Big Stories

Anticancer therapies:- ట్యూమర్‌లోని బ్యాక్టీరియాతో మెరుగైన థెరపీలు…

- Advertisement -

Anticancer therapies:- ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాల జరగడానికి కారణం క్యాన్సర్ అని స్టడీ చెప్తోంది. అందుకే క్యాన్సర్ నుండి మనుషులను కాపాడడానికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్త థెరపీలతో, చికిత్సలతో ముందుకొస్తున్నారు. అయినా కూడా మరణాలు అదుపులోకి రావడం లేదు. ఒకప్పటితో పోలిస్తే.. యాంటీక్యాన్సర్ చికిత్సలు ఈమధ్య బాగా మెరుగుపడ్డాయి. కానీ అవి పలు సైడ్ ఎఫెక్ట్స్‌కు దారితీస్తున్నాయి. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని కనిపెట్టారు.

- Advertisement -

క్యాన్సర్‌ను గుర్తించడం, దానికి చికిత్స అందించడం సులభమే అయినా.. గత కొన్నేళ్లుగా ట్యూమర్లు హైపాక్సిక్‌గా మారుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే శరీరంలో ఆక్సిజన్ ఎక్కువగా చేరలేని ప్రాంతాలలో ట్యూమర్లు ఫార్మ్ అవ్వడం ప్రారంభమయ్యింది. అందుకే ట్యూమర్ ఏ బ్యాక్టీరియాతో అయితే పెరుగుతుందో.. అదే బ్యాక్టీరియా సాయంతో దాని వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది క్యాన్సర్ చికిత్సను కొత్త మలుపు తిప్పనుందని వారు భావిస్తున్నారు.

జెనటిక్ ఇంజనీరింగ్, సింథటిక్ బయోఇంజనీరింగ్, నానోటెక్నాలజీ వంటి టెక్నిక్స్ ఇప్పటికే క్యాన్సర్‌ను గుర్తించడానికి అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ టెక్నిక్‌ను ఉపయోగించాలన్నా ముందుగా ట్యూమర్ అనేది ఏ బ్యాక్టీరియాతో ఫార్మ్ అయ్యిందో తెలుసుకోవాలి. శాస్త్రవేత్తలు తాజాగా చేసిన పరిశోధనల్లో ఈ బ్యాక్టీరియాలోని యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయని వారు గుర్తించారు. ట్యూమర్ వెనుక ఉన్న బ్యాక్టీరియా ఎలాంటి కనుక్కోని, దాని సాయంతోనే పేషెంట్లకు చికిత్సను అందించవచ్చని అన్నారు.

ఎన్నో ఏళ్లుగా క్యాన్సర్‌పై శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో.. ఒక బ్యాక్టీరియా స్పీసిస్ అనేది ఎక్కువగా ట్యూమర్స్‌లో పెరుగుతున్నట్టు గుర్తించారు. అదే ఇంట్రాట్యూమరల్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాను ఉపయోగించే వారు పలు యాంటీక్యాన్సర్ థెరపీలను కనిపెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడా. అయితే ఇప్పుడు ఈ పరిశోధనల్లో వేగం పెంచాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కేవలం ఇంట్రాట్యూమరల్ బ్యాక్టీరియా మాత్రమే కాకుండా ఇది నేచురల్ పర్పుల్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాతో కలిసినప్పుడు తయారు చేయగలిగే యాంటీ క్యాన్సర్ థెరపీలు మరింత మెరుగ్గా ఉంటాయని వారు గుర్తించారు.

ఈ రెండు రకాల బ్యాక్టీరియాలు మాత్రమే కాకుండా ఇప్పటికీ మరో రకం బ్యాక్టీరియాను కూడా ట్యూమర్లలో కనిపెట్టారు శాస్త్రవేత్తలు. అంతే కాకుండా వీటిని జాగ్రత్తగా భద్రపరిచారు. ప్రస్తుతం వీటిపై పరిశోధనలు మొదలయ్యాయి. ఒకవేళ వారి ప్రయోగాలు సక్సెస్ అయితే మరికొన్ని యాంటీ క్యాన్సర్ థెరపీలు క్యాన్సర్ పేషెంట్లకు కొత్త జీవితాన్ని అందించడానికి ఉపయోగపడతాయి. ఈ బ్యాక్టీరియా ద్వారా తయారు చేసిన డ్రగ్.. ట్యూమర్లలో ఇంజెక్ట్ చేస్తే యాంటీట్యూమర్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News