిరే ఆఫర్లతో బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను అందిస్తున్నాయి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర సంస్థలు. మరి భారీ డిస్కౌంట్లతో తక్కువ ధరకే అందుబాటులో ఉన్న టాప్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు, వాటి ఫీచర్స్ స్పెసిఫికేషన్స్‌ను ఇక్కడ తెలుసుకుందాం.
1.Acer 139 cm 55 inches – ఈ Acer Smart TV ధర రూ.30,999. 60 రిఫ్రెష్ రేట్ Hertz, 178 డిగ్రీ వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌తో 4K అల్ట్రా HD (3840×2160)తో వచ్చింది. కనెక్టివిటీ కోసం డ్యూయల్ బ్యాండ్ Wifi, 2 వే బ్లూటూత్, బ్లూ-రే స్పీకర్లు లేదా గేమింగ్ కన్సోల్‌ను కలిగి ఉంది.
2.Kodak 126 cm 50 inches – ఈ కోడాక్ 126 సెం.మీ (50 అంగుళాలు) టీవీ ధర రూ. 23,999. QLED, AMO టెక్నాలజీ, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, సోనీ లివ్, హంగామా, జియో సినిమా, జీబీ, ఎరోస్ నవ్ వంటి అప్లికేషన్స్‌ను సపోర్ట్ చేస్తుంది.
3.LG 108 cm 43 inches – ఈ LG స్మార్ట్ టీవీ రూ. 29,980కే అందుబాటులో ఉంది. యూజర్ ప్రొఫైల్స్ కోసం వెబ్ఓఎస్ 23, ఫిల్మ్‌మేకర్ మోడ్, HDR 10 & HLG, గేమ్ ఆప్టిమైజర్, ALLM, HGIG మోడ్, అపరిమిత OTT యాప్‌లు, AI బ్రైట్‌నెస్ కంట్రోల్, 4K అప్‌స్కేలింగ్ & AI సౌండ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
4.ONIDA 139 cm 55 inch – ఈ Onida స్మార్ట్ టీవీ, 2 టేబుల్ స్టాండ్ బేస్, 1 వాల్ మౌంట్, 1 యూజర్ మాన్యువల్, 1 వారంటీ కార్డ్, 1 రిమోట్ కంట్రోల్, 1 AV IN అడాప్టర్, 1AC కార్డ్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఇది రూ. 32,999కు లభిస్తుంది.
5. Sony Bravia 108 cm 43 inches – ఈ సోనీ స్మార్ట్ టీవీ ధర రూ. 38,990. అలెక్సా గూగుల్ టీవీ, వాచ్‌లిస్ట్, వాయిస్ సెర్చ్, గూగుల్ ప్లే, క్రోమ్‌కాస్ట్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సహా యాపిల్ ఎయిర్ ప్లే, యాపిల్ హోమ్ కిట్, అలెక్సా వంటి ఫీచర్లు, అప్లికేషన్స్‌ను సపోర్ట్ చేస్తుంది.
6. TOSHIBA 139 cm 55 inches – ఈ తోషిబా 139 సెం.మీ (55 అంగుళాలు) ధర రూ. 36,999. 4K అప్‌స్కేలింగ్, గేమ్ మోడ్ ప్లస్, ఆటో లో లేటెన్సీ మోడ్, డాల్బీ విజన్, డాల్బీ అటామ్స్, AI PQ, వాయిస్ అసిస్టెంట్, ఎయిర్‌ప్లే వంటి ఫీచర్స్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియోను సపోర్ట్ చేస్తుంది.
7. Vu 139 cm 55 inches – ఈ Vu స్మార్ట్ టీవీ ధర రూ.35,999. 16 జీబీ స్టోరేజ్ + 2GB ర్యామ్, గ్లో ఏఐ ప్రాసెసర్, గూగుల్ ఎకో-సిస్టమ్ (మూవీ, టీవీ, సంగీతం, ఆటలు), క్రోమ్ క్యాస్ట్ బుల్ట్ ఇన్, డ్యూయల్ బ్యాండ్ WiFi , బ్లూటూత్ 5.1 ఫీచర్స్ ఉన్నాయి.
8. Xiaomi 125 cm 50 inches – ఈ Xiaomi 125 cm (50 అంగుళాలు) రూ. 32,999కు అందుబాటులో ఉంది. 2 టేబుల్ స్టాండ్ బేస్, 1 యూజర్ మాన్యువల్, 1 వారంటీ కార్డ్, 1 రిమోట్ కంట్రోల్, 1AC పవర్ కార్డ్, 2 AAA బ్యాటరీ, వైఫై, యూఎస్బీ, ఎథర్‌నెట్, హెచ్డీఎమ్ఐ వంటి ఫీచర్స్‌తో వచ్చింది.
ALSO READ : ఓడియమ్మా.. ఏం ఆఫర్స్ బాసూ.. బడ్జెట్లోనే దొరికే ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!