Best Gadget Gifts For Sibilings : తోబుట్టువుంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. వాళ్లకి ఎప్పటికప్పుడు మంచి గిఫ్ట్ ఇవ్వాలనే అందరికి ఉంటుంది. అయితే ఏ గిఫ్ట్ ఇవ్వాలి అనేది మాత్రం చాలా డైలమాలో పడేస్తుంది. మరి వాళ్లు వర్క్ చేస్తున్నా.. చదువుకుంటున్నా ఉపయోగపడే టెక్ గిఫ్ట్ ఇవ్వొచ్చు. ఇది వాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి సిబ్లింగ్స్ కు ఇచ్చే బెస్ట్ టెక్ గిఫ్ట్ ఏంటో ఓ సారి చూద్దాం.
చిన్నవారికైనా, పెద్దవారికైనా టెక్ గ్యాడ్జెట్స్ ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే ఆ ఆనందమే వేరు. మరి వారికి ఎంతగానో ఉపయోగడే లిస్ట్ ఇదే. స్మార్ట్ వాచ్, TWS, ఇన్‌స్టాక్స్ కెమెరా, బ్లూటూత్ స్పీకర్, పవర్ బ్యాంక్ ఇంకా ఏమేం ఉన్నాయో చూద్దాం.
స్మార్ట్ వాచ్ – మీ ప్రియమైన అన్నాదమ్ములు టెక్ ట్రెండ్ ను ఫాలో అయ్యే వారైతే స్మార్ట్ వాచ్ ఇవ్వటం బెస్ట్ ఆప్షన్. స్మార్ట్ వాచ్ గ్యాడ్జెట్ గానే కాకుండా ఫిట్‌నెస్ ట్రాకింగ్, హెల్త్ మానిటరింగ్, వాచ్ ఫేస్‌ల వంటి అధునాతన ఫీచర్స్ తో వచ్చేసింది. ఇక టాప్ కంపెనీలకు చెందిన బెస్ట్ స్మార్ట్ వాచెస్ సైతం అందుబాటు ధరలలోనే దొరకుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం బెస్ట్ స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చి మీ వాళ్లను హ్యాపీ చేసేయండి.
TWS – సంగీత ప్రియులైన సోదరులు ఉంటే ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ బెస్ట్ ఆఫ్షన్. TWSతో ఇష్టమైన ట్యూన్స్ ను ఆనందంగా ఎంజాయ్ చేసేయండి. ఇక వీటిలో లేటెస్ట్ అప్డేట్స్ తో స్టైలిష్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇన్‌స్టాక్స్ కెమెరా – జర్నీ ఇష్టపడే తోబుట్టువులుంటే బెస్ట్ ఆఫ్షన్ ఇన్‌స్టాక్స్ కెమెరా. ఈ కెమెరాలతో బెస్ట్ పిక్చర్స్ ను జర్నీలో క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్‌స్టాక్స్ కెమెరాలలో చాలా మోడల్స్ ఉన్నాయి. వీటిలో ఫిల్మ్‌లు, ఫిల్టర్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. ఇక వీటిలో ది బెస్ట్ ను సెలెక్ట్ చేసి గిఫ్ట్ ఇస్తే అదిరిపోవల్సిందే.
బ్లూటూత్ స్పీకర్ – కావల్సిన వారికి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్స్ లో బ్లూటూత్ స్పీకర్స్ ఎప్పటికీ బెస్ట్ ఆఫ్షనే. బ్లూటూత్ స్పీకర్స్ ను ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. హౌస్ పార్టీల నుండి అవుట్‌డోర్ పిక్నిక్‌ల వరకూ ఉపయోగపడే బెస్ట్ స్పీకర్స్ అందుబాటులో ఉన్నాయి. బెస్ట్ సౌండ్ క్వాలిటీతో పాటు కాల్ టేకింగ్ ఫీచర్స్ తో సైతం అందుబాటులో ఈ స్పీకర్స్ ను హ్యాపీగా గిఫ్ట్ ఇచ్చేయండి.
పవర్ బ్యాంక్ – ప్రయాణాల్లో ఎక్కువగా గడపాల్సి వచ్చే తోబుట్టువులకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ పవర్ బ్యాంక్. పవర్ అవుట్‌లెట్ అందుబాటులో లేని సమయాల్లో ఫోన్, కెమెరా లేదా ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేయటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పవర్ బ్యాంక్స్ అంతర్నిర్మిత ఫ్లాష్‌లైట్‌లతో వస్తున్నాయి. ఇక చీకటిలో సైతం ఇవి ఎంతో ఉపయోగపడతాయి. సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే లైట్ వెయిట్ పవర్ బ్యాంక్స్ సైతం ఈ మధ్య కాలంలో అందుబాటులోకి వచ్చాయి. సో కావాలనుకుంటే వీటిని హ్యాపీ గా ట్రై చెయ్యెచ్చు.
ALSO READ : దిమ్మతిరిగే ఫీచర్స్ తో వచ్చేసిన ఈ మెుుబైల్స్ లో ఏది బెస్టో సెలెక్ట్ చేసుకోండిలా!