Best Mobiles Under 10000 : రూ. 10వేలలోపే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. తక్కువ ధరలోనే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. రియల్ మీ, రెడ్ మీ, మోటోరోలా, టెక్నో మొబైల్స్ కేవలం 10వేలలోపే అందుబాటులో ఉన్నాయి. వీటి ఫీచర్స్ సైతం హై స్టాండర్డ్స్ ను కలిగి ఉండటంతో లో బడ్జెట్లో బెస్ట్ మొబైల్ కొనాలనుకునే వారికి ఇదే మంచి ఆప్షన్ గా తెలుస్తుంది.
అతి తక్కువ ధరలోనే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ కొనాలనుకునే కస్టమర్ అమెజాన్ లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్స్ పై ఓ లుక్కేయవచ్చు. అతి తక్కువ ధరకే Poco M6 Pro 5G, Itel P55 5G, Realme Narzo 50A, Redmi 12 4G, Motorola Moto E40, Tecno Pova 4 తో పాటు Redmi Note 13C, Realme Narzo N61 తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.
Poco M6 5G – రూ. 10,000లోపు స్మార్ట్‌ఫోన్స్ కొనాలనుకునే కస్టమర్స్ కు ఈ మెుబైల్ బెస్ట్ ఆఫ్షన్. ఈ మెుబైల్ ధర రూ. 9,999. 90Hz డిస్‌ప్లే, Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో మెుబైల్ అందుబాటులో ఉంది.
Itel P55 5G – Itel P55 5G మెుబైల్ ధర రూ. 10,000. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్‌తో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
Realme Narzo 50A – 4GB RAM + 128GB స్టోరేజ్, MediaTek Helio G85 ప్రాసెసర్, 50MP కెమెరాతో లాంఛ్ అయిన ఈ మెుబైల్ ధర రూ.7999
Redmi 12 4G – Xiaomi అత్యంత తక్కువకే లాంఛ్ చేసిన బెస్ట్ మెుబైల్ ఇదే. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6GB RAM, 128GB స్టోరేజ్ ఫోన్ ధర రూ. 9999
Motorola Moto E40 – Carbon Gray కలర్ లో 64 GB + 4 GB RAM వేరియంట్ ధర రూ.6499. 90Hz రిఫ్రెష్ రేట్, Unisoc T700 చిప్ సెట్ తో అందుబాటులో ఉంది.
Tecno Pova 4 – రూ. 10వేలలోపే దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్ Tecno Pova 4. MediaTek Helio G99 చిప్, 50 మెగాపిక్సెల్ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్, 6.8అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది.
Redmi Note 13C – ఈ మెుబైల్ 1650 x 720 పిక్సెల్ రిజల్యూషన్ 6.71 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek Helio G85 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ సదుపాయం అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ధర రూ. 8999.
Realme Narzo N61 – 5,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 6GB RAM + 128 GB స్టోరేజ్ తో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 8499
మరి ఇంకెందుకు ఆలస్యం.. ఎప్పటినుంచో అతి తక్కువ ధరలోనే బెస్ట్ క్వాలిటీ మొబైల్ కొనాలి అనుకునేవారు ఈ మొబైల్స్ ను హ్యాపీగా ట్రై చేసేయొచ్చు.
ALSO READ : బెస్ట్ స్నాప్ డ్రాగన్ మెుబైల్స్ ఇవే.. క్వాలిటీ, ధర, ఫీచర్స్ వేరే లెవెల్ అంతే!