EPAPER

iPhone : డేంజర్‌లో ఐఫోన్ యూజర్స్..!

iPhone : డేంజర్‌లో ఐఫోన్ యూజర్స్..!

Attention IOS Users : ఐఫోన్ సెక్యూరీటికి పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా సెక్యూరిటీ, డేటా ప్రైవసీ కోసమే చాలా మంది ఐఫోన్స్ వాడుతుంటారు. అలాంటిది ఓ ప్రమాదకరమైన వైరస్ ఇప్పుడు ఐఫోన్ యాజర్లను డేంజర్‌లో పడేస్తోంది. యూజర్‌కి తెలియకుండానే.. ముఖ్యమైన డేటాను దొంగిలించి, బ్యాంక్ ఖాతా నుంచి సొమ్మును కాజేస్తోంది. దీనిని గోల్డ్ పికాక్స్ ట్రోజన్ వైరస్ అంటారు. దీనితో చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.


ట్రోజన్​ వైరస్​ అనేది ఎన్నోశతాబ్ధాల నుంచి ఉంది. కానీ ఇప్పుడు ఐఫోన్‌లను టార్గెట్ చేస్తూ బయటకు వచ్చింది. ఈ వైరస్‌లో అనేక అడ్వాన్స్ ఫీచర్లు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తున్న విషయం.

Read More : భారత్‌లో 2 లక్షల ‘ఎక్స్’ ఖాతాల నిషేధం..


టెక్​రాడార్​ నివేదిక ప్రకారం.. ఈ గోల్డ్ పికాక్స్ ట్రోజన్ వైరస్‌ను 2023 అక్టోబర్‌లో గుర్తించారు. అనంతరం ఇది అప్డేట్ అవుతూ.. ఐఓఎస్ డివైజ్ల భద్రతకు ముప్పుగా మారింది. ముఖ్యంగా ఈ సాఫ్ట్‌వేర్ ఐఫోన్లనే టార్గెట్ చేస్తోంది.

ఈ వైరస్ ఐఫోన్‌లోకి ప్రవేశించి.. ఐడెంటిటీ డాక్యుమెంట్లు, టెక్ట్స్ మేసేజ్‌లు స్కాన్ చేస్తోందట. ఆ స్కానింగ్‌లో మీ బ్యాంకింగ్ దొరికితే మీ ఖాతా ఖాళీ చేస్తుందట.

Read More : టెక్ట్స్ నుంచి నేరుగా వీడియో!

గోల్డ్ పికాక్స్ ట్రోజన్ వైరస్ ముఖ్యంగా బయోమెట్రిక్ డేటాను చోరి చేస్తుంది. దీని ద్వారా ఏఐ ఆధారిత డీప్‌ఫేక్స్ క్రియేట్ చేసి ఆథరైజ్ లేకుండా బ్యాంక్ అకౌంట్స్‌కి యాక్సెస్ పొందుతుంది. ఈ తరహా కేసులు థాయిలాండ్‌లో నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ వైరస్ మరిన్ని దేశాలకు విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఐఓఎస్ డివైజెస్‌లోకి ఎటువంటి వైరస్‌లు ప్రవేశించించడం అసాధారణం. కానీ గోల్డ్ పికాక్స్ ట్రోజన్ వైరస్ వాటిని ఛేదించుకుని వెళుతోందంటే.. ఈ వైరస్ ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు. యాపిల్ మొబైల్ టెస్టింగ్ ఫ్లాట్‌ఫామ్ టెస్ట్‌ఫ్లైట్‌ని హ్యాక్ చేసి గోల్డ్ పికాక్స్ వైరస్‌ని హ్యాకర్లు ప్రవేశపెట్టినట్లు టెక్ వర్గాల సమాచారం.

Tags

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×