EPAPER

Best Camera Smartphones: బెస్ట్ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా.. ఇంతకంటే మరేదైనా ఉంటుందా?

Best Camera Smartphones: బెస్ట్ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా.. ఇంతకంటే మరేదైనా ఉంటుందా?

Budget Camera Smartphones: చాలా మంది ఫోన్ ప్రియులు తమ బడ్జెట్‌లో అద్భుతమైన కెమెరా, అదిరిపోయే ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. కానీ వారికి అనుకూలమైన ధరలో అలాంటి ఫీచర్లు గల ఫోన్‌ ఒక్కటి కూడా కంటపడదు. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. ఎందుకంటే మీ బడ్జెట్‌ ధరలో, అనేక ఫీచర్లు గల ఫోన్‌లు ఇక్కడ అందించబడ్డాయి. అందువల్ల మీరు అలాంటి ఫోన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇదే సరైన సమయం. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ Amazon మంచి కెమెరా సిస్టమ్‌లతో అనేక ఎంపికలను కలిగి ఉంది. Realme, Samsung, OnePlus వంటి బ్రాండెడ్ ఫోన్‌లను అతి తక్కువ ధరలోనే అందిస్తుంది. ఇప్పుడు వాటికి సంబంధించిన ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.


Samsung Galaxy M35 5G

మంచి కెమెరాతో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారి కోసం Samsung Galaxy M35 5G గొప్ప ఎంపిక. ఇది రూ.19,999 ధరతో అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు బ్యాంక్ కార్డులపై రూ.2,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. Galaxy M35 5G ఫోన్ FHD+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల 120Hz డిస్‌ప్లేతో వస్తుంది. 50MP OIS మెయిన్ లెన్స్, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌తో ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. మూడవ లెన్స్ 2MP మాక్రో యూనిట్‌తో వస్తుంది. అలాగే ఈ ఫోన్‌కి Exynos 1380 చిప్‌సెట్ శక్తినిస్తుంది. ఇది 6GB RAM + 128GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో భారీ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది Android 14 OSలో బూట్ అవుతుంది.


Also Read: వివో దూకుడు.. 6000mAh బ్యాటరీతో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్, ఫీచర్లు అరాచకం!

OnePlus Nord CE 4 5G

అమెజాన్‌లో అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉన్న సూపర్ ఫోన్ OnePlus Nord CE 4. ఇది రూ. 24,998 ధరతో లభిస్తుంది. కొనుగోలుదారులు బ్యాంక్ కార్డ్‌లపై రూ.3,000 తగ్గింపును పొందుతారు. అప్పుడు మరింత తక్కువకు ఇది లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల డిస్‌ప్లే, FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ వంటివి ఉన్నాయి. ఇది 50MP OIS మెయిన్, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్‌తో ఆధారితం అయింది. 8GB RAM + 256GB స్టోరేజ్‌తో జత చేయబడింది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ మొబైల్ Android 14 OSలో బూట్ అవుతుంది.

Realme Narzo 70 Pro 5G

మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్న వారికి Realme Nazo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 18,998 ధరతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా కొనుగోలుదారులు రూ.2,750 అదనపు తగ్గింపును పొందుతారు. అప్పుడు మరింత తక్కువ ధరకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 50MP సోనీ IMX890 ప్రధాన లెన్స్‌తో డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది OIS మద్దతును కలిగి ఉంది. ఇది డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌తో ఆధారితం అయింది. 8GB RAM + 256GB స్టోరేజ్‌తో జత చేయబడింది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ మొబైల్ Android 14 OSలో బూట్ అవుతుంది.

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×